త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar | కేటీఆర్ బొచ్చుపై రాజకీయం చేస్తే కరెంట్ రాదు

Dasoju Sravan Kumar | క‌రెంటు ఇవ్వ‌కుండా రైతుల నోట్లో మ‌ట్టి కొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy)ని న‌డిరోడ్డుపై ఉరి తీయాల‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఫైర‌య్యారు.

S

Telangana | Published On Oct 15, 2026, 3.39 pm IST

Dasoju Sravan Kumar | కేటీఆర్ బొచ్చుపై రాజకీయం చేస్తే కరెంట్ రాదు
Advertisement
  • కరెంట్ కష్టాలు పోవాలంటే రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి
  • కరెంట్ ను కుదేలు చేసినందుకు ఆయ‌న ముమ్మాటికీ సామాజిక నేరస్థుడే
  • ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ధ్వ‌జం

Dasoju Sravan Kumar | త్రినేత్ర న్యూస్‌: క‌రెంటు ఇవ్వ‌కుండా రైతుల నోట్లో మ‌ట్టి కొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy)ని న‌డిరోడ్డుపై ఉరి తీయాల‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఫైర‌య్యారు. కేటీఆర్ బొచ్చుపై రాజ‌కీయం చేస్తే క‌రెంటు రాద‌ని.. క‌రెంటు క‌ష్టాలు పోవాలంటే రేవంత్‌రెడ్డిని స‌స్పెండ్ చేయాల‌ని వ్యాఖ్యానించారు. క‌రెంటును కుదేలు చేసినందుకు రేవంత్‌రెడ్డి ముమ్మాటికీ సామాజిక నేర‌స్థుడే అన్నారు. సింగ‌రేణిలో 40 ల‌క్ష‌ల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం చేశార‌ని ఆరోపించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఓట్లు తొలిగించినందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తొలిగిపోవాల్సిందేన‌న్నారు.

గోదావరిఖనిలో సింగరేణి కార్మిక గర్జన సభ సక్సెస్ అయింది. కార్మికులు మలినం అవుతూ దేశానికి బొగ్గు అందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలకు వ్యతిరేకంగా అనేక ధర్నాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ కష్టాలు ఉంటాయిని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అసాధ్యం అనుకున్న కరెంట్‌ను కేసీఆర్ సుసాధ్యం చేశారు. ఈ ప్రభుత్వంలో కరెంట్ రంగం విధ్వంసం అయిపోయింది. ఈ ప్రభుత్వం బొచ్చుపై రాజకీయం చేస్తుంది. కేటీఆర్ బొచ్చుపై రాజకీయం చేస్తే కరెంట్ రాదు.
అధికారులను సస్పెండ్ చేస్తే కరెంట్ కష్టాలు పోవు. రేవంత్‌ను తొల‌గించాలి.

అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎవరైనా రాజీనామా చెయ్యాల్సిందే. రేవంత్ రెడ్డి చేతగానితనంతోనే రాష్ట్రంలో కరెంట్ కష్టాలు ఉన్నాయి. కేసీఆర్ కాలంలో మూత పడిన జనరేటర్లు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జనరేటర్‌ల కాలం వచ్చింది. రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి 80 సార్లు ఢిల్లీకి వెళ్లారు. కరెంట్ కోతలు లేవని భ‌ట్టి విక్రమార్క అంటున్నాడు. గ్రామాల్లో కరెంట్ కోతలతో విద్యుత్ కేంద్రాల వద్ద ధర్నాలు చేస్తున్నారు. విద్యుత్ కేంద్రాల వద్ద రైతులు ధర్నాలు చేస్తున్నారు.

కాలిపోయిన మోటర్లకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి. సింగరేణిలో పవర్ ఉత్పత్తి తక్కువ చేస్తున్నారు. జైనూరు ప్లాంట్ లో పవర్ ఉత్పత్తి తక్కువ అయింది. ఓట్లు తొలిగించినందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని మాట్లాడే కాంగ్రెస్ నాయకులు.. 40 లక్షల బొగ్గు మాయం చేసినందుకు రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. బొగ్గు ఏమైందిని అడిగితే కేటీఆర్, హరీష్ రావుపై రాజకీయం చేస్తున్నారు.

ఈ ప్రభుత్వం సింగరేణిని శాశ్వతంగా అదానీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాళేశ్వరం రిపేర్ చేయొచ్చు. ఈ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రైతుల్లో మన్ను కొట్టారు. రైతుల నోట్లో మట్టి కొట్టిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని నడిరోడ్డుపై ఉరి తియ్యాలి. కాళేశ్వరం నీళ్లు ఎత్తకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. రైతులకు మళ్ళీ బోర్ల వ్యవసాయం వచ్చింది. శాశ్వతంగా కరెంట్ సమస్య లేకుండా కేసీఆర్ తెలంగాణకు అందించారు.

సింగ‌రేణి బొగ్గుపై వెంట‌నే విచార‌ణ చేయాలి

ఈ ప్రభుత్వం శాశ్వతంగా తెలంగాణకు కరెంట్ సమస్య తెచ్చింది. సింగరేణి బొగ్గుపై వెంటనే విచారణ చేయాలి. సింగరేణికి 60 వేల కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి. ఎల్ నినో ప్రభావాన్ని రైతులను అప్రమత్తం చేయ‌డంలో ఈ ప్రభుత్వం విఫలం అయింది. ఆడలేక మధ్యల దరువు అన్నట్లు కరెంట్ సమస్య పై అధికారులను సస్పెండ్ చేశారు. కరెంట్ సమస్యపై రేపటి అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని దాసోజు డిమాండ్ చేశారు.

ఈ ప్రెస్ మీట్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కె .కిశోర్ గౌడ్, ఉపేంద్ర చారి పాల్గొన్నారు.

Advertisement
Advertisement