Swiggy | ఇక ‘ఏఐ’ ద్వారా ఫుడ్ డెలివరీ ఆర్డర్.. ప్రారంభించిన స్విగ్గీ..
Swiggy | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పటికే అనేక రంగాలలో సేవలను అందిస్తోంది. దీని కారణంగా ప్రజల జీవితాల్లో ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పూర్వం గంటలు లేదా రోజులు, నెలల వ్యవధి తీసుకునే పని కూడా ఇప్పుడు ఏఐ పుణ్యమా అని నిమిషాల్లోనే పూర్తవుతోంది.
Technology | Published On Jan 28, 2026, 8.47 am IST
Swiggy | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పటికే అనేక రంగాలలో సేవలను అందిస్తోంది. దీని కారణంగా ప్రజల జీవితాల్లో ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పూర్వం గంటలు లేదా రోజులు, నెలల వ్యవధి తీసుకునే పని కూడా ఇప్పుడు ఏఐ పుణ్యమా అని నిమిషాల్లోనే పూర్తవుతోంది. ఈ క్రమంలోనే ఏఐ అద్భుతాలను గమనించిన ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీ కృత్రిమ మేథను తమ రంగంలో కూడా ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) ఇకపై తన సేవల్లో ఏఐని వినియోగించనుంది. ఈ క్రమంలోనే ఏఐ ఆధారిత ఆర్డరింగ్ వ్యవస్థను స్విగ్గీ తాజాగా ప్రవేశపెట్టింది. దీని వల్ల వినియోగదారులు ఇకపై స్విగ్గీ యాప్‌ను ఓపెన్ చేయాల్సిన పనిలేదు. వారు వాడే చాట్ జీపీటీ (Chat GPT), జెమిని (Gemini) వంటి ఏఐ యాప్స్ ద్వారానే నేరుగా ఫుడ్ డెలివరీ ఆర్డర్లను ఇవ్వవచ్చు.
ఎంసీపీ ఆధారంగా ఫీచర్..
కాగా ఏఐ ద్వారా ఫుడ్ డెలివరీ ఆర్డర్లను ఇచ్చే నూతన ఫీచర్‌ను మోడల్ కాంటెక్ట్స్ ప్రోటోకాల్ (MCP) అనే ఓపెన్ సోర్స్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా రూపొందించామని స్విగ్గీ తెలియజేసింది. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ యాప్స్ ఏఐతో కనెక్ట్ అయ్యేందుకు వీలు కలుగుతుంది. దీంతో యూజర్లు ఏఐ యాప్‌కు చెందిన చాట్ విండోలోనే మెనూలు చూసి తమకు కావల్సిన ఫుడ్‌ను ఎంపిక చేసుకుని అనంతరం కార్ట్‌లో దాన్ని యాడ్ చేసి ఆ తరువాత ఏవైనా ఆఫర్లు ఉంటే అప్లై చేసి, ఇతర వివరాలను నమోదు చేసి చెల్లింపులు చేయవచ్చు. దీంతో ఆర్డర్ పూర్తి అవుతుంది. ఆ తరువాత ఆ ఆర్డర్‌ను ట్రాక్ కూడా చేయవచ్చు. ఇలా ఏఐ ద్వారానే పూర్తి ప్రక్రియ ముగుస్తుంది. చాట్ విండో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్విగ్గీ చెబుతోంది.
మొదటి ప్లాట్‌ఫామ్‌గా స్విగ్గీ..
కాగా ప్రస్తుతం ఈ సదుపాయాన్ని స్విగ్గీలో ఫుడ్ డెలివరీతోపాటు ఇన్‌స్టామార్ట్, డైన్ అవుట్ వంటి సేవల్లోనూ అందిస్తున్నారు. అయితే ఎంసీపీ టెక్నాలజీని ఉపయోగించిన తొలి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా స్విగ్గీ నిలవడం విశేషం. ఇందులో ముందుగా ఇన్‌స్టామార్ట్ లో ఈ టెక్నాలజీని ఉపయోగించారు. ఇన్‌స్టా మార్ట్ ద్వారా వినియోగదారులు 40వేలకు పైగా ఉత్పత్తులను ఏఐ ద్వారా ఆర్డర్ చేయవచ్చని కంపెనీ తెలియజేసింది. ఇక ఏఐలో ఈ రెసిపికి కావాల్సిన సరుకులనులు ఆర్డర్ చేయి, ఎక్కువ రేటింగ్ ఉన్న రెస్టారెంట్ చూపించు, ఈ హోటల్‌లో టేబుల్ బుక్ చేయి వంటి ఆదేశాలను యూజర్లు ఏఐకు ఇవ్వవచ్చు. దీంతో ఏఐ అందుకు తగిన విధంగా ఆప్షన్లను వెతుకుతుంది. ఆ తరువాత ధరలను పోల్చి అందుబాటులో ఉన్న ఆఫర్లను వర్తింపజేసి అనంతరం చెక్ అవుట్ ప్రక్రియను కూడా అదే ఇంటర్ ఫేస్‌లో పూర్తి చేస్తుంది. ఇలా ఏఐ ఫుడ్ ఆర్డర్ పనిచేస్తుంది.
స్విగ్గీ అందుబాటులోకి తెచ్చిన ఈ నూతన ఫీచర్ ద్వారా యూజన్ అనేక యాప్‌ల మధ్య మారాల్సిన పని ఉండదు. చాలా వేగంగా ఫుడ్ ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది. అలాగే ఆర్డర్‌ను ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ను యూజర్లు ఉపయోగించాలంటే వారు తమ ఏఐ అసిస్టెంట్‌లో ముందుగా స్విగ్గీకి చెందిన కస్టమ్ కనెక్టర్‌ను యాడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో స్విగ్గీని ఏఐ లోనూ ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






