త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Money Saving Hacks | ఏఐ చెప్పిన 5 మనీ సేవింగ్ హ్యాక్స్.. డబ్బు ఆదా చేసుకోవచ్చిలా..

Money Saving Hacks | ఆర్థిక ఇబ్బందుల సమయంలో డబ్బు ఆదా చేసుకోవడానికి గూగుల్ జెమిని ఏఐ సూచించిన ఐదు వినూత్న చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సబ్‌స్క్రిప్షన్ రద్దు చేస్తున్నట్లు చెప్పి డిస్కౌంట్లు పొందడం, ఆన్‌లైన్ షాపింగ్ కార్ట్‌లో వస్తువులు వదిలేయడం, వర్చువల్ కార్డులు ఉపయోగించడం వంటి మార్గాలతో ఖర్చులు తగ్గించుకోవచ్చని ఏఐ సూచించింది. అయితే కొన్ని చిట్కాలు ఉపయోగించేటప్పుడు ఆయా సంస్థల నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

S

Business | Published On Nov 28, 2026, 6.01 pm IST

Money Saving Hacks | ఏఐ చెప్పిన 5 మనీ సేవింగ్ హ్యాక్స్.. డబ్బు ఆదా చేసుకోవచ్చిలా..
Advertisement

Money Saving Hacks | ఆర్థిక ఇబ్బందుల సమయంలో డబ్బు ఆదా చేసుకోవడానికి గూగుల్ జెమిని ఏఐ సూచించిన ఐదు వినూత్న చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సబ్‌స్క్రిప్షన్ రద్దు చేస్తున్నట్లు చెప్పి డిస్కౌంట్లు పొందడం, ఆన్‌లైన్ షాపింగ్ కార్ట్‌లో వస్తువులు వదిలేయడం, వర్చువల్ కార్డులు ఉపయోగించడం వంటి మార్గాలతో ఖర్చులు తగ్గించుకోవచ్చని ఏఐ సూచించింది. అయితే కొన్ని చిట్కాలు ఉపయోగించేటప్పుడు ఆయా సంస్థల నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సబ్‌స్క్రిప్షన్ రద్దు చేసే వ్యూహం..

గూగుల్‌కు చెందిన జెమిని ఏఐ సూచించిన కొన్ని వినూత్న మనీ సేవింగ్ చిట్కాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీటిలో మొదటిది సబ్‌స్క్రిప్షన్ రద్దు చేసే వ్యూహం. ఏదైనా ఓటీటీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్ లేదా ఇతర సేవకు చెల్లిస్తున్న సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసే ప్రయత్నం చేస్తే, వినియోగదారులను కోల్పోకుండా ఉండేందుకు ఆయా సంస్థలు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు అందించే అవకాశం ఉంటుందని జెమిని పేర్కొంది. కొంతమంది వినియోగదారులకు తదుపరి కొన్ని నెలల పాటు 30 నుంచి 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంద‌ని తెలిపింది. సాధారణ కస్టమర్ సపోర్ట్ విభాగం కంటే వినియోగదారులను కొనసాగించేందుకు పనిచేసే రిటెన్షన్ విభాగానికి ప్రత్యేక ఆఫర్లు అందించే అధికారం ఎక్కువగా ఉంటుందని వివరించింది.

ఆన్‌లైన్ షాపింగ్ కార్ట్‌..

రెండో చిట్కా ఆన్‌లైన్ షాపింగ్ కార్ట్‌కు సంబంధించినది. కొనుగోలు చేయాలనుకున్న వస్తువులను కార్ట్‌లో చేర్చి, ఈ-మెయిల్ వివరాలు నమోదు చేసిన తర్వాత వెంటనే కొనుగోలు చేయకుండా వదిలేస్తే, ఆర్డర్ పూర్తి చేయించేందుకు కొన్ని రిటైలర్లు డిస్కౌంట్ కూపన్లు పంపించే అవకాశం ఉంటుందని సూచించింది. ఇవి 24 నుంచి 48 గంటల్లో ఈ-మెయిల్‌కు వ‌స్తాయని పేర్కొంది. మూడో చిట్కా వర్చువల్ కార్డుల వినియోగం. సబ్‌స్క్రిప్షన్ల కోసం వర్చువల్ కార్డులను ఉపయోగించడం ద్వారా వాటి చెల్లింపులను సులభంగా పర్యవేక్షించవచ్చని, అనుకోకుండా జరిగే ఆటోమేటిక్ రెన్యూవల్ ఛార్జీలను నివారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

పుట్టినరోజు ప్రత్యేక ఆఫర్లు..

నాలుగోది పుట్టినరోజు ప్రత్యేక ఆఫర్లు. రెస్టారెంట్లు, ప్రముఖ బ్రాండ్లు పుట్టినరోజు సందర్భంగా ఉచిత భోజనం, బహుమతులు, ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తుంటాయని, ముందుగానే వాటి వివరాలు తెలుసుకుంటే ప్రయోజనం పొందవచ్చని జెమిని సూచించింది. కొన్ని హోటళ్లలో ఉచితంగా గది అప్‌గ్రేడ్, ఉచిత డెజర్ట్, ఆలస్యంగా చెక్‌అవుట్ వంటి ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంటుందని వివరించింది. ఐదోది ధరల పోలిక. ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ధరలను పోల్చి చూడడం ద్వారా గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చని సూచించింది.

ఈ చిట్కాలపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తూ, సబ్‌స్క్రిప్షన్ రద్దు చేస్తున్నట్లు చెప్పే విధానం తమకు కూడా ప్రయోజనం కలిగించిందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రతి సంస్థలోనూ ఇలాంటి ఆఫర్లు అందుబాటులో ఉంటాయని హామీ లేదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఉచిత ట్రయల్స్ కోసం జీమెయిల్ అలియాస్‌లను ఉపయోగించి పలుమార్లు సైన్‌అప్ చేయడం వంటి పద్ధతులు కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఆయా ప్లాట్‌ఫామ్‌ల వినియోగ నిబంధనలను ఉల్లంఘించే విధంగా వ్యవహరించకూడదని, అనవసరమైన సమస్యలు ఎదురుకాకుండా ముందుగానే నిబంధనల‌ను పరిశీలించాలని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement