XChat | వాట్సాప్‌కు పోటీగా ఎలాన్ మస్క్ ఎక్స్ చాట్.. నేటి నుంచే లభ్యం.. స్క్రీన్‌షాట్లు తీయకుండా లాక్ ఫీచర్..
XChat | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఓ కొత్త చాటింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ఎక్స్ చాట్ పేరిట లాంచ్ అయిన ఈ యాప్ ప్రస్తుతం ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. యూజర్లు ఈ యాప్‌ను ముందుగా ప్రీ ఆర్డర్ చేసుకోవాలని, వారికి ఈ యాప్‌ను దశలవారీగా అందిస్తామని ఎక్స్ సంస్థ తెలియజేసింది.
Technology | Published On Apr 17, 2026, 3.34 pm IST
XChat | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఓ కొత్త చాటింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ఎక్స్ చాట్ పేరిట లాంచ్ అయిన ఈ యాప్ ప్రస్తుతం ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. యూజర్లు ఈ యాప్‌ను ముందుగా ప్రీ ఆర్డర్ చేసుకోవాలని, వారికి ఈ యాప్‌ను దశలవారీగా అందిస్తామని ఎక్స్ సంస్థ తెలియజేసింది. ఇప్పటికే ప్రీ ఆర్డర్ చేసిన యూజర్లు ఈ యాప్‌ను శుక్రవారం నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. యాపిల్ వినియోగదారులు ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లలో ఉండే యాప్ స్టోర్‌లో ఎక్స్ చాట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే యాప్‌ను ప్రీ ఆర్డర్ చేసుకున్న యూజర్లకు కొందరికి ఈ యాప్‌ను ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయ్యేలా ఆప్షన్ ఇచ్చారు. ఆ సదుపాయాన్ని వాడుకునేవారికి యాప్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆటోమేటిగ్గా ఇన్‌స్టాల్ అవుతుంది. యూజర్ ప్రత్యేకంగా యాప్ స్టోర్‌కు వెళ్లి డౌన్ లోడ్ చేయాల్సిన పని ఉండదు.
ప్రత్యేక యాప్‌గా లాంచ్..
ఈ యాప్‌ను ఇన్ యాప్ మెసేజింగ్ అప్ గ్రేడ్‌గా కాకుండా, పూర్తిగా ప్రత్యేక అప్లికేషన్‌గా అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు ఎక్స్ యాప్‌లోనే ఈ యాప్‌ను ఇన్ బిల్ట్‌గా అందిస్తారని అందరూ భావించారు. ఎక్స్ సంస్థ ఈ యాప్‌ను ప్రత్యేకంగా లాంచ్ చేయడం విశేషం. ఇక ఈ యాప్‌లో మెసేజింగ్ అంతా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ పద్ధతిలోనే కొనసాగుతుందని ఎక్స్ తెలిపింది. దీని వల్ల సందేశాలను పంపిన వ్యక్తి, వాటిని స్వీకరించే వ్యక్తి మాత్రమే వాటిని చదవగలుగుతారు. ఇతరులకు ఆ సందేశాలను యాక్సెస్ చేసే అవకాశం ఉండదు. ఇక ఎక్స్ చాట్‌లో ఒకసారి పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేయడంతోపాటు డిలీట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. అలాగే ఒక సందేశాన్ని డిలీట్ చేస్తే అది ఆ చాట్‌లో ఉండే అందరి ఖాతాల నుంచి డిలీట్ అవుతుంది.

చాట్‌లను స్క్రీన్ షాట్ తీయలేరు..
ఎక్స్ చాట్ యాప్‌లో మెసేజ్‌లను ఆటోమేటిగ్గా అదృశ్యమయ్యేలా కూడా సౌకర్యం కల్పించారు. యూజర్లు తాము పంపిన మెసేజ్‌లు 5 నిమిషాల అనంతరం ఆటోమేటిగ్గా డిలీట్ అయ్యేలా డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను సెట్ చేసుకోవచ్చు. అలాగే స్క్రీన్‌షాట్ లు తీయకుండా లాక్ చేసే ఫీచర్‌ను కూడా ఈ యాప్ లో అందించనున్నారు. సాధారణంగా వాట్సాప్ వంటి యాప్ లలో యూజర్లు పంపించే మెసేజ్‌లను స్క్రీన్ షాట్స్ తీస్తుంటారు. ఇలా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జరుగుతుంది. అయితే ఎక్స్ చాట్‌లో ఆ సదుపాయం ఉండదు. మెసేజ్‌ను పంపిన యూజర్‌కు తెలియకుండా అవతలి వ్యక్తులు ఆ యూజర్ చాట్‌లను స్క్రీన్ షాట్ తీయడం కుదరదు. దీన్ని యూజర్ ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ చాట్‌లో అందించనున్న ప్రధాన ఫీచర్ కాగా, వాట్సాప్ కన్నా అధికంగా సభ్యులు గ్రూపుల్లో చేరేలా, భారీ సైజులో ఉండే ఫైల్స్‌ను కూడా పంపించుకునేలా ఎక్స్ చాట్‌లో ఫీచర్లను అందించనున్నారు. ఇక ఎక్స్ చాట్ లో ఒకే చాట్ విండోలో గరిష్టంగా 481 మందితో భారీ గ్రూప్ సైజ్ సంభాషణలు చేయవచ్చు. మెసేజింగ్‌తోపాటు ఈ ప్లాట్‌ఫామ్ క్రాస్ డివైస్ కాలింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
ముందుగా యాపిల్ యూజర్లకు..
యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ప్రస్తుతం ఎక్స్ చాట్‌ను ఐఫోన్, ఐప్యాడ్‌లలో ప్రీ ఆర్డర్ చేయవచ్చు. ప్రీ ఆర్డర్ చేసిన యూజర్లకు శుక్రవారం నుంచి యాప్ లభిస్తుంది. సెట్టింగ్‌కు అనుగుణంగా యాప్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయి ఇన్‌స్టాల్ కూడా అవుతుంది. ఈ యాప్ ను ఉపయోగించాలంటే ఐఫోన్‌లో ఐఓఎస్ వెర్షన్ 26 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగే ఐప్యాడ్ అయితే ఐప్యాడ్ ఓఎస్26 లేదా అంతకన్నా పై వెర్షన్ ఉండాలి. ఇక ఈ యాప్‌లో ఎలాంటి ప్రకటనలు ఉండవని యాప్ స్టోర్‌లో తెలిపారు. ఎక్స్ చాట్ యాప్‌ను ప్రీ ఆర్డర్ చేయాలంటే యూజర్లు తమ డివైస్‌లలోని యాపిల్ యాప్ స్టోర్‌ను ఓపెన్ చేసి అందులో ఎక్స్ చాట్ అని సెర్చ్ చేయాలి. ఫలితాల్లో వచ్చే యాప్‌ను ఎంపిక చేసుకుని అక్కడ అందుబాటులో ఉండే ప్రీ ఆర్డర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. దీంతో యాప్ ప్రీ ఆర్డర్ అవుతుంది. అయితే ఈ యాప్ ఏయే దేశాల్లో అందుబాటులో ఉందో ఎక్స్ సంస్థ ఆ వివరాలను ప్రకటించలేదు. కానీ కొందరు ఎంపిక చేసిన ఎక్స్ యూజర్లకు ఈ యాప్ కోసం ఆ సంస్థ ఇన్విటేషన్లను పంపిస్తుందని తెలిసింది. అందువల్ల యూజర్లందరికీ ఈ యాప్ అందుబాటులోకి వచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ యాప్ వాట్సాప్‌కు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026

X | ఫ్రీ యూజర్లకు షాకిచ్చిన ఎక్స్.. పోస్టులపై లిమిట్స్ విధింపు..
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



