త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Apple Experience | మార్చి 4న యాపిల్ ఈవెంట్‌.. కొత్త మాక్‌బుక్‌లు, ఐఫోన్ రిలీజ్‌..?

Special Apple Experience | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ మార్చి నెలలో ఓ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది. మార్చి 4వ తేదీన స్పెషల్ యాపిల్ ఎక్స్‌పీరియన్స్ అనే ఈవెంట్‌ను నిర్వ‌హించనున్నట్లు తెలిపింది.

S

Technology | Published On Feb 17, 2026, 11.56 am IST

Special Apple Experience | మార్చి 4న యాపిల్ ఈవెంట్‌.. కొత్త మాక్‌బుక్‌లు, ఐఫోన్ రిలీజ్‌..?
Advertisement

Special Apple Experience | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ మార్చి నెలలో ఓ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది. మార్చి 4వ తేదీన స్పెషల్ యాపిల్ ఎక్స్‌పీరియన్స్ అనే ఈవెంట్‌ను నిర్వ‌హించనున్నట్లు తెలిపింది. నూత‌న మాక్‌బుక్‌, ఐఫోన్ కొత్త మోడ‌ల్ వంటి ప్రొడ‌క్ట్ ల‌ను యాపిల్ రిలీజ్ చేయ‌నుంద‌ని వార్తలు వ‌స్తున్న నేపథ్యంలో యాపిల్ నిర్వ‌హించ‌నున్న ఆ ఈవెంట్‌కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఆయా ప్రొడ‌క్ట్‌ల‌ను ఆ ఈవెంట్‌లో యాపిల్ విడుద‌ల చేస్తుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌ను యాపిల్ సాధార‌ణ కీనోట్ ఈవెంట్‌గా కాకుండా స్పెషల్ యాపిల్ ఎక్స్‌పీరియన్స్ గా పేర్కొంది. దీంతో ఆ ఈవెంట్‌లో ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్రొడ‌క్ట్‌ల‌ను ఆ సంస్థ లాంచ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌రా..?

స్పెషల్ యాపిల్ ఎక్స్‌పీరియన్స్ ఈవెంట్‌ను మార్చి 4వ తేదీన భార‌త కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే అదే స‌మ‌యంలో ఒకేసారి న్యూయార్క్‌, లండన్‌, షాంఘై వంటి న‌గ‌రాల్లో ప్ర‌త్యేక సెష‌న్ల‌ను సైతం నిర్వ‌హిస్తున్న‌ట్లు యాపిల్ తెలిపింది. అయితే సాధార‌ణంగా ఇలాంటి ఈవెంట్ల‌ను యాపిల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. కానీ ఈసారి మాత్రం ఈ ఈవెంట్‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారా, లేదా అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌లేదు. ఇక ఈ ఈవెంట్‌లో ప‌లు అధునాత‌న ప్రొడ‌క్ట్‌ల‌ను యాపిల్ లాంచ్ చేసే అవ‌కాశం ఉంద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ విశ్లేష‌కుడు మార్క్ గుర్మ‌న్ త‌న నివేదిక‌ల్లో వెల్ల‌డించారు.

లాంచ్ కానున్న ఉత్ప‌త్తులు ఇవే..?

యాపిల్ నిర్వ‌హించ‌నున్న ఈవెంట్ లో A18 Pro చిప్‌తో లో-కాస్ట్ మాక్‌బుక్, M5 చిప్‌తో మాక్‌బుక్ ఎయిర్, M5 Pro, M5 Max ప్రాసెసర్లతో మాక్‌బుక్ ప్రొ వేరియంట్లు, కొత్త మాక్ డిస్‌ప్లేలు, ఐఫోన్ 17e, A18 చిప్‌తో బేస్ ఐప్యాడ్, M4 చిప్‌తో రిఫ్రెష్ అయిన ఐప్యాడ్ ఎయిర్ వంటి ఉత్ప‌త్తుల‌ను ఈ ఈవెంట్‌లో యాపిల్ లాంచ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయా డివైస్‌ల‌కు చెందిన లీకైన ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. కాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్ర‌త్య‌క్ష ప్ర‌సార వివ‌రాల‌ను యాపిల్ త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంద‌ని స‌మాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement