త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Grok 4.5 | గ్రోక్ 4.5 వచ్చేసింది.. కోడింగ్ కోసం స్పేస్‌ఎక్స్‌ఏఐ అత్యాధునిక ఏఐ మోడల్..

Grok 4.5 | స్పేస్‌ఎక్స్‌ఏఐ తన తాజా కృత్రిమ మేధస్సు మోడల్ గ్రోక్ 4.5 ని అధికారికంగా ప్రకటించింది. కోడింగ్, ఏజెంటిక్ టాస్క్‌లు, నాలెడ్జ్ వర్క్ వంటి క్లిష్టమైన పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఈ మోడల్ ఇప్పటివరకు సంస్థ అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడ‌ల్‌ అని తెలిపింది.

S

Technology | Published On Jul 9, 2026, 11.33 am IST

Grok 4.5 | గ్రోక్ 4.5 వచ్చేసింది.. కోడింగ్ కోసం స్పేస్‌ఎక్స్‌ఏఐ అత్యాధునిక ఏఐ మోడల్..
Advertisement

Grok 4.5 | స్పేస్‌ఎక్స్‌ఏఐ తన తాజా కృత్రిమ మేధస్సు మోడల్ గ్రోక్ 4.5 ని అధికారికంగా ప్రకటించింది. కోడింగ్, ఏజెంటిక్ టాస్క్‌లు, నాలెడ్జ్ వర్క్ వంటి క్లిష్టమైన పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఈ మోడల్ ఇప్పటివరకు సంస్థ అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడ‌ల్‌ అని తెలిపింది. ప్రముఖ ఏఐ కోడింగ్ ప్లాట్‌ఫామ్ కర్సర్ తో కలిసి ఈ మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. గ్రోక్ 4.5కు కోడింగ్, సైన్స్, ఇంజినీరింగ్, గణితం వంటి విభాగాలకు సంబంధించిన విస్తృత డేటాతో శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం పదివేలల్లో ఎన్‌విడియా జీబీ300 జీపీయూలను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. ట్రైనింగ్ సమయంలో డేటా ఫిల్టరింగ్, డూప్లికేట్ సమాచారాన్ని తొలగించడం, నాణ్యత ఆధారంగా డేటా ఎంపిక, విభాగాల వారీగా ప్రత్యేక డేటా వినియోగం, భారీ స్థాయిలో శిక్షణ స్థిరంగా కొనసాగేలా ప్రత్యేక సాంకేతిక పద్ధతులను అమలు చేసినట్లు పేర్కొంది.

ఒక ప్రాంప్ట్‌తో అప్లికేష‌న్ క్రియేష‌న్‌..

అలాగే రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ సామర్థ్యాన్ని కూడా మరింత విస్తరించినట్లు స్పేస్‌ఎక్స్‌ఏఐ తెలిపింది. లక్షల సంఖ్యలో మల్టీ-స్టెప్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, టెక్నికల్ టాస్క్‌లపై ఆటోమేటెడ్, మోడల్ ఆధారిత గ్రేడింగ్ ద్వారా శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. అసింక్రోనస్ ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారణంగా పదివేలల్లో జీపీయూలపై ట్రైనింగ్ కొనసాగుతూనే దీర్ఘకాలిక ఏజెంటిక్ ప్రాసెస్‌లను నిర్వహించే సామర్థ్యం పెరిగిందని, దీంతో ఇంజినీరింగ్ సమస్యల పరిష్కారం, తార్కిక ఆలోచన మరింత మెరుగుపడిందని వివరించింది. వాస్తవ ప్రపంచ ఇంజినీరింగ్ పనుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర ప్రముఖ ఏఐ మోడళ్లతో పోలిస్తే గ్రోక్ 4.5 మెరుగైన పనితీరును కనబరుస్తుందని కూడా కంపెనీ ప్రకటించింది. కోడింగ్ విషయంలో గ్రోక్ 4.5కు మరింత శక్తివంతమైన సామర్థ్యాలను అందించారు. రస్ట్, సీ, సీ ప్లస్ ప్లస్ వంటి ప్రోగ్రామింగ్ భాషలకు ఇది మద్దతు ఇస్తుంది. ఒక్క ప్రాంప్ట్ ఇచ్చినా పూర్తి స్థాయి అప్లికేషన్‌ను రూపొందిస్తుందని కంపెనీ తెలిపింది.

సెక‌నుకు 80 టోకెన్ల వేగంతో..

ఈ మోడల్ గరిష్ఠంగా సెకనుకు 80 టోకెన్ల వేగంతో పనిచేస్తుందని స్పేస్‌ఎక్స్‌ఏఐ వెల్లడించింది. ఇతర ప్రముఖ మోడళ్లతో పోలిస్తే దాదాపు రెండింతల టోకెన్ సామర్థ్యాన్ని అందిస్తుందని, అంటే తక్కువ టోకెన్లతోనే ఎక్కువ పనిని పూర్తి చేస్తుంద‌ని పేర్కొంది. దీంతో సమయం, ఖర్చు రెండూ తగ్గడంతోపాటు మెరుగైన పనితీరు లభిస్తుందని వివరించింది. గ్రోక్ 4.5 ప్రస్తుతం గ్రోక్ బిల్డ్ లో డిఫాల్ట్ మోడల్‌గా అందుబాటులో ఉంది. దీని ద్వారా వెబ్ రీసెర్చ్ ఆధారంగా బహుళ షీట్లతో కూడిన క్లిష్టమైన ఎక్సెల్ వర్క్‌బుక్‌లను రూపొందించవచ్చు. ఎక్సెల్ ఫైళ్లలో రిఫరెన్స్ నోట్స్ చేర్చడం, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లు తయారు చేయడం, అలాగే మైక్రోసాఫ్ట్ పవర్‌పాయింట్ లో నేటివ్ షేప్‌లతో ప్రజెంటేషన్లు, డయాగ్రామ్‌లను కూడా సృష్టిస్తుంది. ప్రతి మిలియన్ ఇన్‌పుట్ టోకెన్లకు 2 అమెరికన్ డాలర్లు, ప్రతి మిలియన్ అవుట్‌పుట్ టోకెన్లకు 6 అమెరికన్ డాలర్లుగా ధ‌ర‌ను నిర్ణయించారు.

ఏయే ప్లాన్ల‌లో అందుబాటులో..

గ్రోక్ 4.5 ప్రస్తుతం గ్రోక్ బిల్డ్, కర్సర్ అన్ని ప్లాన్‌లలో, అలాగే స్పేస్‌ఎక్స్‌ఏఐ కన్సోల్ ద్వారా అందుబాటులో ఉంది. పరిమిత కాలం పాటు గ్రోక్ బిల్డ్, కర్సర్ వినియోగదారులకు ఈ మోడల్‌ను ఉచితంగా ఉపయోగించే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌లో గ్రోక్ 4.5 అందుబాటులో లేదని స్పేస్‌ఎక్స్‌ఏఐ తెలిపింది. జూలై మధ్య నాటికి అక్కడ కూడా ఈ మోడల్‌ను విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement