Google Gemini 4 Argon | గూగుల్ నుంచి జెమిని 4 ఆర్గాన్.. సంక్లిష్ట పనుల్లో సరికొత్త ఏఐ మోడల్..
Google Gemini 4 Argon | గూగుల్ తన సరికొత్త అత్యాధునిక కృత్రిమ మేధస్సు మోడల్ జెమిని 4 ఆర్గాన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జెమిని 4 ఆర్గాన్ వచ్చేసింది అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ కొత్త మోడల్‌ను అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Technology | Published On Oct 14, 2026, 12.39 pm IST
Google Gemini 4 Argon | గూగుల్ తన సరికొత్త అత్యాధునిక కృత్రిమ మేధస్సు మోడల్ జెమిని 4 ఆర్గాన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జెమిని 4 ఆర్గాన్ వచ్చేసింది అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ కొత్త మోడల్‌ను అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డెవలపర్లు, సంస్థలు చెల్లింపు ప్లాన్ ద్వారా జెమిని ఏపీఐ, ఏఐ స్టూడియో, జెమిని ప్లాట్‌ఫామ్‌లలో ఆర్గాన్‌ను ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ఏఐ అల్ట్రా సబ్స్క్రైబర్లు గూగుల్ యాంటీగ్రావిటీలో ఈ మోడల్‌ను ఉపయోగించుకోవచ్చు. అల్ట్రా, ప్రొ సబ్స్క్రైబర్లకు జెమిని యాప్‌తోపాటు గూగుల్ సెర్చ్‌లోని ఏఐ మోడ్‌లోనూ ఇది అందుబాటులో ఉంటుంది.
ఛార్జిలు ఇలా..
డెవలపర్ల కోసం ప్రారంభ ధరగా ప్రతి 10 లక్షల ఇన్పుట్ టోకెన్లకు 2 డాలర్లు, ప్రతి 10 లక్షల అవుట్‌పుట్ టోకెన్లకు 10 డాలర్లను గూగుల్ నిర్ణయించింది. క్యాష్ చేసిన ఇన్పుట్ టోకెన్లపై 95 శాతం తగ్గింపు కల్పిస్తోంది. జెమిని ఏపీఐ ద్వారా ఇన్పుట్, అవుట్‌పుట్ కలిపి గరిష్ఠంగా 10 లక్షల టోకెన్ల వరకు ప్రాసెస్ చేసుకునే సామర్థ్యం ఈ మోడల్‌కు ఉంది. సంక్లిష్టమైన, అనేక దశలతో కూడిన పనులను సమర్థవంతంగా నిర్వహించేలా ఆర్గాన్‌ను రూపొందించినట్లు గూగుల్ డీప్‌మైండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గూగుల్ చీఫ్ ఏఐ ఆర్కిటెక్ట్ కోరే కవుక్కుగ్లూ తెలిపారు. కోడింగ్, ఫైనాన్స్, న్యాయశాస్త్రం, సైబర్ భద్రత, విజ్ఞానశాస్త్రం వంటి రంగాల్లో ఈ మోడల్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని గూగుల్ పేర్కొంది. ఆర్థికంగా కీలకమైన న్యాయ, పన్నులు, కోడింగ్, ఆర్థిక రంగాలకు సంబంధించిన పనుల్లో ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించే వాల్స్ ఇండెక్స్‌లో ఆర్గాన్ అగ్రస్థానంలో ఉందని సంస్థ వెల్లడించింది.
మెరుగైన ఫలితాలను ఇస్తున్న ఏఐ మోడల్..
గూగుల్‌లోని ఇంజినీర్లు ఇప్పటికే పలు క్లిష్టమైన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఆర్గాన్‌ను వినియోగిస్తున్నారు. యాంటీగ్రావిటీని ఉపయోగించిన బృందాలు ఏఐ సాయంతో రూపొందించిన కోడ్‌ను 35 శాతానికి పైగా పెంచగా, తిరిగి వెనక్కి తీసుకోవాల్సి వచ్చిన మార్పుల సంఖ్య దాదాపు మూడో వంతు తగ్గింది. క్రోమ్ బృందం వందలాది ఫైళ్లలో విస్తరించిన కీలక కోడ్ పునర్వ్యవస్థీకరణ పనిని నెలల సమయానికి బదులుగా కొన్ని వారాల్లోనే పూర్తి చేయడానికి కూడా ఆర్గాన్ సహాయపడింది. క్వాంటం కంప్యూటింగ్, అణు సంలీనం, అరుదైన వ్యాధుల నిర్ధారణ, ఎంజైమ్‌ల రూపకల్పన వంటి పరిశోధనల్లో ఆర్గాన్ ఉపయోగపడిందని గూగుల్ వెల్లడించింది. అర్హత, అందుబాటులో ఉన్న సామర్థ్యం, ఎంపిక ప్రక్రియకు లోబడి 10వేల మంది శాస్త్రవేత్తలకు ఆరు నెలలపాటు యాంటీగ్రావిటీ అత్యున్నత వినియోగ ప్లాన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక జెమిని 4 కుటుంబంలో మరిన్ని ఏఐ మోడళ్లను భవిష్యత్తులో విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Asaduddin Owaisi | SIRపై సుప్రీంకోర్టుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ..
- ●Bank of Baroda | భారీగా పతనమైన బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు.. కారణం ఇదే..
- ●Air India Flight | హైజాక్ పుకార్లు.. ఫ్రాంక్ఫర్ట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం దారిమళ్లింపు
- ●TG SAFE | కిచెన్‌లో అపరిశుభ్రత.. 4 హోటళ్ల లైసెన్సులు రద్దుచేసిన టీజీ సేఫ్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్

Asaduddin Owaisi | SIRపై సుప్రీంకోర్టుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ..

Bank of Baroda | భారీగా పతనమైన బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు.. కారణం ఇదే..

Air India Flight | హైజాక్ పుకార్లు.. ఫ్రాంక్ఫర్ట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం దారిమళ్లింపు

TG SAFE | కిచెన్‌లో అపరిశుభ్రత.. 4 హోటళ్ల లైసెన్సులు రద్దుచేసిన టీజీ సేఫ్






