Aadhar Center | ఆధార్ కేంద్రం ఎక్కడుందో ఇకపై కష్టపడుతూ వెతకాల్సిన పనిలేదు..
Aadhar Center | దేశంలోని పౌరులకు ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నాయో ఇకపై వెతుక్కోవాల్సిన పనిలేదు. ఫోన్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే చాలు, చాలా సులభంగా ఆధార్ కేంద్రాల వివరాలు తెలుస్తాయి.
Technology | Published On Feb 27, 2026, 8.36 am IST
Aadhar Center | దేశంలోని పౌరులకు ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నాయో ఇకపై వెతుక్కోవాల్సిన పనిలేదు. ఫోన్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే చాలు, చాలా సులభంగా ఆధార్ కేంద్రాల వివరాలు తెలుస్తాయి. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌తో భాగస్వామ్యం అయి ఆధార్ కేంద్రాల వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో ఇవ్వనున్నట్లు తెలిపింది. దీని వల్ల పౌరులు ఇకపై తమకు దగ్గర్లో ఆధార్ కేంద్రం ఎక్కడ ఉందో ప్రాంతాల్లో శ్రమిస్తూ వెదకాల్సిన అవసరం ఉండదు. అధీకృత ఆధార్ కేంద్రాల వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో నమోదు చేయనున్నట్లు యూఐడీఏఐ తెలియజేసింది. ఈ సదుపాయాన్ని రానున్న నెలల్లో దశలవారిగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.
60వేలకు పైగా ఆధార్ కేంద్రాలు..
గూగుల్ మ్యాప్స్‌లో అధికారిక ఆధార్ సేవా కేంద్రాల వివరాలను ఇవ్వడం వల్ల పౌరులు తప్పుడు సమాచారం పొందే ఇబ్బంది ఉండదు. కేవలం యూఐడీఏఐ ధ్రువీకరించిన కేంద్రాల్లోనే సేవలను పొందగలుగుతారు. తప్పుగు సమాచారాన్ని తగ్గించడం, పౌరులకు ఆధార్ సేవలను మరింత మెరుగ్గా అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది. ప్రజలు అనధికార ఆధార్ కేంద్రాలకు వెళ్లకుండా నిరోధించడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60వేలకు పైగా ఆధార్ కేంద్రాలు ఉన్నాయని, వీటన్నింటినీ డిజిటల్ మ్యాపింగ్ చేస్తామని, అనంతరం గూగుల్ మ్యాప్స్‌లో ఆ వివరాలను నమోదు చేస్తామని యూఐడీఏఐ తెలిపింది.
సదుపాయాల వివరాలు కూడా..
ఆధార్ కేంద్రంలో లభించే సౌకర్యాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో పొందు పరుస్తారు. కేంద్రంలో అందుబాటులో ఉండే సౌకర్యాలు, దివ్యాంగులకు వసతులు, పార్కింగ్ సదుపాయం వంటి వివరాలు కూడా మ్యాప్స్‌లో కేంద్రం సమాచారం సెక్షన్‌లో కనిపిస్తాయి. ఈ సందర్భంగా యూఐడీఏఐ సీఈవో భువనేష్ కుమార్ మాట్లాడుతూ ఆధార్ సేవలను ప్రజలు మరింత మెరుగ్గా పొందేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గూగుల్ మ్యాప్స్‌లో వివరాలను నమోదు చేయడం ద్వారా పౌరులు ఆధార్ కేంద్రాలను గుర్తించడం మరింత సులభతరం అవుతుందని అన్నారు.
సంబంధిత వార్తలు

Preity Zinta | డీప్‌ఫేక్ కంటెంట్‌పై హైకోర్టును ఆశ్రయించిన ప్రీతి జింతా.. వెబ్సైట్లకు మార్గదర్శకాలపై కోర్టు ఆదేశాలు
జులై 3, 2026

Aadhaar | ఇక ఆధార్‌లో ఈ-మెయిల్ అప్డేట్ ఇంటి నుంచే.. యూఐడీఏఐ కొత్త సౌకర్యం..
జులై 3, 2026

Google | గూగుల్ నుంచి నానో బనానా 2 లైట్ ఇమేజ్ మోడల్.. 4 సెకన్లలో ఏఐ ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది..
జులై 1, 2026
తాజావార్తలు
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
- ●Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్



