Sridhar Babu | 1100 కాల్ చేస్తే.. మీ ఇంటికే మీ సేవ సర్టిఫికెట్‌లు
Sridhar Babu | 1100 కాల్ చేస్తే ఇంటి వద్దకే మీ సేవ (Mee Seva) ధ్రవపత్రాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు.
- కులం, నివాస, ఆదాయం, జనన, మరణ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ సేవలు కూడా
- పోర్టల్ ఆవిష్కరణలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
Sridhar Babu | త్రినేత్ర న్యూస్: 1100 కాల్ చేస్తే ఇంటి వద్దకే మీ సేవ (Mee Seva) ధ్రవపత్రాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. కులం, నివాస, ఆదాయం, జనన, మరణ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ సేవలు కూడా పొందవచ్చన్నారు. క్యూర్ పరిధిలో ప్రారంభించిన నెల రోజుల్లోనే మంచి స్పందన వస్తోందన్నారు. మీ సేవ డోర్‌స్టెప్ డెలివరీ కోసం నెల రోజుల్లోనే 3,885 కాల్స్ వచ్చినట్లు వివరించారు. శుక్రవారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో పోర్టల్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ప్రజలు ఇకపై ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ నమోదు, ఆధార్ వివరాల అప్ డేట్ వంటి పలు సేవల కోసం మీ సేవా కేంద్రాలు లేదా ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. క్యూలలో వేచి ఉండకుండా మీ సేవా డోర్‌స్టెప్ డెలివరీ సేవ ద్వారా సేవలను పొందవచ్చు. ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1100 కు కాల్ చేయడం, మీసేవ పౌరుల పోర్టల్ ద్వారా అభ్యర్థన నమోదు చేయడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఆ తర్వాత మీ సేవ ప్రతినిధి నిర్ణీత సమయంలో ఇంటికి వచ్చి అవసరమైన సేవలను అందిస్తారు.
మొదటి నెలలోనే 3,885 కాల్స్
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, పారదర్శకమైన పాలనను అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దార్శనికతలో ఈ కార్యక్రమం ఒక భాగం. ప్రస్తుతం ఈ డోర్‌స్టెప్ సేవలు క్యూర్ (CURE) పరిధిలోని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బుక్ చేసుకున్న సర్వీస్ ప్రకారం వర్తించే సేవా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
డోర్ స్టెప్ సేవలు ఇలా పొందొచ్చు
- టోల్‌ఫ్రీ నంబర్ 1100 కు కాల్ చేయండి లేదా మీ సేవ పౌరుల పోర్టల్ ద్వారా అభ్యర్థన నమోదు చేయండి.
- అవసరమైన ధ్రువీకరణ పత్రం లేదా ఆధార్ సేవను ఎంచుకుని, కాల్ సెంటర్ ప్రతినిధికి అవసరమైన వివరాలను అందించండి.
- నిర్ణయించిన సమయంలో మీ సేవ డోర్‌స్టెప్ ప్రతినిధి మీ ఇంటికి వచ్చి అవసరమైన సేవలను అందిస్తారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. యుద్ధ ప్రతిపాదికన స్థలాలు గుర్తించాలి
అక్టోబర్ 23, 2026

Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
అక్టోబర్ 23, 2026

Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్
అక్టోబర్ 23, 2026
తాజావార్తలు
- ●Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
- ●Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ - ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా
- ●Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్
- ●Vande Mataram | వందేమాతరం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి
- ●Revanth Reddy | మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి.. తుమ్మడిహెట్టి నివేదికలన్నీ రెడీగా ఉంచండి
- ●Hyderabad | సూరారంలో విషాదం.. నీళ్ల బకెట్లో చిన్నారి పడి మృతి..

Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి

Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ - ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా

Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

Vande Mataram | వందేమాతరం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి



