త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sarvam AI Indus Chat | స‌ర్వం ఏఐ ఇండ‌స్ చాట్ వ‌చ్చేసింది.. జ‌న‌రేటివ్ ఏఐ మార్కెట్‌లో పోటీ..

Sarvam AI Indus Chat | బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్ సర్వం (Sarvam AI) వెబ్, మొబైల్ వినియోగదారుల కోసం తన ఇండస్ చాట్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్‌, గూగుల్‌ వంటి ప్రధాన గ్లోబల్ ప్లేయర్లకు చెందిన జ‌న‌రేటివ్ ఏఐ చాట్ అప్లికేష‌న్ల‌కు ఇండ‌స్ చాట్ అప్లికేష‌న్ గ‌ట్టి పోటీనిస్తుంద‌ని టెక్ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

S

Technology | Published On Feb 22, 2026, 10.37 am IST

Sarvam AI Indus Chat | స‌ర్వం ఏఐ ఇండ‌స్ చాట్ వ‌చ్చేసింది.. జ‌న‌రేటివ్ ఏఐ మార్కెట్‌లో పోటీ..
Advertisement

Sarvam AI Indus Chat | బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్ సర్వం (Sarvam AI) వెబ్, మొబైల్ వినియోగదారుల కోసం తన ఇండస్ చాట్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్‌, గూగుల్‌ వంటి ప్రధాన గ్లోబల్ ప్లేయర్లకు చెందిన జ‌న‌రేటివ్ ఏఐ చాట్ అప్లికేష‌న్ల‌కు ఇండ‌స్ చాట్ అప్లికేష‌న్ గ‌ట్టి పోటీనిస్తుంద‌ని టెక్ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇండ‌స్ చాట్ అప్లికేష‌న్ ప్ర‌స్తుతం ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ల‌తోపాటు వెబ్ ప్లాట్ ఫామ్‌పై కూడా ల‌భిస్తోంది. ప్ర‌స్తుతానికి బీటా వెర్ష‌న్‌లోనే ఈ అప్లికేష‌న్ ప‌నిచేస్తుంద‌ని స‌ర్వం ఏఐ ప్ర‌తినిధులు తెలిపారు. యూజ‌ర్లు ఇండ‌స్ చాట్ యాప్‌లో టెక్ట్స్ లేదా వాయిస్ ద్వారా అడిగే ప్ర‌శ్న‌ల‌కు అవే ఫార్మాట్ల‌లో స‌మాధానాల‌ను పొంద‌వ‌చ్చు.

కేవ‌లం భార‌తీయుల‌కే..

స‌ర్వం ఏఐ లాంచ్ చేసిన ఇండ‌స్ చాట్ జ‌న‌రేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఉప‌యోగించుకోవాలంటే యూజర్లు ఆ యాప్ లేదా వెబ్ సైట్ ను ఓపెన్ చేసి ముందుగా ఫోన్ నంబ‌ర్ లేదా ఈ-మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికి ఇండ‌స్ జ‌న‌రేటివ్ ఏఐ సేవ‌లు కేవ‌లం భార‌తీయ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని స‌ర్వం ప్ర‌తినిధులు తెలిపారు. అలాగే ఈ ప్లాట్‌ఫామ్‌ను ఇప్పుడే ప్రారంభించారు క‌నుక కొన్ని పరిమితులు ఉంటాయ‌ని, స‌ర్వర్లపై భారం ప‌డ‌కుండా ఉండాల‌నే ఈ ప‌రిమితుల‌ను విధించామ‌ని స్ప‌ష్టం చేశారు.

ద‌శ‌ల‌వారిగా సామ‌ర్థ్యం పెంపు..

ఇండ‌స్ జ‌న‌రేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లో యూజ‌ర్లు త‌మ ఖాతాను డిలీట్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. కేవ‌లం చాట్ హిస్ట‌రీని తొల‌గిస్తే చాలు. కావాల‌నుకున్న‌ప్పుడు ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే రీజ‌నింగ్ ఫీచ‌ర్‌ను డిసేబుల్ చేయ‌డానికి ప్ర‌స్తుతానికి ఎలాంటి ఆప్ష‌న్ లేద‌ని, కొన్ని సార్లు స‌మాధానాలు నెమ్మ‌దిగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వం ప్ర‌తినిధులు తెలియ‌జేశారు. స‌ర్వం కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను విస్త‌రించే కొద్దీ అప్లికేష‌న్ యాక్సెస్‌పై విధించిన ప‌రిమితుల‌ను నెమ్మ‌దిగా తొల‌గిస్తామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా స‌ర్వం కో ఫౌండ‌ర్ ప్ర‌తీష్ కుమార్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తమ కంపెనీ ప‌రిమిత కంప్యూట్ సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంద‌ని, ఇండ‌స్‌ను ద‌శ‌ల‌వారిగా అభివృద్ధి చేస్తూ సామ‌ర్థ్యాన్ని పెంచుతామ‌ని తెలిపారు. ప్రారంభ ద‌శ క‌నుక కొన్నిసార్లు యూజ‌ర్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు. యూజ‌ర్లు ఇచ్చే ఫీడ్ బ్యాక్‌ను బ‌ట్టి ఇండ‌స్‌కు మెరుగులు దిద్దుతామ‌ని తెలిపారు.

Advertisement
Advertisement