త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung | శాంసంగ్ నుంచి కొత్త ఏఐ టీవీలు.. ఫీచ‌ర్లు అదిరిపోయాయి..

Samsung | భారత మార్కెట్‌లో శాంసంగ్ తన 2026 విజన్ ఏఐ టీవీ లైనప్‌ను అధికారికంగా విడుద‌ల చేసింది. మైక్రో ఆర్జీబీ, ఓఎల్ఈడీ, నియో క్యులెడ్, ది ఫ్రేమ్, మినీ ఎల్ఈడీ, యూహెచ్‌డీ విభాగాల్లో ఈ కొత్త టీవీలను అందుబాటులోకి తెచ్చింది.

S

Technology | Published On May 27, 2026, 10.38 am IST

Samsung | శాంసంగ్ నుంచి కొత్త ఏఐ టీవీలు.. ఫీచ‌ర్లు అదిరిపోయాయి..
Advertisement

Samsung | భారత మార్కెట్‌లో శాంసంగ్ తన 2026 విజన్ ఏఐ టీవీ లైనప్‌ను అధికారికంగా విడుద‌ల చేసింది. మైక్రో ఆర్జీబీ, ఓఎల్ఈడీ, నియో క్యులెడ్, ది ఫ్రేమ్, మినీ ఎల్ఈడీ, యూహెచ్‌డీ విభాగాల్లో ఈ కొత్త టీవీలను అందుబాటులోకి తెచ్చింది. అన్ని మోడళ్లలోనూ ఏఐ ఆధారిత ఫీచర్లను విస్తరించి, మెరుగైన పిక్చర్ ప్రాసెసింగ్, సౌండ్ ఆప్టిమైజేషన్, వ్యక్తిగతీకరించిన వ్యూయింగ్ అనుభవాన్ని అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. టీవీ మార్కెట్‌లో వరుసగా 20 సంవత్సరాలుగా గ్లోబల్ నంబర్-1 బ్రాండ్‌గా కొనసాగుతున్నామని శాంసంగ్ తెలిపింది. ఈసారి 4కే, అంతకంటే పై స్థాయి టీవీలన్నింటిలోనూ విజన్ ఏఐ కంపానియన్ (వీఏసీ) ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, ఏఐ-ఫస్ట్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేసిన‌ట్లు తెలిపింది. విజన్ ఏఐ కంపానియన్ (వీఏసీ)లో బిక్స్‌బీ, పర్‌ప్లెక్సిటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ఏఐ సర్వీసులను ఒకే సిస్టమ్‌లో ఇచ్చారు. ఇది టీవీ స్క్రీన్‌పైనే పనిచేసే స్మార్ట్ అసిస్టెంట్‌లా ఉంటుంది.

అనేక ఫీచ‌ర్ల‌ను ఏఐ సెట్ చేస్తుంది..

ఏ సినిమా చూడాలి, ఏ సంగీతం వినాలి, ఏ ఫుడ్ ట్రై చేయాలి వంటి సూచనలను కూడా ఏఐ అందిస్తుంది. వినోదంతో పాటు స్పోర్ట్స్, గేమింగ్ అనుభవాల్లో కూడా ఏఐ ఆధారిత మెరుగుదలను శాంసంగ్ తీసుకొచ్చింది. ఏఐ అప్‌స్కేలింగ్ ప్రో ద్వారా తక్కువ రిజల్యూషన్ వీడియోలను రియల్ టైమ్‌లో మెరుగైన క్లారిటీతో చూపిస్తుంది. కలర్ బూస్టర్ ప్రో సన్నివేశాలను విశ్లేషించి సహజ రంగులను అందిస్తుంది. ఏఐ సాకర్ మోడ్ స్పోర్ట్స్ కంటెంట్‌ను స్మూత్ మోషన్‌తో చూపిస్తూ స్టేడియం తరహా ఆడియో అనుభవం ఇస్తుంది. ఏఐ సౌండ్ కంట్రోలర్ ప్రో డైలాగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎఫెక్ట్స్ మధ్య స్పష్టమైన సౌండ్ సెపరేషన్ అందిస్తుంది. ఆర్95హెచ్, ఆర్85హెచ్ సిరీస్‌లతో మైక్రో ఆర్జీబీ టీవీలను శాంసంగ్ తొలిసారిగా భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 55 అంగుళాల నుంచి 115 అంగుళాల వరకు స్క్రీన్ సైజులు అందుబాటులో ఉన్నాయి. రెడ్, గ్రీన్, బ్లూ మైక్రో ఎల్ఈడీలను విడివిడిగా నియంత్రించే టెక్నాలజీని ఉపయోగించింది.

ప‌వ‌ర్ ఫుల్ డిస్‌ప్లే..

ఈ విభాగంలో గ్లేర్ ఫ్రీ టెక్నాలజీని కూడా జోడించింది. దీంతో ఎక్కువ వెలుతురు ఉన్న గదుల్లో కూడా ప్రతిబింబాలు తగ్గి స్పష్టమైన వ్యూయింగ్ అనుభవం లభిస్తుంది. మైక్రో ఆర్జీబీ ఏఐ ఇంజిన్ ప్రో, 100 శాతం బీటీ.2020 కలర్ కవరేజ్, హెచ్‌డీఆర్ ప్రో, విజన్ ఏఐ కంపానియన్ సపోర్ట్ వంటి ఫీచ‌ర్ల‌ను ఈ స్మార్ట్ టీవీల‌లో అందించారు. ఫ్లాగ్‌షిప్ ఆర్95హెచ్ మోడల్‌కు జర్మనీకి చెందిన వీడీఈ సంస్థ నుంచి సేఫ్టీ ఫర్ ఐస్, సర్కేడియన్ రిథమ్ డిస్‌ప్లే సర్టిఫికేషన్లు కూడా లభించాయి. ఎస్95హెచ్, ఎస్90హెచ్, ఎస్85హెచ్ మోడళ్లతో కొత్త ఓఎల్ఈడీ సిరీస్‌ను ప్రకటించింది. డీప్ బ్లాక్స్, మెరుగైన కాంట్రాస్ట్, స్లిమ్ డిజైన్ ఈ సిరీస్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు ఫ్లాగ్‌షిప్ మోడల్‌కే పరిమితమైన గ్లేర్ ఫ్రీ టెక్నాలజీని ఇప్పుడు ఎస్95హెచ్, ఎస్90హెచ్ మోడళ్లకు కూడా విస్తరించింది. పాంటోన్ వాలిడేటెడ్ ఆర్ట్‌ఫుల్ కలర్, ఆర్ట్ స్టోర్ సపోర్ట్, ఫ్లోట్‌లేయర్ డిజైన్ ను ఇచ్చారు. ఇక గేమింగ్ కోసం మోషన్ ఎక్సిలరేటర్ 165హెడ్జ్‌, ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియం ప్రో, ఎన్విడియా జీ-సింక్ కంపాటిబుల్ సపోర్ట్ ను ఇచ్చారు.

ధ‌ర వివ‌రాలు..

స్పోర్ట్స్ కోసం ఎస్95హెచ్, ఎస్90హెచ్‌లలో ఏఐ సాకర్ మోడ్ ప్రో, ఎస్85హెచ్‌లో ఏఐ సాకర్ మోడ్ ల‌ను అందించారు. ఎల్ఎస్03హెచ్ మోడల్‌తో వచ్చిన ది ఫ్రేమ్ సిరీస్ ఇంటీరియర్ డిజైన్, డిజిటల్ ఆర్ట్ అనుభవంపై దృష్టి పెట్టింది. 3వేల‌కు పైగా క్యురేటెడ్ ఆర్ట్‌వర్క్స్‌తో ఆర్ట్ మోడ్ అందుబాటులో ఉంది. మోడర్న్ ఫ్రేమ్ డిజైన్, క్యులెడ్ డిస్‌ప్లే, గ్లేర్ ఫ్రీ టెక్నాలజీ, మ్యూజియం తరహా ఆర్ట్ డిస్‌ప్లే ల‌ను ఇచ్చారు. ఈ కొత్త విజన్ ఏఐ టీవీ సిరీస్ భారత్‌లో నేటి నుంచే శాంసంగ్ రిటైల్ స్టోర్లు, అధికారిక వెబ్‌సైట్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. మైక్రో ఆర్జీబీ టీవీలు రూ.1,24,990 ప్రారంభ ధ‌ర‌కు అందుబాటులో ఉండ‌గా, ఓఎల్ఈడీ టీవీలు రూ.1,14,990, ది ఫ్రేమ్ టీవీలు రూ.56,990, నియో క్యులెడ్ టీవీలు రూ.52,990, మినీ ఎల్ఈడీ టీవీలు రూ.42,990, యూహెచ్‌డీ టీవీలు రూ.36,990 ప్రారంభ ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉన్నాయి.

లాంచ్ ఆఫర్లలో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.1,02,990 విలువైన సౌండ్‌బార్ ఉచితంగా ఇస్తున్నారు. రూ.23,990 విలువైన మ్యూజిక్ స్టూడియోను ఫ్రీగా పొంద‌వ‌చ్చు. గరిష్ఠంగా 20 శాతం క్యాష్‌బ్యాక్, ఈఎంఐ సదుపాయాల‌ను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement
Advertisement