త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung | రీఫర్బిష్డ్ ఫోన్లను స్వ‌యంగా విక్ర‌యిస్తున్న శాంసంగ్‌.. వినూత్న ప్రోగ్రామ్ ప్రారంభం..

Samsung | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శామ్‌సంగ్ భారత్‌లో అధికారికంగా Certified Re-Newed పేరిట ఓ వినూత్న ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా కంపెనీ రీఫర్బిష్డ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరలకే విక్రయించనుంది. అయితే ఇవి సాధారణ సెకండ్‌హ్యాండ్ లేదా అనధికారిక రీఫర్బిష్డ్ ఫోన్లు కాదని, శామ్‌సంగ్ స్వయంగా పరీక్షించి, ధ్రువీకరించిన డివైస్‌లని కంపెనీ స్పష్టం చేసింది.

S

Technology | Published On May 11, 2026, 2.49 pm IST

Samsung | రీఫర్బిష్డ్ ఫోన్లను స్వ‌యంగా విక్ర‌యిస్తున్న శాంసంగ్‌.. వినూత్న ప్రోగ్రామ్ ప్రారంభం..
Advertisement

Samsung | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శామ్‌సంగ్ భారత్‌లో అధికారికంగా Certified Re-Newed పేరిట ఓ వినూత్న ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా కంపెనీ రీఫర్బిష్డ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరలకే విక్రయించనుంది. అయితే ఇవి సాధారణ సెకండ్‌హ్యాండ్ లేదా అనధికారిక రీఫర్బిష్డ్ ఫోన్లు కాదని, శామ్‌సంగ్ స్వయంగా పరీక్షించి, ధ్రువీకరించిన డివైస్‌లని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ప్రోగ్రామ్‌లో ఫ్లాగ్‌షిప్, మిడ్‌రేంజ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరల్లో ప్రీమియం గెలాక్సీ అనుభవాన్ని అందించడంతో పాటు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించే సస్టైనబుల్ టెక్నాలజీ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శామ్‌సంగ్ తెలిపింది.

పూర్తి స్థాయిలో చెకింగ్‌ల త‌రువాతే..

ప్రతి Certified Re-Newed డివైస్‌ను Samsung-approved టెక్నీషియన్లు పూర్తిగా పరిశీలించి, క్లీనింగ్ చేసి, నాణ్యత పరీక్షలు నిర్వహిస్తారు. డివైస్‌లలో 100 శాతం జెన్యూయిన్ శామ్‌సంగ్ భాగాలనే ఉపయోగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కొన్ని దేశాల్లో 132 నుంచి 147 పాయింట్ల వరకు క్వాలిటీ ఇన్‌స్పెక్షన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ఈ ఫోన్లకు కొత్త IMEI నంబర్, తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఒక సంవత్సరం వారంటీని కూడా అందిస్తామని కంపెనీ పేర్కొంది. బాక్స్‌లో ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్ట‌ర్ పిన్ వంటి సాధారణ యాక్సెసరీస్ కూడా ఉంటాయని తెలిపింది.

త‌క్కువ ధ‌ర‌లు, ప‌ర్యావ‌ర‌ణ హితం..

ఈ ప్రోగ్రామ్ భారత్‌లో ప్రీమియం ఫోన్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, వినియోగదారుల్లో అధికారిక రీఫర్బిష్డ్ డివైస్‌లపై నమ్మకాన్ని పెంచే ప్రయత్నంగా కూడా భావిస్తున్న‌ట్లు శాంసంగ్ పేర్కొంది. ఇప్పటి వరకు చాలా మంది వినియోగదారులు థర్డ్ పార్టీ రీఫర్బిష్డ్ మార్కెట్‌ల‌పై ఆధారపడాల్సి వచ్చేద‌ని, కానీ ఇప్పుడు కంపెనీ నుంచే అధికారికంగా ధ్రువీకరించిన డివైస్‌లు లభించనున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. శామ్‌సంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూడా పనిచేస్తుంది. పాత ఫోన్లను మళ్లీ వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఈ-వేస్ట్‌ను తగ్గించవచ్చని కంపెనీ పేర్కొంది. ఒక ఫోన్‌ను మళ్లీ ఉపయోగించడం ద్వారా గణనీయమైన కార్బన్ ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్యక్రమాల్లో శామ్‌సంగ్ గతంలో వెల్లడించింది.

ఏయే డివైస్‌లు ప్ర‌స్తుతం ఉన్నాయి..

ఇటీవల శామ్‌సంగ్ ఈ Certified Re-Newed ప్రోగ్రామ్‌ను అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే వంటి మార్కెట్లకు విస్తరించింది. అక్కడ గెలాక్సీ ఎస్‌25 సిరీస్‌, గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 7 వంటి ప్రీమియం మోడళ్లను కూడా ఈ ప్రోగ్రామ్‌లో చేర్చింది. భారత్‌లో ఈ డివైస్‌లు శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు మోడ‌ల్స్‌ను ప్ర‌స్తుతం సైట్‌లో విక్ర‌యిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌25 (256జీబీ) రీఫ‌ర్బిష్డ్ ఫోన్ ధ‌ర రూ.58,749 ఉండ‌గా, గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా (256జీబీ) రూ.97,499, గెలాక్సీ ఎ56 5జి (12జీబీ ర్యామ్‌) రూ.32,749, గెలాక్సీ ఎ56 5జి (8జీబీ ర్యామ్‌) రూ.31,499, గెలాక్సీ ఎ36 5జి (128జీబీ) రూ.23,249, గెలాక్సీ ఎ36 5జి (256జీబీ) రీఫ‌ర్బిష్డ్ ఫోన్ రూ.24,499 ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా మ‌రిన్ని మోడ‌ల్స్‌ను అందుబాటులోకి తేనున్నామ‌ని శాంసంగ్ తెలియ‌జేసింది.

Advertisement
Advertisement