Stock Markets | స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో సందిగ్ధత..
Stock Markets | అమెరికా-ఐరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే బ్రాడర్ మార్కెట్లు మాత్రం బెంచ్‌మార్క్ సూచీల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. మధ్య ప్రాచ్య పరిణామాలు, ముఖ్యంగా అమెరికా ఐరాన్‌పై దాడులు జరపడం, ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది.
Stock Markets | అమెరికా-ఐరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే బ్రాడర్ మార్కెట్లు మాత్రం బెంచ్‌మార్క్ సూచీల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. మధ్య ప్రాచ్య పరిణామాలు, ముఖ్యంగా అమెరికా ఐరాన్‌పై దాడులు జరపడం, ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో సుమారు 70 పాయింట్లు పడిపోయి 75,940 వద్ద ట్రేడ్ అయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 కూడా 33 పాయింట్లు (0.14 శాతం) తగ్గి 23,880 వద్ద సెషన్‌ను ప్రారంభించింది. ఇదే సమయంలో మార్కెట్ వోలాటిలిటీని కొలిచే ఇండియా విక్స్ 3 శాతానికి పైగా పడిపోయి 16.13 వద్దకు చేరింది. సెన్సెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1 శాతం వరకు పడిపోయి టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు సన్ ఫార్మా షేరు 1 శాతానికి పైగా పెరిగి టాప్ గైనర్‌గా నిలిచింది. ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్), ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
స్వల్పంగా తగ్గిన చమురు ధరలు..
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 0.5 శాతం పెరిగి టాప్ గైనర్‌గా నిలవగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.2 శాతం తగ్గింది. ఎన్‌ఎస్‌ఈలో సుమారు 1,433 షేర్లు లాభాల్లో ఉండగా, 760 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 163 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్, నిక్కీ సూచీలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోస్పీ, టైఎక్స్ మార్కెట్లలో కూడా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ బుల్ ర్యాలీ కొనసాగుతున్నంతకాలం భారత మార్కెట్‌లపై ఎఫ్‌ఐఐల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే కొనసాగుతున్న ఏఐ ట్రేడ్ కారణంగా మార్కెట్లో కాన్సన్‌ట్రేషన్ రిస్క్ పెరుగుతున్నప్పటికీ మార్కెట్ దాన్ని పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇది ఎంతకాలం కొనసాగుతుందో తెలియదని, భారత్ మళ్లీ ఎఫ్‌ఐఐలకు ఆకర్షణీయంగా మారే సమయం ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. కాగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరల మాత్ర స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1.60 శాతం తగ్గి బ్యారెల్‌కు 97.91 వద్ద కొనసాగుతుండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.65 శాతం తగ్గి బ్యారెల్ కు 90 డాలర్ల వద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి విలువ మళ్లీ క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు తగ్గి 95.77 వద్ద ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
సెప్టెంబర్ 10, 2026

US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
సెప్టెంబర్ 10, 2026

Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్
- ●Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్టబొమ్మ బాక్సాఫీస్ ఫైట్ - పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?
- ●Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు
- ●Vemula Prashanth Reddy | సాగు నీళ్లు లేక.. తల్లడిల్లుతున్న నిజామాబాద్ రైతులు
- ●Talasani Srinivas Yadav | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులా..?
- ●Adilabad Khichdi Sellers Sons | ఉదయం కిచిడీ బండి.. రాత్రిళ్లు పుస్తకాలతో కుస్తీ : నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన యువకులు

Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్

Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్టబొమ్మ బాక్సాఫీస్ ఫైట్ - పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?

Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు

Vemula Prashanth Reddy | సాగు నీళ్లు లేక.. తల్లడిల్లుతున్న నిజామాబాద్ రైతులు



