Gold And Silver Prices Today | బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారులు జాగ్రత్త..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత కొనసాగుతుండడంతో ఆ ప్రభావం బంగారం, వెండి ధరలపైనా పడుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయా, అసలేమవుతోంది.. అని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ సందిగ్ధంలో ఉన్నారు. దీంతో సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత కొనసాగుతుండడంతో ఆ ప్రభావం బంగారం, వెండి ధరలపైనా పడుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయా, అసలేమవుతోంది.. అని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ సందిగ్ధంలో ఉన్నారు. దీంతో సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక బంగారం, వెండి ధరల్లోనూ స్వల్ప హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.01 శాతం పెరిగి 4507 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.15 శాతం తగ్గి 76.76 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 32 పాయింట్లు పెరిగి 1,57,648 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1638 పాయింట్లు పెరిగి 2,72,400 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,829 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,26, 632 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,58,290 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,82,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.6వేలు తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,510 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,16,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,45,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,51,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,872 ఉండగా, 8 గ్రాముల ధర రూ.94,976గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,18,720 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,87,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4500 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,85,000 ఉండగా, తులం ధర రూ.2,850గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,90,000 ఉండగా, తులం ధర రూ.2,900 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో సందిగ్ధత..
మే 27, 2026

Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం ధరలు.. యుద్ధం భయంతో పెట్టుబడిదారుల్లో తగ్గిన ఆసక్తి..
మే 26, 2026

Stock Markets | యుద్ధ భయంతో మార్కెట్లు డల్.. క్రూడ్ మళ్ళీ పెరిగింది..
మే 26, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్
- ●Carrymen | షాపింగ్‌కు కొత్త సొల్యూషన్.. బ్యాగులు మోయడానికి ‘క్యారీమెన్’!
- ●UNSC | తీవ్ర పరిణామాలు తప్పవు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టిన భారత్
- ●Wanaparthy | అప్పు ఇచ్చినవారు వేధిస్తున్నారని.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి ఆత్మహత్య
- ●Taiwan Stock Markets | ఢిల్లీ కంటే చిన్న దేశం.. ఇండియాను దాటేసింది..
- ●Samsung | శాంసంగ్ నుంచి కొత్త ఏఐ టీవీలు.. ఫీచర్లు అదిరిపోయాయి..

Revanth Reddy | పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్

Carrymen | షాపింగ్‌కు కొత్త సొల్యూషన్.. బ్యాగులు మోయడానికి ‘క్యారీమెన్’!

UNSC | తీవ్ర పరిణామాలు తప్పవు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టిన భారత్

Wanaparthy | అప్పు ఇచ్చినవారు వేధిస్తున్నారని.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి ఆత్మహత్య



