త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung | శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ల‌కు భారీ డిమాండ్.. 72 గంటల్లోనే 2.71 లక్షల ప్రీ ఆర్డర్లు..

Samsung | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ దిగ్గ‌జ సంస్థ శాంసంగ్ ఇటీవ‌లే ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న 8వ జ‌న‌రేష‌న్ ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫోన్ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా విశేష రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. భార‌త్‌లోనూ ఈ ఫోన్ల‌కు డిమాండ్ భారీగా ఏర్ప‌డింది. ఈ మేర‌కు సంస్థ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

S

Technology | Published On Jul 30, 2026, 1.21 pm IST

Samsung | శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ల‌కు భారీ డిమాండ్.. 72 గంటల్లోనే 2.71 లక్షల ప్రీ ఆర్డర్లు..
Advertisement

Samsung | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ దిగ్గ‌జ సంస్థ శాంసంగ్ ఇటీవ‌లే ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న 8వ జ‌న‌రేష‌న్ ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫోన్ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా విశేష రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. భార‌త్‌లోనూ ఈ ఫోన్ల‌కు డిమాండ్ భారీగా ఏర్ప‌డింది. ఈ మేర‌కు సంస్థ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ నెల 22న విడుదలైన గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 8 మోడళ్లు విడుదలైన తొలి 72 గంటల్లోనే 2.71 లక్షలకు పైగా ప్రీ ఆర్డర్లను నమోదు చేశాయి. ఈ గణాంకాలు భారత్‌లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారుల ఆసక్తి వేగంగా పెరుగుతోందని సూచిస్తున్నాయి. గతేడాది విడుదలైన గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 7 సిరీస్ ఇదే స్థాయి ప్రీ ఆర్డర్లను సాధించడానికి 15 రోజులు పట్టగా, ఈసారి కేవలం 3 రోజుల్లోనే ఆ మైలురాయిని దాటడం విశేషం. దీంతో ఫోల్డబుల్ విభాగంలో శాంసంగ్ విక్రయాలు మరింత వేగంగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

టియ‌ర్ 2 న‌గ‌రాల నుంచి సైతం డిమాండ్‌..

ఈసారి మరో ఆసక్తికరమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మొత్తం ప్రీ ఆర్డర్లలో 45 శాతం టియర్ 2 నగరాలు, చిన్న ప్రాంతీయ పట్టణాల నుంచే నమోదయ్యాయని శాంసంగ్ వెల్లడించింది. దీంతో ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని కంపెనీ పేర్కొంది. ప్రారంభ స్పందనను దృష్టిలో ఉంచుకుని, ఈ ఎనిమిదో తరం ఫోల్డబుల్ సిరీస్ ప్రీ ఆర్డర్లు ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన కంపెనీ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్ స్థాయికి చేరుకునే అవకాశముందని శాంసంగ్ అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ధరల విషయానికి వస్తే.. గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 8 అల్ట్రా ప్రారంభ ధర రూ.1,99,999గా, జ‌డ్ ఫోల్డ్ 8 ప్రారంభ ధర రూ.1,79,999గా, జ‌డ్ ఫ్లిప్ 8 ప్రారంభ ధర రూ.1,24,999గా ఉంది.

ప్ర‌త్యేక ఆఫ‌ర్లు సైతం..

వినియోగదారులకు కొనుగోలు సౌలభ్యం కల్పించేందుకు శాంసంగ్ ప్రత్యేక ఆర్థిక పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని మోడళ్లపై పరిశ్రమలో తొలిసారిగా 30 నెలల జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ప్రకటించింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు ఆగస్టు 8 నుంచి విక్రయాలకు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement