త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Galaxy S25 Edge | రూ.47 వేల తగ్గింపుతో ల‌భిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌.. అమెజాన్‌లో భారీ డీల్..

Samsung Galaxy S25 Edge | శామ్‌సంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ను కొనాలని అనుకుంటూ, అధిక ధర కారణంగా ఇప్పటివరకు వెనుకంజ వేసిన వారికి ఇప్పుడు మంచి అవకాశం లభించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్ 5జి ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది.

S

Technology | Published On Jul 14, 2026, 1.44 pm IST

Samsung Galaxy S25 Edge | రూ.47 వేల తగ్గింపుతో ల‌భిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌.. అమెజాన్‌లో భారీ డీల్..
Advertisement

Samsung Galaxy S25 Edge | శామ్‌సంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ను కొనాలని అనుకుంటూ, అధిక ధర కారణంగా ఇప్పటివరకు వెనుకంజ వేసిన వారికి ఇప్పుడు మంచి అవకాశం లభించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్ 5జి ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో లక్ష రూపాయలకు పైగా ధర ఉన్న ఈ ఫోన్‌పై ఇప్పుడు రూ.47,649 వరకు నేరుగా తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్ 5జి ఫోన్ ధర రూ.62,350గా ఉంది. ఈ ఫోన్ అసలు ప్రారంభ ధర రూ.1,09,999 కాగా, ఇప్పుడు నేరుగా రూ.47,649 తగ్గింపుతో విక్రయిస్తున్నారు. దీనికి అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉండటంతో మొత్తం ఆదా మరింత పెరిగే అవకాశం ఉంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపు చేస్తే రూ.1,870 వరకు అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.1,625 వరకు వడ్డీ ఆదా కూడా లభిస్తుంది.

భారీగా ఎక్స్‌ఛేంజ్ బోన‌స్‌..

పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.33,300 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది. అయితే తుది ఎక్స్చేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితి, అందుబాటులో ఉన్న ఆఫర్లపై ఆధారపడి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్ కంపెనీ ఇప్పటివరకు విడుదల చేసిన అత్యంత సన్నని ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కాగా ఇందులో 6.7 ఇంచుల క్యూహెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120హెడ్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ను క‌లిగి ఉంది. 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 ప్రొటెక్ష‌న్‌ను ఇచ్చారు. వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ 2 ప్రొటెక్ష‌న్ ఉంది. ప్రీమియం లుక్ కోసం టైటానియం ఫ్రేమ్ ను అందించారు. ఈ ఫోన్ మందం కేవలం 5.8 మిల్లీమీటర్లు మాత్రమే. అలాగే ఐపీ68 రేటింగ్ ఉండటంతో నీరు, ధూళి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.

200 మెగాపిక్స‌ల్ భారీ కెమెరా..

పనితీరు కోసం ఇందులో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి 12జీబీ ర్యామ్ తో పాటు 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వ‌న్ యూఐ 8 పై పనిచేస్తుంది. అలాగే 7 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు, సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని శామ్‌సంగ్ తెలిపింది. ఫోటోగ్రఫీ కోసం 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఓఐఎస్ సపోర్ట్‌తో అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కెమెరా వ్యవస్థలో గెలాక్సీ ఏఐ ఆధారిత ఫొటో అసిస్ట్‌, ఆడియో ఎరేజ‌ర్‌, జ‌న‌రేటివ్ ఎడిట్‌, నైటోగ్ర‌ఫీ, బెస్ట్ ఫేస్‌, ప్రొ విజువ‌ల్ ఇంజిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఫోటోలు, వీడియోల నాణ్యతను మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Advertisement
Advertisement