Dasoju Sravan Kumar | బంకర్ బెడ్ల కుంభకోణంపై రేవంత్ ప్రభుత్వానికి నోటీసులు.. ‘పెద్ది’ పోరాట ఫలితమే
Dasoju Sravan Kumar | గురుకుల స్కూళ్ల బంకర్ బెడ్ల కుంభకోణంపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ యోధుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి పోరాట ఫలితంగానే రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెద్ది చేసిన పోరాటం అసమానమన్నారు.
- మృత్యువుతో పోరాడుతూనే అవినీతిపై గళమెత్తారు
- పెద్ది లేని లోటు తీర్చలేనిది.. ఆయన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం
- ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ భావోద్వేగ పోస్ట్
Dasoju Sravan Kumar | త్రినేత్ర.న్యూస్: గురుకుల స్కూళ్ల బంకర్ బెడ్ల కుంభకోణంపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ యోధుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి పోరాట ఫలితంగానే రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెద్ది చేసిన పోరాటం అసమానమన్నారు. రేవంత్ ప్రభుత్వ నేతృత్వంలో బెడ్ల కొనుగోళ్లలో జరిగిన వందల కోట్ల రూపాయల టెండర్ల అవకతవకలు, అవినీతిపై మృత్యువుతో పోరాడుతున్న సమయంలోనూ గళమెత్తారని గుర్తు చేశారు. ఇవాళ పెద్ది మరణించడంతో కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలను సానుభూతి తెలుపుతూ ఆయన ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. సుప్రీం జారీ చేసిన నోటీసును పంచుకున్నారు.
నిఖార్సయిన నాయకుడు పెద్ది..
హైకోర్టును ఈ ప్రభుత్వం తప్పుదోవ పట్టించినా, అనేక ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు వేయలేదు. ప్రజా పోరాటం, న్యాయ పోరాటం చేసి సుప్రీం తలుపు తట్టారు. ఆయన చేసిన న్యాయ పోరాటాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసులో ఉన్న అవినీతి ఆరోపణలను గుర్తించి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నీతి, నిజాయితీ, నిఖార్సయిన నాయకుడు పెద్ది. ఆయన మొదలుపెట్టిన పోరాటాన్ని మనమందరం కంకణం కట్టుకొని ముందుకు తీసుకెళ్లాలి. వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్‌కు తీరని లోటు అని శ్రవణ్ పేర్కొన్నారు.
జోహార్లు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడారు. అలసి సొలసి నిష్క్రమించారు. పెద్ది బతికున్నంత కాలం ప్రజా నాయకుడిగా, ఉద్యమ యోధుడిగా పోరాడారు. నిష్క్రమిస్తూ కూడా అవినీతిపై సాగించిన పోరాటం మనందరికీ చిరస్మరణీయమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నా ప్రగాఢ సానుభూతి. జోహార్లు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు.. అంటూ దాసోజు శ్రవణ్ భావోద్వేగంగా రాసుకొచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!





