త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Galaxy Z Flip8 | శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్8 వచ్చేసింది.. స్లిమ్ డిజైన్, ఏఐ ఫీచర్లతో ఆకట్టుకునే ఫ్లిప్ ఫోన్‌..

Samsung Galaxy Z Flip8 | టెక్ దిగ్గ‌జ సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్8 సిరీస్‌తో పాటు కొత్త గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్8 ఫోన్ ను కూడా ఆవిష్కరించింది. గత ఏడు తరాల ఫోల్డబుల్ టెక్నాలజీ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ మరింత సన్నని డిజైన్, వేగవంతమైన ఇంటరాక్షన్‌లు, వ్యక్తిగతీకరణ (పర్సనలైజేషన్), ఏఐ ఆధారిత ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.

S

Technology | Published On Jul 23, 2026, 12.50 pm IST

Samsung Galaxy Z Flip8 | శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్8 వచ్చేసింది.. స్లిమ్ డిజైన్, ఏఐ ఫీచర్లతో ఆకట్టుకునే ఫ్లిప్ ఫోన్‌..
Advertisement

Samsung Galaxy Z Flip8 | టెక్ దిగ్గ‌జ సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్8 సిరీస్‌తో పాటు కొత్త గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్8 ఫోన్ ను కూడా ఆవిష్కరించింది. గత ఏడు తరాల ఫోల్డబుల్ టెక్నాలజీ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ మరింత సన్నని డిజైన్, వేగవంతమైన ఇంటరాక్షన్‌లు, వ్యక్తిగతీకరణ (పర్సనలైజేషన్), ఏఐ ఆధారిత ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. తక్కువ బరువు, సులభంగా చేతిలో పట్టుకునే డిజైన్‌తో ప్రయాణాల్లో కూడా సౌకర్యవంతంగా ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించారు. గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్8 ఇప్పటివరకు వచ్చిన ఫ్లిప్ సిరీస్‌లోనే అత్యంత సన్నని, తేలికైన మోడల్‌గా నిలిచింది. దీని బరువు కేవలం 180 గ్రాములు కాగా, ఫోన్‌ను తెరిచినప్పుడు మందం 6.1 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. మెరుగైన హింజ్ మెకానిజం, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌తో దీని నిర్మాణాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దారు.

ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, ఏఐ ఫీచర్లు..

ఈ ఫోన్‌లో 6.9 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను అందించారు. ఇది 1 హెడ్జ్ నుంచి 120 హెడ్జ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. బయటి వైపు 4.1 ఇంచుల సూపర్ అమోలెడ్ ఫ్లెక్స్‌విండో ఉండగా నోటిఫికేషన్‌లు, విడ్జెట్‌లు, యాప్ కంట్రోల్స్‌ను ఫోన్‌ను తెరవకుండానే ఉపయోగించుకోవచ్చు. ఈసారి ఫ్లెక్స్‌విండోను శాంసంగ్ పూర్తిస్థాయి ఏఐ ఇంటర్‌ఫేస్‌గా మార్చింది. చిన్న పనుల కోసం ఫోన్‌ను తెరవాల్సిన అవసరం లేకుండా అనేక ఫీచర్లు నేరుగా కవర్ స్క్రీన్‌పైనే అందుబాటులో ఉంటాయి. నౌ బ్రీఫ్ ఫీచర్ ద్వారా రోజువారీ షెడ్యూల్, రిమైండర్‌లు, సెక్యూరిటీ అలర్ట్‌లు, వ్యక్తిగత సూచనలు ఒకేచోట కనిపిస్తాయి. జెమిని ఇంటెలిజెన్స్ సహాయంతో సైడ్ కీ లేదా వాయిస్ కమాండ్ ద్వారా యాప్‌లను ఓపెన్ చేయడం, టాస్క్‌లు పూర్తి చేయడం, నావిగేషన్ వివరాలు పొందడం వంటి పనులు వేగంగా చేయవచ్చు. అలాగే విడ్జెట్‌లు, క్విక్ సెట్టింగ్‌లు, యాప్ కంట్రోల్స్‌ను వినియోగదారుడు తనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు.

అద్భుత‌మైన కెమెరాలు..

ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరాల‌ను అందించారు. ప్రొ విజువల్ ఇంజిన్ ద్వారా పోర్ట్రెయిట్ ఫొటోల్లో చర్మ రంగులు సహజంగా కనిపించేలా, మరింత స్పష్టతతో చిత్రాలను అందిస్తుంది. ఫోన్‌ను మడిచి వివిధ కోణాల్లో చిత్రీకరించేందుకు ఫ్లెక్స్ మోడ్ ఉపయోగపడుతుంది. క్యామ్‌కార్డర్ గ్రిప్ ఇంటర్‌ఫేస్‌లో జూమ్ రాకర్ ఉండటం వల్ల వీడియోల‌ను మరింత స్థిరంగా రికార్డ్ చేయవచ్చు. సూపర్ స్టెడీ విత్ హారిజాంటల్ లాక్ ఫీచర్ వీడియో రికార్డింగ్ సమయంలో కంపనాలను తగ్గించి సమతుల్యంగా ఉంచుతుంది. ఫ్లిప్‌షాట్, మిర్రర్ వ్యూ ఫీచర్లతో కవర్ స్క్రీన్ నుంచే సెల్ఫీలు తీసుకోవడం, రియల్ టైమ్ ప్రివ్యూ చూడడం సులభత‌రం అవుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9తో పనిచేస్తుంది. ఏఐ ఏజెంట్ నియంత్రణలు, మెరుగైన భద్రతా వ్యవస్థలను ఇందులో పొందుపరిచారు. భారత్‌తోపాటు ఇత‌ర దేశాల మార్కెట్లలో ఎక్సినోస్ 2600 2 నానోమీటర్ ప్రాసెసర్ ను అందించగా, కొన్ని మార్కెట్లలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 చిప్‌సెట్‌తో లభిస్తుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ లేదా 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో లాంచ్ చేశారు.

ప్ర‌త్యేక‌మైన సెక్యూరిటీ వ్య‌వ‌స్థ‌..

ఈ ఫోన్‌లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 25 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్ ను సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం శాంసంగ్ నాక్స్, నాక్స్ వాల్ట్, పర్సనల్ డేటా ఇంజిన్ (పీడీఈ), నాక్స్ ఎన్‌హాన్స్‌డ్ ఎన్‌క్రిప్టెడ్ ప్రొటెక్షన్ (కీప్) వంటి భద్రతా వ్యవస్థలను అందించారు. కొత్త ఏఐ అసిస్టెంట్ యాక్టివిటీ డ్యాష్‌బోర్డ్ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తున్న ఏఐ కార్యకలాపాలను పర్యవేక్షించడంతోపాటు యాప్ అనుమతులను కూడా నియంత్రించవచ్చు. ఇందులో డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. 5జి ల‌భిస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 5.4 ఉన్నాయి. యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఇచ్చారు. ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్‌, ఐపీ48 వాటర్ రెసిస్టెన్స్, డాల్బీ ఆట్మాస్ స్టీరియో స్పీకర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధ‌ర ఎంతంటే..

శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్8 ఫోన్ కు చెందిన 12 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ.1,24,999 ఉండ‌గా, 12 జీబీ, 512 జీబీ వేరియంట్ ధరను రూ.1,44,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ గ్రాఫైట్, క్రీమ్, పింక్ రంగుల్లో భారత్ తో పాటు ఎంపిక చేసిన మార్కెట్లలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి వచ్చింది. మింట్ రంగు వేరియంట్ మాత్రం శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే లభిస్తోంది. ఆగస్టు 8 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా రూ.5వేల అప్‌గ్రేడ్ ఆఫర్ లేదా రూ.4వేల బ్యాంక్ కార్డ్, యూపీఐ బెనిఫిట్ అందిస్తున్నారు. అలాగే 30 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ (జీరో డౌన్ పేమెంట్) లేదా 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ (జీరో డౌన్ పేమెంట్) సదుపాయం కూడా కల్పించారు.

Advertisement
Advertisement