త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung | వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన శాంసంగ్‌.. ఫోన్ల ధ‌ర‌లు భారీగా పెంపు..

Samsung | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ త‌న వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది. ఈ కంపెనీకి చెందిన ఫోన్ల ధ‌ర‌ల‌ను భారీగా పెంచుతున్న‌ట్లు తెలిపింది. భార‌త్‌లో ఈ ఫోన్లు ఇక‌పై పెంచిన ధ‌ర‌ల‌కే అందుబాటులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా ఎస్‌26 సిరీస్ ఫోన్ల ధ‌ర‌ల‌ను గ‌రిష్టంగా 17 శాతం మేర పెంచింది. ఈ మేర‌కు పీటీఐ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

S

Business | Published On Sep 30, 2026, 4.06 pm IST

Samsung | వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన శాంసంగ్‌.. ఫోన్ల ధ‌ర‌లు భారీగా పెంపు..
Advertisement

Samsung | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ త‌న వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది. ఈ కంపెనీకి చెందిన ఫోన్ల ధ‌ర‌ల‌ను భారీగా పెంచుతున్న‌ట్లు తెలిపింది. భార‌త్‌లో ఈ ఫోన్లు ఇక‌పై పెంచిన ధ‌ర‌ల‌కే అందుబాటులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా ఎస్‌26 సిరీస్ ఫోన్ల ధ‌ర‌ల‌ను గ‌రిష్టంగా 17 శాతం మేర పెంచింది. ఈ మేర‌కు పీటీఐ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌లో బేస్ మోడ‌ల్ అయిన 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.1,02,999కు చేరింది. అంత‌కు ముందు దీని ధ‌ర రూ.87,999గా ఉంది. అంటే దాదాపు 17 శాతం పెరుగుద‌ల న‌మోదైంది. గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌ను శాంసంగ్ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల చేసింది. అప్ప‌ట్లో గెలాక్సీ ఎస్‌25 సిరీస్‌తో పోలిస్తే కొత్త సిరీస్ ధ‌ర‌లు 8 నుంచి 15 శాతం మేర ఎక్కువ‌గా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ వీటి ధ‌ర‌ల‌ను ఇంకా పెంచ‌డం గ‌మ‌నార్హం.

ఏయే ఫోన్ల ధ‌ర‌లు ఎంత పెరిగాయి..

విడుదల సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్26 బేస్ వేరియంట్ ధర రూ.87,999గా ఉండగా, గెలాక్సీ ఎస్26 ప్లస్ ప్రారంభ ధర రూ.1,19,999గా ఉంది. గెలాక్సీ ఎస్26 అల్ట్రా ప్రారంభ ధరను రూ.1,39,999గా నిర్ణయించారు. తాజా వివ‌రాల‌ ప్రకారం గెలాక్సీ ఎస్26 256 జీబీ వేరియంట్ ధర రూ.1,02,999కు చేరింది. 512 జీబీ వేరియంట్ ధర రూ.1,22,999గా ఉంది. అంటే ఈ వేరియంట్ ధర 13.9 శాతం పెరిగింది. గెలాక్సీ ఎస్26 ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,34,999కు చేరింది. ఇది ప్రారంభ ధరతో పోలిస్తే 12.5 శాతం పెరుగుదల. 512 జీబీ వేరియంట్ ధర రూ.1,54,999గా ఉంది. ఈ ధర 10.7 శాతం పెరిగింది. గెలాక్సీ ఎస్26 అల్ట్రా 256 జీబీ వేరియంట్ ధర రూ.1,54,999కు చేరింది. ప్రారంభ ధరతో పోలిస్తే ఇది 10.7 శాతం పెరుగుదల. 512 జీబీ వేరియంట్ ధర రూ.1,74,999గా ఉంది. ఈ వేరియంట్ ధర 9.4 శాతం పెరిగింది. అత్యధిక స్టోరేజ్ కలిగిన గెలాక్సీ ఎస్26 అల్ట్రా 1 టీబీ వేరియంట్ ఇకపై రూ.2,14,999 ధరకు ల‌భ్యం కానుంది. అయితే శాంసంగ్ మాత్రం ఈ ధరల పెంపుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సైలెంట్‌గా ధ‌ర‌ల‌ను పెంచిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

పీటీఐ నివేదిక ప్రకారం ఈ ఏడాది మెమరీ చిప్‌లు, మదర్‌బోర్డులు, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల ధరలు పెరగడం వల్ల స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యయాలు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కారణంగానే గెలాక్సీ ఎస్26 సిరీస్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. ఇక ఇత‌ర గెలాక్సీ ఫోన్ల ధ‌ర‌ల‌ను కూడా శాంసంగ్ పెంచ‌నున్న‌ట్లు తెలిసింది. దీనిపై స్ప‌ష్ట‌త రావ‌ల్సి ఉంది.

Advertisement
Advertisement