Samsung India | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్.. 55 శాతం వరకు బైబ్యాక్..
Samsung India | శాంసంగ్ ఇండియా తాజాగా గెలాక్సీ ఫరెవర్ పేరుతో కొత్త ఓనర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా, గెలాక్సీ జడ్ ఫోల్డ్8 స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ఈ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Technology | Published On Aug 19, 2026, 2.37 pm IST
Samsung India | శాంసంగ్ ఇండియా తాజాగా గెలాక్సీ ఫరెవర్ పేరుతో కొత్త ఓనర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా, గెలాక్సీ జడ్ ఫోల్డ్8 స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ఈ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా భవిష్యత్తులో తమ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని లేదా నిర్ణీత కాలం తర్వాత తిరిగి ఇచ్చేయాలని భావించే యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించింది. అయితే ఈ సదుపాయాలు ప్రోగ్రామ్ నిబంధనలకు లోబడి ఉంటాయి. గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్‌లో 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ, ప్రమాదవశాత్తు జరిగే నష్టం, ద్రవ పదార్థాల వల్ల కలిగే నష్టానికి జీరో డిడక్టబుల్స్‌తో శాంసంగ్ కేర్ ప్లస్ డివైస్ ప్రొటెక్షన్, అలాగే ఫోన్ ఇన్‌వాయిస్ విలువలో గరిష్ఠంగా 55 శాతం వరకు హామీ బైబ్యాక్ విలువ లభిస్తుంది.
ఏ నెలలో ఇస్తే ఎంత బై బ్యాక్..?
ఈ ప్రోగ్రామ్‌లోనే శాంసంగ్ కేర్ ప్లస్ ను చేర్చారు. అందువల్ల కస్టమర్లు దీన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ నిబంధనలకు అనుగుణంగా 10వ నెల నుంచి తమ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు లేదా తిరిగి ఇచ్చేయవచ్చు. హామీ బైబ్యాక్ విలువను పన్నులతో కలిపిన డివైస్ ఇన్‌వాయిస్ విలువలో శాతంగా లెక్కిస్తారు. కస్టమర్ ఎప్పుడు ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని లేదా తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటారనే దానిపై ఈ విలువ ఆధారపడి ఉంటుంది. 10వ నెల నుంచి 11వ నెల వరకు ఫోన్‌ను అప్‌గ్రేడ్ లేదా రిటర్న్ చేస్తే ఇన్‌వాయిస్ విలువలో 55 శాతం, 12వ నెల నుంచి 13వ నెల వరకు 50 శాతం, 14వ నెల నుంచి 18వ నెల వరకు 45 శాతం, 19వ నెల నుంచి 25వ నెల వరకు 40 శాతం బైబ్యాక్ విలువ లభిస్తుంది.
ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు..
అప్‌గ్రేడ్ చేసుకునే కస్టమర్లు ఈ ప్రోగ్రామ్ ద్వారా తదుపరి గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌కు మారవచ్చు. అప్‌గ్రేడ్ అవసరం లేదనుకునే వారు వర్తించే నిబంధనలకు అనుగుణంగా తమ ప్రస్తుత ఫోన్‌ను కొనసాగించవచ్చు. గెలాక్సీ ఫరెవర్‌ను ఉపయోగించకుండా నేరుగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి పూర్తిగా తమ సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంది. హామీ బైబ్యాక్ సదుపాయాన్ని ఉపయోగించాలంటే 10వ నెల నుంచి 25వ నెల మధ్య శాంసంగ్ డాట్ ఆన్‌లైన్ ద్వారా అప్‌గ్రేడ్ లేదా రిటర్న్ అభ్యర్థనను సమర్పించాలి. ఫోన్ పవర్ ఆన్ అవుతూ ఉండటంతో పాటు ధ్రువీకరించగలిగే ఐఎంఈఐ నంబర్ ఉండాలి. డివైస్‌లో ఎలాంటి ట్యాంపరింగ్ జరిగి ఉండకూడదు. వర్తించే సందర్భాల్లో స్టైలస్ కూడా తప్పనిసరిగా ఉండాలి. స్టైలస్ లేకపోతే రూ.4,399 ఛార్జీ విధిస్తారు.
ఈఎంఐ ఎంత..
గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా కోసం నెలకు రూ.9,417 చెల్లించాలి. ఇందులో రూ.8,334 డివైస్ ఈఎంఐ కాగా, రూ.1,083 గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్ ఫీజు ఉంటుంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్8 కోసం నెలకు రూ.8,584 చెల్లించాలి. ఇందులో రూ.7,500 డివైస్ ఈఎంఐ, రూ.1,084 గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్ ఫీజు ఉంటుంది. ఈ రెండు ప్లాన్‌లు 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐపై ఆధారపడి ఉంటాయి. వీటిలో గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్ ఫీజు కూడా ఉంటుంది. హామీ బైబ్యాక్ విలువ మాత్రం గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్ నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. హరీశ్‌రావు వాహనాన్ని ఆపి విద్యార్థుల ఆవేదన
- ●Priyanka | ‘ఓజీ’ తర్వాత ప్రియాంకకు జాక్‌పాట్.. రవితేజ సినిమాలో భారీ రెమ్యునరేషన్!
- ●Jairam Ramesh | 14 కోట్ల మంది భారతీయులు చొరబాటుదారులా? ఓటర్ల జాబితా సవరణపై అమిత్ షాకు కాంగ్రెస్ 3 సూటి ప్రశ్నలు
- ●Samakhya Global Business Summit 2026 | ఉద్యోగాలు చేయడం కాదు.. కంపెనీలు పెట్టే స్థాయికి ఎదగాలి
- ●DGCA Power Bank Ban | విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ కంపెనీ పవర్ బ్యాంక్‌పై DGCA నిషేధం
- ●Mrunal Thakur | మృణాల్ కొత్త సినిమాలకు నో చెబుతోందా..? అసలు కారణం అదేనా..?

Harish Rao | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. హరీశ్‌రావు వాహనాన్ని ఆపి విద్యార్థుల ఆవేదన

Priyanka | ‘ఓజీ’ తర్వాత ప్రియాంకకు జాక్‌పాట్.. రవితేజ సినిమాలో భారీ రెమ్యునరేషన్!

Jairam Ramesh | 14 కోట్ల మంది భారతీయులు చొరబాటుదారులా? ఓటర్ల జాబితా సవరణపై అమిత్ షాకు కాంగ్రెస్ 3 సూటి ప్రశ్నలు

Samakhya Global Business Summit 2026 | ఉద్యోగాలు చేయడం కాదు.. కంపెనీలు పెట్టే స్థాయికి ఎదగాలి






