Samsung | శాంసంగ్ బంపర్ ఆఫర్.. ఫోల్డబుల్ ఫోన్లపై 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ.. జీరో డౌన్ పేమెంట్‌తో..
Samsung | శాంసంగ్ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా, గెలాక్సీ జడ్ ఫోల్డ్8, గెలాక్సీ జడ్ ఫ్లిప్8 కోసం కొత్తగా 30 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఫైనాన్సింగ్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో జీరో డౌన్ పేమెంట్‌తో ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పించడంతోపాటు, నెలవారీ ఈఎంఐ భారాన్ని కూడా తగ్గించింది.
Technology | Published On Aug 5, 2026, 3.45 pm IST
Samsung | శాంసంగ్ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా, గెలాక్సీ జడ్ ఫోల్డ్8, గెలాక్సీ జడ్ ఫ్లిప్8 కోసం కొత్తగా 30 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఫైనాన్సింగ్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో జీరో డౌన్ పేమెంట్‌తో ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పించడంతోపాటు, నెలవారీ ఈఎంఐ భారాన్ని కూడా తగ్గించింది. గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్లను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయం ఉద్దేశ్యంగా శాంసంగ్ తెలిపింది. ఈ ఫైనాన్సింగ్ పథకం శాంసంగ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్ ఆధ్వర్యంలో, టీవీఎస్ క్రెడిట్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పూనావాలా ఫిన్‌కార్ప్ వంటి పలు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీల) ద్వారా అందుబాటులో ఉంటుంది.
తగ్గిన ఈఎంఐలు..
30 నెలల చెల్లింపు గడువు కారణంగా మూడు ఫోల్డబుల్ మోడళ్లపై నెలవారీ ఈఎంఐలు తగ్గాయి. ముఖ్యంగా గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రాపై గత తరం గెలాక్సీ జడ్ ఫోల్డ్7 ఫైనాన్సింగ్‌తో పోలిస్తే నెలవారీ ఈఎంఐ దాదాపు 9 శాతం తగ్గిందని కంపెనీ వెల్లడించింది. 256 జీబీ వేరియంట్‌లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రా ధర రూ.1,99,999 కాగా, 30 నెలల నో కాస్ట్ ఈఎంఐ కింద నెలకు సుమారు రూ.6,667 చెల్లించాల్సి ఉంటుంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్8 ధర రూ.1,79,999గా ఉండగా, నెలవారీ ఈఎంఐ రూ.6వేలుగా ఉంటుంది. గెలాక్సీ జడ్ ఫ్లిప్8 ధర రూ.1,24,999 కాగా, నెలకు రూ.4,167 ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌కు నిబంధనలు వర్తిస్తాయి. కొత్త గెలాక్సీ జడ్ సిరీస్‌లో ఏడో తరం ఫోల్డబుల్ టెక్నాలజీ ఆధారంగా హింజ్ డిజైన్, డిస్‌ప్లే మన్నిక, పనితీరు, అలాగే గెలాక్సీ ఏఐ ఫీచర్లలో పలు మెరుగుదలలు తీసుకువచ్చినట్లు శాంసంగ్ తెలిపింది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎలాగైనా సరే..
గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా ప్రారంభ ధర రూ.1,99,999 కాగా ఇది వైలెట్ షాడో, గ్రాఫైట్, క్రీమ్ రంగుల్లో లభిస్తోంది. గ్రీన్ షాడో రంగు ఆన్‌లైన్ ప్రత్యేక వేరియంట్‌గా అందుబాటులో ఉంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్8 ప్రారంభ ధర రూ.1,79,999 కాగా ఇది లావెండర్, గ్రాఫైట్, క్రీమ్ రంగులతో పాటు పిస్టాచియో ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ రంగులో లభిస్తోంది. గెలాక్సీ జడ్ ఫ్లిప్8 ప్రారంభ ధర రూ.1,24,999 కాగా ఇది పింక్, గ్రాఫైట్, క్రీమ్ రంగుల్లో అందుబాటులో ఉంది. మింట్ రంగు వేరియెంట్ ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తోంది. ఈ మూడు ఫోన్లకు ప్రస్తుతం భారత్ లో ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, శాంసంగ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు, ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. 30 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కొనుగోళ్లకు రెండింటికీ వర్తిస్తుంది.
తాజావార్తలు
- ●Harish Rao | పాలమూరుకు పట్టిన శని కాంగ్రెస్.. మళ్ళీ వలసలు రేవంత్ రెడ్డి వైఫల్యం
- ●EPFO | ఈపీఎఫ్ విత్‌డ్రా రూల్స్.. ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చంటే?
- ●Mahesh Kumar Goud | మహిళా కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం
- ●Kriti Shetty | బాలీవుడ్‌లోకి కృతిశెట్టి.. ప్రేమకథతో కొత్త ప్రయాణం!
- ●Harvard Community India | హార్వర్డ్ యూనివర్సిటీ పేరుతో రాజకీయ ప్రచారమా? భారత రాజ్యాంగ సంస్థలపై దాడి జరుగుతోంది
- ●Reliance Industries | జియో ఐపీఓపై భారీ అంచనాలు.. అయినా రిలయన్స్ షేర్ల పతనం ఎందుకు?

Harish Rao | పాలమూరుకు పట్టిన శని కాంగ్రెస్.. మళ్ళీ వలసలు రేవంత్ రెడ్డి వైఫల్యం

EPFO | ఈపీఎఫ్ విత్‌డ్రా రూల్స్.. ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చంటే?

Mahesh Kumar Goud | మహిళా కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం

Kriti Shetty | బాలీవుడ్‌లోకి కృతిశెట్టి.. ప్రేమకథతో కొత్త ప్రయాణం!






