Samsung Galaxy Z TriFold | సామ్‌సంగ్ తొలి ట్రై-ఫోల్డ్ ఫోన్ ‘గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్’ పరిచయం
సామ్‌సంగ్ తన తొలి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్’ను ఆవిష్కరించింది. 10 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, భారీ బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది.
Technology | Published On Dec 19, 2025, 7.13 pm IST
సంక్షిప్త సారాంశం
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరో ముందడుగుగా సామ్‌సంగ్ తన తొలి ట్రై-ఫోల్డ్ డివైస్ ‘గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మూడు ప్యానెల్‌లతో మడిచే ఈ డిజైన్ సన్నటి ఫోన్ సౌలభ్యంతో పాటు టాబ్లెట్ స్థాయి అనుభవాన్ని ఒకే పరికరంలో అందిస్తుంది. భారీ 10 అంగుళాల డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, ఏఐ ఆధారిత ఫీచర్లు, డెస్క్‌టాప్ తరహా మల్టీటాస్కింగ్‌తో ఈ ఫోన్ భవిష్యత్ మొబైల్ వినియోగానికి దిశానిర్దేశం చేయనుంది.
Samsung Introduces Galaxy Z TriFold, Its First Multi-Folding Smartphone
(త్రినేత్ర టెక్ డెస్క్)
సియోల్, డిసెంబర్ 19:
సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తన తొలి మల్టీ-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్’ను అధికారికంగా పరిచయం చేసింది. రెండు హింజ్‌లతో మూడు ప్యానెల్‌లుగా మడతపెట్టే ఈ ఫోన్‌ను పూర్తిగా విప్పితే 10 అంగుళాల పెద్ద తెర దర్శనమిస్తుంది. ఫోల్డబుల్ టెక్నాలజీలో సామ్‌సంగ్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే ఈ పరికరం, మొబైల్ ఏఐ యుగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది.
సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ డివైస్ ఎక్స్‌పీరియన్స్ (DX) డివిజన్ సీఈఓ, ప్రెసిడెంట్ టీ.ఎం. రోహ్ మాట్లాడుతూ, సామ్‌సంగ్ నిరంతర ఆవిష్కరణలు మొబైల్ అనుభవాల భవిష్యత్తును రూపొందిస్తున్నాయి. పోర్టబిలిటీ, ప్రీమియం పనితీరు, ఉత్పాదకత ఒకే ఉపకరణంలో కలగలిపి గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ మొబైల్ పరిశ్రమలోని దీర్ఘకాల సవాళ్లకు పరిష్కారం చూపుతోందని తెలిపారు.
మూడు మడతల డిజైన్తో కొత్త అనుభవం

ఫోల్డ్ చేసినప్పుడు సన్నని ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లా కనిపించే ఈ డివైస్, రెండుసార్లు ఓపెన్ చేస్తే పెద్ద స్క్రీన్‌తో ఉత్పాదకతను, సినిమా చూస్తున్న స్థాయికి తీసుకెళ్తుంది. దశాబ్దకాలంగా ఫోల్డబుల్ విభాగంలో సామ్‌సంగ్ సంపాదించిన అనుభవంతో రూపొందించిన ఈ ఫోన్, ఇన్‌వార్డ్ ఫోల్డింగ్(లోపలివైపు మడవడం) డిజైన్ ద్వారా మెయిన్ డిస్‌ప్లేకు మెరుగైన రక్షణ కల్పిస్తోంది.
ఇంజనీరింగ్ పరంగా కూడా గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ ప్రత్యేకత చూపిస్తోంది. కేవలం 3.9 మిల్లీమీటర్ల మందంతో రూపొందించిన ఈ ఫోన్‌లో గెలాక్సీకి ప్రత్యేకంగా తయారుచేసిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్‌ఫాం, 200 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే సామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్లలోనే అతిపెద్దదైన 5,600 mAh బ్యాటరీ అమర్చారు. మూడు ప్యానెల్‌లలో విభజించిన త్రీ-సెల్ బ్యాటరీ వ్యవస్థ సమతుల్య విద్యుత్తును అందిస్తుంది. 45వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రోజంతా వినియోగానికి అనుకూలంగా రూపొందించారు.
కొత్తగా అభివృద్ధి చేసిన ఆర్మర్ ఫ్లెక్స్ హింజ్, డ్యూయల్-రైల్ నిర్మాణంతో మృదువైన ఫోల్డింగ్ అనుభవాన్ని ఇస్తుంది. తప్పుగా మడతపెడితే ఆటో అలర్ట్‌లు, వైబ్రేషన్ ద్వారా యూజర్‌ను హెచ్చరించే భద్రతా వ్యవస్థను జోడించారు. టైటానియం హింజ్ హౌసింగ్, అడ్వాన్స్‌డ్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్, సిరామిక్-గ్లాస్ ఫైబర్ బ్యాక్ ప్యానెల్‌తో ఈ డివైస్ మన్నికను మరింత పెంచారు.
ఏఐ, భారీ డిస్ప్లేతో ఉత్పాదకతకు కొత్త నిర్వచనం

10 అంగుళాల మెయిన్ స్క్రీన్ వల్ల మల్టీటాస్కింగ్ మరింత సులభంగా మారింది. ఒకేసారి మూడు యాప్‌లను పక్కపక్కనే ఉంచుకుని వాడుకోవచ్చు. మొదటిసారిగా స్టాండ్‌అలోన్ సామ్‌సంగ్ డెక్స్ సపోర్ట్‌ను అందించడం మరో విశేషం. ఎక్స్‌టర్నల్ మానిటర్, బ్లూటూత్ మౌస్, కీబోర్డ్‌తో పూర్తి వర్క్‌స్టేషన్ అనుభవాన్ని ఈ ఫోన్ అందిస్తుంది.
గెలాక్సీ ఏఐ ఫీచర్లు—ఫోటో అసిస్ట్, స్కెచ్ టు ఇమేజ్—పెద్ద స్క్రీన్‌పై మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. జెమినీ లైవ్ మల్టీమోడల్ ఏఐ సహాయంతో రియల్‌టైమ్ సలహాలు పొందే అవకాశం ఉంది. వినోదానికి కూడా ఇది అనువైన డివైస్‌గా నిలుస్తోంది. యూట్యూబ్ వీడియోను, కామెంట్లను ఒకేసారి చూడవచ్చు.
దక్షిణ కొరియాలో డిసెంబర్ 12 నుంచి అమ్మకాలు ప్రారంభమైన గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్, త్వరలోనే చైనా, తైవాన్, సింగపూర్, యూఏఈ మార్కెట్లలో విడుదల కానుంది. అమెరికాలో 2026 తొలి త్రైమాసికంలో లాంచ్ చేసే అవకాశముంది. దీని ధర సుమారు 3.59 మిలియన్ వోన్ (భారత కరెన్సీలో సుమారు రూ. 2.2 లక్షలు). ఈ ఫోన్ క్రాఫ్టెడ్ బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. భారత్‌లో జెడ్ ట్రైఫోల్డ్ ప్రవేశం గురించి సామ్‌సంగ్ ఇంకా ఏం చెప్పలేదు కానీ, జూన్ 2026 నాటికి రావచ్చని అంచనా.

హువావే మేట్ ఎక్స్‌టీ ట్రైఫోల్డ్ తర్వాత ఈ విభాగంలోకి సామ్‌సంగ్ అడుగుపెట్టడంతో ఫోల్డబుల్ మార్కెట్‌లో పోటీ మరింత వేడెక్కనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అధిక ధరలు, ఉత్పత్తి సవాళ్ల కారణంగా ట్రై-ఫోల్డ్ ఫోన్లు ఇప్పట్లో సూపర్ ప్రీమియం విభాగంగానే కొనసాగవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి, గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ సామ్‌సంగ్ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపిస్తూ, భవిష్యత్ మొబైల్ అనుభవాలకు కొత్త దిశను సూచిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..
జులై 4, 2026

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..
జులై 3, 2026

Samsung Galaxy A27 5G | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ27 5జి ఫోన్.. ఏఐ ఫీచర్లు, పవర్ఫుల్ డిస్‌ప్లే..
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్‌డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్‌డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



