Samsung Galaxy A27 5G | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ27 5జి ఫోన్.. ఏఐ ఫీచర్లు, పవర్‌ఫుల్ డిస్‌ప్లే..
Samsung Galaxy A27 5G | టెక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎ27 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ శ్రేణిలో భాగంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో గత మోడల్స్‌తో పోలిస్తే మెరుగైన డిస్‌ప్లే, డిజైన్, ప్రాసెసర్ పనితీరు, అధునాతన ఏఐ ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలిపింది.
Technology | Published On Jun 30, 2026, 3.20 pm IST
Samsung Galaxy A27 5G | టెక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎ27 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ శ్రేణిలో భాగంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో గత మోడల్స్‌తో పోలిస్తే మెరుగైన డిస్‌ప్లే, డిజైన్, ప్రాసెసర్ పనితీరు, అధునాతన ఏఐ ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. దీని వల్ల డిస్‌ప్లేపై నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఇచ్చారు. 2 మెగా పిక్సల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. ముందు వైపు 12 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఆకట్టుకునే ఏఐ ఫీచర్లు..
ఈ ఫోన్‌లో ఆసమ్ ఇంటెలిజెన్స్ పేరిట ఏఐ ఫీచర్లను అందించారు. గతంలో శాంసంగ్ తన ప్రీమియం ఫోన్లలోనే ఈ ఫీచర్‌ను ఇవ్వగా, ఇప్పుడిది మిడ్ రేంజ్ ఫోన్ లలోనూ అందుబాటులోకి వచ్చింది. దీంతో పలు ఏఐ ఫీచర్లను మరింత సులభంగా ఉపయోగించుకోవచ్చు. సర్కిల్ టు సెర్చ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, స్టాక్ వాయిస్ రికార్డర్ వంటి ఫీచర్లను ఇచ్చారు. అలాగే థర్డ్ పార్టీ ఏఐ టూల్స్‌కు కూడా సపోర్ట్‌ను ఇచ్చారు. యూజర్లు గూగుల్ జెమిని, పెర్‌ప్లెక్సిటీ వంటి ఏఐ అసిస్టెంట్లను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 ఓఎస్‌ను ఇచ్చారు. దీనికి 6 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. సెక్యూరిటీ కోసం ఇందులో శాంసంగ్ నాక్స్, నాక్స్ వాల్ట్ వ్యవస్థలను ఇచ్చారు. ఇవి ఫోన్‌ను సైబర్ అటాక్‌ల నుంచి రక్షిస్తాయి.
ధర వివరాలు..
ఈ ఫోన్‌లో 6జీబీ, 8జీబీ ర్యామ్ , 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్-సీ, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎ27 5జి ఫోన్‌కు చెందిన 6జీబీ, 128జీబీ వేరియెంట్ ధర రూ.28,999 ఉండగా, 8జీబీ, 128జీబీ వేరియెంట్ ధర రూ.31,999గా ఉంది. 8జీబీ, 256జీబీ మోడల్ ధరను రూ.37,499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను లైట్ గ్రీన్, లైట్ పింక్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, పార్ట్‌నర్ రిటెయిల్ స్టోర్స్, శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫోన్‌ను జూలై 3 నుంచి విక్రయించనున్నారు.
లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు లేదా యూపీఐ చెల్లింపులపై రూ. 3వేల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు. అలాగే ఎంపిక చేసిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల ద్వారా 15 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్ సదుపాయం లభిస్తుంది. మరో ఆఫర్‌గా 24 నెలల ఈఎంఐ పథకంలో ఎనిమిది నెలల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేసే అవకాశం కూడా కల్పించారు.
సంబంధిత వార్తలు

Galaxy Z Fold 8 | గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ..
ఆగస్టు 14, 2026

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
ఆగస్టు 8, 2026

HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ

Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య



