e-visa Facility | ఈ-వీసా ఉంటే చాలు.. ఆ 171 దేశాల పౌరులు భారత్‌కి రావచ్చు
దేశాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం 53 ప్రాజెక్టులను చేపట్టామని, దాని కోసం స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్‌లో భాగంగా రూ.2,208.27 కోట్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
e-visa Facility | సాధారణంగా ఏదైనా దేశానికి వెళ్లాలంటే ఖచ్చితంగా ఏ దేశానికి వెళ్తున్నారో ఆ దేశానికి సంబంధించిన వీసాను ముందే తీసుకోవాలి. అలాగే, ఏ దేశం నుంచి వెళ్తున్నారో ఆ దేశపు పాస్ పోర్ట్ కూడా ఉండాలి. ఇవి ఉంటేనే వేరే దేశంలోకి అనుమతి ఉంటుంది. అయితే.. కొన్ని దేశాలు తమ దేశ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం టూరిస్టులకు వీసా లేకుండానే అనుమతిస్తుంటాయి. అలాగే కొన్ని దేశాలు ఈ-వీసా ఉంటే చాలు.. ఆ దేశాలకు అనుమతిస్తుంటాయి. అలాగే, మన భారత్ కూడా ఈ-వీసా ఉంటే చాలు, 171 దేశాలకు మన దేశంలోకి రావడానికి ఎంట్రీ ఇస్తోంది. యూఎస్, యూకే, సింగపూర్, జపాన్ లాంటి దేశాలకు వెళ్లాలంటే ముందే వీసా దరఖాస్తు చేసుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆయా దేశాల ఎంబసీ అధికారులను కలిసి వీసాను ముందే పొందాల్సి ఉంటుంది. కానీ.. ఈ-వీసాలో ఆ ప్రాసెస్ ఏం ఉండదు. కేవలం ఇండియన్ ఎంబసీకి సంబంధించిన వెబ్ సైట్‌లో ముందే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వివరాలు పొందుపరిచాక ఎంబసీ అధికారులు వెరిఫై చేసి ఈవీసాను అందిస్తారు. అలా ఈ-వీసాను పొంది 171 దేశాల పౌరులు మన భారత్‌కి వచ్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. అందులో 9 సబ్ కేటగిరీలు ఉంటాయి. 31 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో, 6 ముఖ్
టూరిజం అభివృద్ధి కోసం రూ.2208 కోట్ల కేటాయింపు
దేశాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం 53 ప్రాజెక్టులను చేపట్టామని, దాని కోసం స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్‌లో భాగంగా రూ.2,208.27 కోట్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చాలెంజ్ ఆధారిత డెస్టినేషన్ డెవలప్‌మెంట్(సీబీడీడీ) కింద 36 ప్రాజెక్టుల కోసం రూ.648.11 కోట్లను మంజూరు చేసింది.
ఈ స్కీమ్స్ కింద దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్ధి కోసం ఆ నిధులను ఆయా రాష్ట్రాలు వినియోగించనున్నాయి. అందుకే స్వదేశ్ దర్శన్ స్కీమ్‌ను మంత్రిత్వ శాఖ మార్పులు చేసి స్వదేశ్ దర్శన్ 2.0 ను తీసుకొచ్చిందని, దేశ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేసి ఆ ప్రాంతాలను టూరిజానికే ప్రాధాన్యత ఇచ్చేలా రూపకల్పన చేసినట్లు మంత్రి వెల్లడించారు.
భారత్‌లో టూరిజం అభివృద్ధి కోసం పర్యాటకాన్ని ప్రమోట్ చేయడం కోసైం రకరకాల కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈవెంట్స్ నిర్వహించడం, సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ రన్ చేయడం, ఇంక్రెడిబుల్ ఇండియా వెబ్ సైట్‌ని ఆధునికంగా తీర్చిదిద్దారు.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



