Google Quick Share | ఫోన్లను దగ్గరగా ఉంచితే చాలు, డేటా షేర్.. ఆండ్రాయిడ్‌లో క్విక్ షేర్ ఫీచర్‌కు అప్‌డేట్..
Google Quick Share | ఆండ్రాయిడ్ డివైస్‌జ్‌ల మధ్య వైర్‌లెస్ డేటా బదిలీని మరింత సులభతరం చేసేందుకు గూగుల్ క్విక్ షేర్ ఫీచర్‌ను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ట్యాప్ టు షేర్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. తొలుత ఎంపిక చేసిన గూగుల్ పిక్సల్ మోడళ్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ప్రాక్సిమిటీ ఆధారిత ఫీచర్‌తో రెండు సపోర్టెడ్ ఫోన్లను భౌతికంగా దగ్గరకు తీసుకురావడం ద్వారా కాంటాక్ట్ కార్డులు, మీడియా ఫైల్స్, లింకులు, లొకేషన్లను పరస్పరం షేర్ చేసుకోవచ్చు.
Technology | Published On Aug 14, 2026, 2.09 pm IST
Google Quick Share | ఆండ్రాయిడ్ డివైస్‌జ్‌ల మధ్య వైర్‌లెస్ డేటా బదిలీని మరింత సులభతరం చేసేందుకు గూగుల్ క్విక్ షేర్ ఫీచర్‌ను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ట్యాప్ టు షేర్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. తొలుత ఎంపిక చేసిన గూగుల్ పిక్సల్ మోడళ్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ప్రాక్సిమిటీ ఆధారిత ఫీచర్‌తో రెండు సపోర్టెడ్ ఫోన్లను భౌతికంగా దగ్గరకు తీసుకురావడం ద్వారా కాంటాక్ట్ కార్డులు, మీడియా ఫైల్స్, లింకులు, లొకేషన్లను పరస్పరం షేర్ చేసుకోవచ్చు. ట్యాప్ టు షేర్ సదుపాయం సపోర్ట్ చేసే, మేనేజ్ చేయని డివైస్‌లలో డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటుంది. వినియోగదారులు క్విక్ షేర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ట్యాప్ టు షేర్ ఆప్షన్‌ను టాగుల్ చేయడం ద్వారా తమ ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు లేదా ఈ ఫీచర్‌ను ఎప్పుడైనా డిసేబుల్ చేయవచ్చు.
ఎలా ఉపయోగించాలి..
ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే రెండు ఫోన్లు తప్పనిసరిగా అన్‌లాక్ అయి ఉండాలి. అలాగే అవి ఆండ్రాయిడ్ 17 లేదా అంతకంటే పైన వెర్షన్‌పై పనిచేయాలి. రెండు ఫోన్ల స్క్రీన్‌లు పైవైపు ఉండి, వినియోగదారులకు స్పష్టంగా కనిపించాలి. అంతేకాకుండా రెండు హ్యాండ్‌సెట్ల పైభాగాలు ఒకదానికొకటి ఓవర్లాప్ అయ్యేంత భౌతిక సమీపంలో ఉండాలి. కాంటాక్ట్ సమాచారాన్ని షేర్ చేసుకోవాలంటే ముందుగా రెండు ఫోన్లను అన్‌లాక్ చేసి హోమ్ స్క్రీన్‌లపై ఉంచాలి. అనంతరం రెండు ఫోన్ల పైభాగాలను దగ్గరకు తీసుకురావాలి. స్క్రీన్‌లపై గ్లో ఎఫెక్ట్ కనిపించే వరకు ఫోన్లను దగ్గరగా ఉంచితే రెండు వైపులా కాంటాక్ట్ సమాచారాన్ని మార్చుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తమ కాంటాక్ట్ కార్డులో ఏ వివరాలను షేర్ చేయాలనుకుంటున్నారో వినియోగదారులు ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే తమ కాంటాక్ట్ కార్డును పంపకుండా ఎదుటి వ్యక్తి కాంటాక్ట్ కార్డును మాత్రమే స్వీకరించే అవకాశమూ ఉంటుంది. అందిన వివరాలను నేరుగా కాంటాక్ట్స్ యాప్‌లో సేవ్ చేయాలా వద్దా అనే విషయాన్ని కూడా వినియోగదారులు నిర్ణయించుకోవచ్చు. షేరింగ్‌ను మధ్యలోనే రద్దు చేయాలనుకుంటే రెండు ఫోన్లను ఒకదానికొకటి దూరంగా తీసుకెళ్లడం ద్వారా ప్రక్రియను నిలిపివేయవచ్చు.
మీడియా ఫైల్స్ అయితే..
ఫొటోలు, వీడియోలు, ఫైల్స్, లింకులు, లొకేషన్లను షేర్ చేయడం కూడా ఆండ్రాయిడ్ స్టాండర్డ్ షేర్ షీట్‌తో నేరుగా అనుసంధానమై ఉంటుంది. ముందుగా షేర్ చేయాలనుకుంటున్న ఫైల్, ఫొటో, వీడియో, లింక్ లేదా లొకేషన్‌ను ఓపెన్ చేసి షేర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత రెండు అన్‌లాక్ చేసిన ఫోన్ల పైభాగాలను దగ్గరకు తీసుకురావాలి. స్క్రీన్‌లపై గ్లో ఎఫెక్ట్ కనిపించిన తర్వాత, స్వీకరించే ఫోన్‌లో వచ్చే డేటా ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్‌ను అంగీకరించే వరకు వేచి ఉండాలి. అంగీకరించిన వెంటనే ఎంపిక చేసిన కంటెంట్ వైర్‌లెస్‌గా బదిలీ అవుతుంది. ప్రస్తుతం ట్యాప్ టు షేర్ ఫీచర్ ఆండ్రాయిడ్ 17 లేదా అంతకన్నా పైన వెర్షన్‌తో పనిచేస్తున్న పిక్సల్ 6, ఆ తర్వాతి మోడళ్లకు అందుబాటులోకి వస్తోంది. రాబోయే నెలల్లో మరిన్ని డివైస్‌లకు ఈ సదుపాయాన్ని విస్తరించాలని గూగుల్ భావిస్తోంది.
త్వరలో అన్ని డివైస్‌లకు..
త్వరలో శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా, జడ్ ఫోల్డ్8, జడ్ ఫ్లిప్8 మోడళ్లకు కూడా ట్యాప్ టు షేర్ సపోర్ట్ అందించనుంది. ఈ ఏడాది చివరి నాటికి అర్హత కలిగిన ఆండ్రాయిడ్ 17 లేదా అంతకన్నా పైన వెర్షన్ డివైస్‌లలో మరింత విస్తృతంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే ఆండ్రాయిడ్ వర్క్ ప్రొఫైల్‌లో పనిచేసే యాప్‌లకు, అలాగే ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్ కింద ఉన్న అకౌంట్లకు ట్యాప్ టు షేర్ ఫీచర్ డిఫాల్ట్‌గా డిసేబుల్ అయి ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
Google Pixel 11 | గూగుల్ పిక్సల్ 11 సిరీస్ వచ్చేసింది.. అదిరిపోయిన ఫీచర్లు..
ఆగస్టు 13, 2026

Samsung | శాంసంగ్ బంపర్ ఆఫర్.. ఫోల్డబుల్ ఫోన్లపై 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ.. జీరో డౌన్ పేమెంట్‌తో..
ఆగస్టు 5, 2026

Samsung | శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు భారీ డిమాండ్.. 72 గంటల్లోనే 2.71 లక్షల ప్రీ ఆర్డర్లు..
జులై 30, 2026
తాజావార్తలు
- ●Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బయటివారి పెత్తనం ఎక్కువైంది
- ●Crow | వీడేం మనిషిరా బాబూ.. మద్యం మత్తులో కాకిని తినేందుకు యత్నం..
- ●Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు
- ●Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజరైతే చూస్తూ ఊరుకోం
- ●RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..
- ●Traffic Restrictions | మరికాసేపట్లో నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు

Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బయటివారి పెత్తనం ఎక్కువైంది

Crow | వీడేం మనిషిరా బాబూ.. మద్యం మత్తులో కాకిని తినేందుకు యత్నం..

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు

Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజరైతే చూస్తూ ఊరుకోం



