Samsung Galaxy M17e 5G | చవక ధరకే మరో నూతన 5జి స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్
Samsung Galaxy M17e 5G | ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎం17ఇ 5జి ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా, ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.
Technology | Published On Mar 17, 2026, 11.56 am IST
Samsung Galaxy M17e 5G | ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎం17ఇ 5జి ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా, ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. కనుక డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ8 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌కు చెందిన లైవ్ ఫీచర్లు లభిస్తాయి. ఈ ఫోన్‌కు గాను 6 ఏళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ కేవలం 8.2ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. వెనుక వైపు గ్లాస్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ పాలిమర్ బ్యాక్ ప్యానెల్ ఉంది. కనుక గ్రిప్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌కు ఐపీ54 బేసిక్ డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇస్తున్నారు. కనుక ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
2టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు..
4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. యూఎస్‌బీ టైప్ సి ఆడియోను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. కింది వైపు లౌడ్ స్పీకర్లను ఇచ్చారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ సదుపాయాలను ఇచ్చారు.
ధర వివరాలు..
శాంసంగ్ గెలాక్సీ ఎం17ఇ 5జి ఫోన్‌ను వైబ్ వయొలెట్, బ్లిట్జ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఎంపిక చేసిన రిటెయిల్ స్టోర్స్‌లో మంగళవారం నుంచే విక్రయిస్తున్నారు. ఈ ఫోన్‌పై పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో రూ.1250 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



