Delhi EV Policy | ఢిల్లీ ఈవీ పాలసీ ఎఫెక్ట్.. ఓలా, ఏథర్ షేర్లలో భారీగా కొనుగోళ్లు..
Delhi EV Policy | ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి రాష్ట్ర కేబినెట్ రూ.15వేల కోట్ల భారీ పెట్టుబడితో కొత్త ఈవీ పాలసీ 2.0కి ఆమోదం తెలపడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, అథర్ ఎనర్జీ షేర్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి.
Automobiles | Published On Jun 30, 2026, 5.13 pm IST
Delhi EV Policy | ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి రాష్ట్ర కేబినెట్ రూ.15వేల కోట్ల భారీ పెట్టుబడితో కొత్త ఈవీ పాలసీ 2.0కి ఆమోదం తెలపడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, అథర్ ఎనర్జీ షేర్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. ఏథర్ ఎనర్జీ షేరు 5 శాతానికి పైగా ఎగబాకగా, ఓలా ఎలక్ట్రిక్ షేరు 11 శాతం వరకు పెరిగింది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీలో భాగంగా తొలి ఏడాదిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుపై గరిష్ఠంగా రూ.30వేల వరకు ప్రోత్సాహకం అందించనుంది. ఇప్పటికే అమల్లో ఉన్న రోడ్ ట్యాక్స్ మినహాయింపు కూడా కొనసాగుతుంది. అలాగే కొత్త పెట్రోల్, సీఎన్‌జీ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌ను దశలవారీగా నిలిపివేస్తూ, 2028 ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకే కొత్త రిజిస్ట్రేషన్లను అనుమతించనుంది.
95 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే లక్ష్యంగా..
జూలై 1 నుంచి అమల్లోకి రానున్న ఈవీ పాలసీ 2.0 ద్వారా 2027 నాటికి ఢిల్లీలో కొత్తగా నమోదయ్యే వాహనాల్లో 95 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఈ పాలసీ ద్వారా ఈవీలను మరింత అందుబాటు ధరల్లో అందించడంతోపాటు కీలక విభాగాల్లో శిలాజ ఇంధన వాహనాలను దశలవారీగా తగ్గించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్థిక ప్రోత్సాహకాలు, నియంత్రణ చర్యలను సమన్వయం చేస్తూ వ్యక్తిగత వినియోగదారులు, వాణిజ్య వాహనాల నిర్వాహకులు సులభంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు రేఖా గుప్తా వెల్లడించారు. ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ భారత్‌లో నగర స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్‌కు ఇది అత్యంత కీలకమైన విధానాల్లో ఒకటని పేర్కొన్నారు. భారీ పెట్టుబడులతోపాటు ప్రోత్సాహకాలు, దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల అమలు, ఛార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు ఈ పాలసీని మరింత బలంగా మార్చుతున్నాయని అన్నారు. ఢిల్లీ ఎలక్ట్రిక్ వాహనాల్లో మెజారిటీ నగరంగా మారితే దేశానికి ఆదర్శంగా నిలిచే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
భారీగా పెరిగిన షేర్లు..
ఏథర్ ఎనర్జీ షేరు ధర మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతానికి పైగా పెరిగి రూ.1,142.50 వద్ద కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. గత వారం రోజుల్లో ఈ షేరు 13 శాతానికి పైగా, నెల రోజుల్లో 18 శాతం, 2026లో ఇప్పటివరకు 54 శాతానికి పైగా పెరిగింది. గత మూడు సంవత్సరాల్లో ఈ షేరు 243 శాతం రాబడిని అందించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.43,446 కోట్లుగా ఉంది. అలాగే ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు 11 శాతానికి పైగా ఎగసి రూ.44.95 వద్ద ట్రేడయ్యాయి. గత వారం రోజుల్లో 2 శాతం, నెల రోజుల్లో 7 శాతం పెరిగిన ఈ షేరు, 2026లో ఇప్పటివరకు 18 శాతం లాభపడగా, ఏడాది కాలంలో 3 శాతం పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,481 కోట్లుగా ఉంది.
సంబంధిత వార్తలు

Hero MotoCorp | ఏథర్‌లో హీరో మోటోకార్ప్ వాటా పెంపు.. రూ.1,758 కోట్ల పెట్టుబడి..
ఆగస్టు 28, 2026

Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..
ఆగస్టు 28, 2026

PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ..?
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●IMS | ముగింపు దశకు ఇందిరా మహిళా శక్తి భవనాలు.. త్వరలోనే ప్రారంభించనున్న సీఎం
- ●HYDRAA | హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధి భేష్.. హైడ్రా పనితీరుపై బీహార్ సిటీ మేనేజర్లు ప్రశంసలు
- ●Hero MotoCorp | ఏథర్‌లో హీరో మోటోకార్ప్ వాటా పెంపు.. రూ.1,758 కోట్ల పెట్టుబడి..
- ●Hyderabad Voter List 2026 | హైదరాబాద్ ఓటర్ల జాబితాలో భారీ స్కామ్? డూప్లికేట్ ఓట్లను బట్టబయలు చేసిన కాంగ్రెస్
- ●Deepika Padukone | ఆ హీరో కంటే నా సక్సెస్ రేటు ఎక్కువ - స్పిరిట్ వివాదం వేళ దీపికా పడుకోణ్ కామెంట్స్ వైరల్
- ●Lava Bold N4 Lite | భారీ బ్యాటరీతో లావా మొబైల్స్ కొత్త ఫోన్.. ధర రూ.7,999 మాత్రమే..

IMS | ముగింపు దశకు ఇందిరా మహిళా శక్తి భవనాలు.. త్వరలోనే ప్రారంభించనున్న సీఎం

HYDRAA | హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధి భేష్.. హైడ్రా పనితీరుపై బీహార్ సిటీ మేనేజర్లు ప్రశంసలు

Hero MotoCorp | ఏథర్‌లో హీరో మోటోకార్ప్ వాటా పెంపు.. రూ.1,758 కోట్ల పెట్టుబడి..

Hyderabad Voter List 2026 | హైదరాబాద్ ఓటర్ల జాబితాలో భారీ స్కామ్? డూప్లికేట్ ఓట్లను బట్టబయలు చేసిన కాంగ్రెస్



