REDMI Turbo 5 | భారీ బ్యాటరీతో రెడ్‌మీ టర్బో 5 ఎంట్రీ.. పవర్‌ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన డిస్‌ప్లే..
REDMI Turbo 5 | షియోమీ భారత మార్కెట్‌లో తన టర్బో సిరీస్‌లో తాజా స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ టర్బో 5 ని అధికారికంగా విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ ఫోన్ శక్తివంతమైన హార్డ్‌వేర్, భారీ బ్యాటరీ, ప్రీమియం డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 ఇంచుల 1.5కె 120హెడ్జ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు.
Technology | Published On Jun 16, 2026, 2.48 pm IST
REDMI Turbo 5 | షియోమీ భారత మార్కెట్‌లో తన టర్బో సిరీస్‌లో తాజా స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ టర్బో 5 ని అధికారికంగా విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ ఫోన్ శక్తివంతమైన హార్డ్‌వేర్, భారీ బ్యాటరీ, ప్రీమియం డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 ఇంచుల 1.5కె 120హెడ్జ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఎం10 ల్యూమినెసెంట్ మెటీరియల్‌ను ఉపయోగించిన ఈ స్క్రీన్ గరిష్టంగా 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, దేశంలో మొదటిసారిగా డైమెన్సిటీ 8500-అల్ట్రా ప్రాసెసర్‌తో వచ్చిన ఫోన్ ఇదే కావడం విశేషం. దీనికి అల్ట్రా ర్యామ్, యూఎఫ్‌ఎస్ 4.1 స్టోరేజ్ ఇచ్చారు. అధిక పనితీరు సమయంలో ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు వీసీ కూలింగ్ సిస్టమ్‌తో కూడిన 3డీ ఐస్-లూప్ కూలింగ్ వ్యవస్థను అమర్చారు. అలాగే వైల్డ్‌బూస్ట్ ఆప్టిమైజేషన్ ఫీచర్ కూడా ఉంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3తో పనిచేస్తుంది. దీనికి 4 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. రెడ్‌మీ టర్బో 5 మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. పెద్ద రౌండెడ్ కార్నర్లు, సన్నని బెజెల్స్, మెరుగైన వెయిట్ బ్యాలెన్స్‌తో చేతిలో సౌకర్యవంతమైన అనుభూతిని అందించేలా రూపొందించారు. ఈ ఫోన్‌కు ఐపీ66, 68, 69, 69కె డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఇచ్చారు. వెనుక కెమెరాల చుట్టూ డైనమిక్ ఆర్జీబీ ఎల్ఈడీలు ఉండగా, వీటిని కంపెనీ రెడ్‌మీ పిక్సెల్ మ్యాట్రిక్స్ గా పిలుస్తోంది. బ్యాటరీ విభాగంలో 7560ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఇది 100వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా 27వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే 100వాట్ పీపీఎస్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్‌కు సపోర్ట్ ఇచ్చారు.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే..
ఈ ఫోన్ డిస్‌ప్లేకు డాల్బీ విజన్ సపోర్ట్ ఇచ్చారు. గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ కూడా ఉంది. 8జీబీ, 12జీబీ ర్యామ్ ఆప్షన్‌లను ఇచ్చారు. 256 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 5జీ, డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ సదుపాయాలను ఇచ్చారు.
ధర ఎంతంటే..
రెడ్‌మీ టర్బో 5 ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, టర్బో వైట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 40,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 19 నుంచి అమెజాన్ ఇండియా, ఎంఐ ఆన్ లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభ్యం కానుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా వినియోగదారులు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ. 2వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, 60 శాతం వరకు అషూర్డ్ బైబ్యాక్ విలువ వంటి ఆఫర్లను అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..
ఆగస్టు 7, 2026

Redmi Note 17 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17.. భారత్‌లో లాంచ్..
ఆగస్టు 6, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత
- ●EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..
- ●Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనులశాఖ అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాలు
- ●Harish Rao | ‘మిషన్ భగీరథ’ అనేది పథకం కాదు.. ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళిక
- ●Avengers | ఒక్క సినిమా 830 కోట్ల రెమ్యూనరేషన్ - అవెంజర్స్ డూమ్స్డేతో ఐరన్ మ్యాన్ రికార్డ్
- ●KJQ Movie Review | K J Q ప్రేక్షకులను మెప్పించిందా..? అసలు కథేంటో తెలుసా..?

Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత

EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..

Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనులశాఖ అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాలు

Harish Rao | ‘మిషన్ భగీరథ’ అనేది పథకం కాదు.. ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళిక



