Sai Pallavi | సాయిపల్లవినా .. మజాకా – షూటింగ్ మొదలుకాకముందే నెక్స్ట్ మూవీ బిజినెస్ క్లోజ్
తండేల్ తర్వాత దక్షిణాది సినిమాలకురెండేళ్లు గ్యాప్ తీసుకుంది సాయిపల్లవి. ఇటీవలే మణిరత్నంతో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది నాచురల్ బ్యూటీ. షూటింగ్ మొదలుకాకముందే ఈ సినిమా ఓటీటీ, థియేట్రికల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయట.
Entertainment | Published On Jun 30, 2026, 5.13 pm IST
Sai Pallavi | దక్షిణాదిలో హయ్యెస్ట్ సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్‌గా కొనసాగుతోంది సాయిపల్లవి. పదకొండేళ్ల ప్రయాణంలో పదహారు సినిమాలు చేయగా...అందులో రెండు, మూడు మినహా మిగిలినవన్నీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.తమిళం, మలయాళంతో పాటు తెలుగు భాషల్లో సాయిపల్లవికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తండేల్ తర్వాత దక్షిణాది సినిమాలకు రెండేళ్లు గ్యాప్ ఇచ్చింది సాయిపల్లవి. ఇటీవలే దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియన్ మూవీని ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
నెట్‌ఫ్లిక్స్...
జూలై నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి రాబోతుంది. కాగా షూటింగ్ మొదలుకాకముందే ఈ సినిమా ఓటీటీ, థియేట్రికల్ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. మణిరత్నం మూవీ డిజిటల్ రైట్స్‌ను 20 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. సాయిపల్లవితో పాటు మణిరత్నానికి దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రికార్డ్ ధరకు ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు చెబుతోన్నారు. ఆడియో రైట్స్ 15 కోట్లు, ఓవర్‌సీస్ థియేట్రికల్ హక్కులు ఎనిమిది కోట్లకు అమ్ముడుపోయాయట. సెట్స్‌లోకి అడుగుపెట్టకముందే ఈ సినిమా ద్వారా నిర్మాతలకు 43 కోట్ల వరకు గిట్టుబాటు అయ్యిందట.
పదేళ్లు దాటింది....
సాయిపల్లవి, మణిరత్నం, విజయ్ సేతుపతి కాంబోకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనమిదని నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. విలక్షణ దర్శకుడు మణిరత్నం హిట్టు అందుకొని పదేళ్లు దాటిపోయింది. 2015లో వచ్చిన ఓ కాదల్ కణ్మణి (తెలుగులో ఒకే బంగారం) తర్వాత మణిరత్నం చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. గత సినిమా థగ్ లైఫ్ మణిరత్నం కెరీర్‌లోనే వరస్ట్ మూవీ అంటూ విమర్శలు వచ్చాయి. ఈ ట్రోల్స్‌కు విజయ్ సేతుపతి, సాయిపల్లవి మూవీతో మణిరత్నం బదులివ్వడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతోన్నారు. యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.
ఎక్‌దిన్‌తో...
ఇటీవలే ఎక్‌దిన్ మూవీతో సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం హిందీలో రామాయణ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో సీతగా కనిపించబోతుంది. రణభీర్‌కపూర్ రాముడిగా నటిస్తోన్న ఈ సినిమాలో యశ్ రావణాసురుడి పాత్ర చేస్తోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rakul Preet Singh | ఓటీటీలోకి రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ – ముగ్గురు ప్రియురాళ్ల మధ్య నలిగిపోయే ప్రియుడి కథ
జూన్ 30, 2026

Ntr | మురుగన్ తమిళ దేవుడు – పురాణాలను వక్రీకరించొద్దు – ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై తమిళ తంబీల ఫైర్
జూన్ 30, 2026

Sudha Kongara | రెమ్యూనరేషన్ కోసం కోర్టులో కేసు వేసిన తమిళ డైరెక్టర్ – వివాదంలో శ్రీలీల సినిమా
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●Tripti Dimri | డిజాస్టర్ల ఎఫెక్ట్ - బాలీవుడ్‌కు బ్రేక్ ఇవ్వనున్న త్రిప్తి డిమ్రి - ఫోకస్ మొత్తం సౌత్‌పైనే!
- ●Harish Rao | ఒట్టు అనేదానికి పాణముంటే నీ అబద్దాలు వినలేక చచ్చేది
- ●Minister Vivek | రూ. కోటి పరిహారం అందే వరకు సిగాచీ కంపెనీని వదిలిపెట్టం : మంత్రి వివేక్
- ●Siya Goyal - Ketan Agarwal Case | సియా పెళ్లికి ఎందుకు 'నో' చెప్పలేకపోయింది? పుణె మర్డర్ కేసుపై చేతన్ భగత్ సంచలన విశ్లేషణ
- ●Tree Falls On School Bus | స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. 10 ఏళ్ల చిన్నారి మృతి.. పలువురికి గాయాలు
- ●Delhi EV Policy | ఢిల్లీ ఈవీ పాలసీ ఎఫెక్ట్.. ఓలా, ఏథర్ షేర్లలో భారీగా కొనుగోళ్లు..

Tripti Dimri | డిజాస్టర్ల ఎఫెక్ట్ - బాలీవుడ్‌కు బ్రేక్ ఇవ్వనున్న త్రిప్తి డిమ్రి - ఫోకస్ మొత్తం సౌత్‌పైనే!

Harish Rao | ఒట్టు అనేదానికి పాణముంటే నీ అబద్దాలు వినలేక చచ్చేది

Minister Vivek | రూ. కోటి పరిహారం అందే వరకు సిగాచీ కంపెనీని వదిలిపెట్టం : మంత్రి వివేక్

Siya Goyal - Ketan Agarwal Case | సియా పెళ్లికి ఎందుకు 'నో' చెప్పలేకపోయింది? పుణె మర్డర్ కేసుపై చేతన్ భగత్ సంచలన విశ్లేషణ



