Tree Falls On School Bus | స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. 10 ఏళ్ల చిన్నారి మృతి.. పలువురికి గాయాలు
Tree Falls On School Bus | ముంబైలో (Mumbai) ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సుపై భారీ వృక్షం కూలిపోయింది (Tree Falls On School Bus). ఈ ఘటనలో 10 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోగా (Student dies).. పది మంది గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Tree Falls On School Bus | రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశ ఆర్థిక రాజధాని ముంబైని (Mumbai) భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. తాజాగా ముంబైలో ఓ పాఠశాల బస్సుపై భారీ వృక్షం కూలిపడింది (Tree Falls On School Bus). ఈ ఘటనలో ఓ విద్యార్థి మరణించగా (Student dies).. 10 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు.
మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిలక్ నగర్‌లోని యూనివర్సల్ స్కూల్‌కు చెందిన బస్సుపై చెట్టు కూలిపోయింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 18 మంది పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో 10 ఏళ్ల విద్యార్థి మృతి చెందగా.. 10 మందికిపైగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకుపోయిన చిన్నారులను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

Deficit Rainfall | 16 జిల్లాల్లో లోటు వర్షపాతం.. హైదరాబాద్‌లో మాత్రం సాధారణం
జూన్ 30, 2026

Prostitution Racket Busted | ముంబయిలో హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇద్దరు హీరోయిన్లను కాపాడిన పోలీసులు
జూన్ 29, 2026

Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Minor Liver Donation | తండ్రి కోసం కొడుకు ప్రాణదాత: 17 ఏళ్ల మైనర్ లివర్ దానానికి ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ●Rajnath Singh | సింధూర్‌లో సైనికులెవరూ అమరులు కాలేదంటూ ప్రకటన.. రాజ్‌నాథ్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
- ●Tripti Dimri | డిజాస్టర్ల ఎఫెక్ట్ - బాలీవుడ్‌కు బ్రేక్ ఇవ్వనున్న త్రిప్తి డిమ్రి - ఫోకస్ మొత్తం సౌత్‌పైనే!
- ●Harish Rao | ఒట్టు అనేదానికి పాణముంటే నీ అబద్దాలు వినలేక చచ్చేది
- ●Minister Vivek | రూ. కోటి పరిహారం అందే వరకు సిగాచీ కంపెనీని వదిలిపెట్టం : మంత్రి వివేక్
- ●Siya Goyal - Ketan Agarwal Case | సియా పెళ్లికి ఎందుకు 'నో' చెప్పలేకపోయింది? పుణె మర్డర్ కేసుపై చేతన్ భగత్ సంచలన విశ్లేషణ

Minor Liver Donation | తండ్రి కోసం కొడుకు ప్రాణదాత: 17 ఏళ్ల మైనర్ లివర్ దానానికి ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Rajnath Singh | సింధూర్‌లో సైనికులెవరూ అమరులు కాలేదంటూ ప్రకటన.. రాజ్‌నాథ్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

Tripti Dimri | డిజాస్టర్ల ఎఫెక్ట్ - బాలీవుడ్‌కు బ్రేక్ ఇవ్వనున్న త్రిప్తి డిమ్రి - ఫోకస్ మొత్తం సౌత్‌పైనే!

Harish Rao | ఒట్టు అనేదానికి పాణముంటే నీ అబద్దాలు వినలేక చచ్చేది



