Samsung | శాంసంగ్ ఫోన్లలో ఎట్టకేలకు ఈ ఫీచర్.. స్టేటస్ బార్‌లోనే ఇంటర్నెట్ స్పీడ్ కనిపిస్తుంది..
Samsung | గత కొన్నేళ్లుగా ఐక్యూ, వివో, షావోమీ వంటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు స్టేటస్ బార్‌లో రియల్‌టైమ్ ఇంటర్నెట్ స్పీడ్‌ను చూపించే బిల్ట్-ఇన్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఇదే ఫీచర్‌ను శామ్‌సంగ్ గెలాక్సీ వినియోగదారులు కూడా చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పటివరకు థర్డ్-పార్టీ యాప్‌లు లేదా రూటింగ్ వంటి అధునాతన మార్పుల ద్వారా మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందగలిగేవారు.
Technology | Published On Jun 13, 2026, 4.01 pm IST
Samsung | గత కొన్నేళ్లుగా ఐక్యూ, వివో, షావోమీ వంటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు స్టేటస్ బార్‌లో రియల్‌టైమ్ ఇంటర్నెట్ స్పీడ్‌ను చూపించే బిల్ట్-ఇన్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఇదే ఫీచర్‌ను శామ్‌సంగ్ గెలాక్సీ వినియోగదారులు కూడా చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పటివరకు థర్డ్-పార్టీ యాప్‌లు లేదా రూటింగ్ వంటి అధునాతన మార్పుల ద్వారా మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందగలిగేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. శామ్‌సంగ్ గుడ్ లాక్ కస్టమైజేషన్ సూట్‌లో భాగమైన క్విక్‌స్టార్ మాడ్యూల్ తాజా వెర్షన్‌తో గెలాక్సీ వినియోగదారులు స్టేటస్ బార్‌లోనే లైవ్ అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్‌లను ప్రత్యక్షంగా చూడవచ్చు. కొత్త నెట్‌వర్క్ స్పీడ్ ఇండికేటర్ ప్రస్తుతం క్విక్‌స్టార్ ద్వారా అందుబాటులో ఉంది. ఇది ఇంకా వన్ యూఐ సెట్టింగ్స్‌లో నేరుగా ఇంటిగ్రేట్ కాలేదు. ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత స్టేటస్ బార్ కుడి వైపున రియల్‌టైమ్ ఇంటర్నెట్ స్పీడ్ కనిపిస్తుంది. డేటా అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాలను కిలోబైట్స్ పర్ సెకండ్ లేదా మెగాబైట్స్ పర్ సెకండ్ రూపంలో చూపిస్తుంది.
ఏయే ఫోన్లలో..
శామ్‌సంగ్ తెలిపిన ప్రకారం, ఈ ఫీచర్ వై-ఫై, మొబైల్ డేటా కనెక్షన్లు రెండింటితోనూ పనిచేస్తుంది. డౌన్‌లోడ్‌లు నెమ్మదిగా సాగడం, వీడియోలు బఫరింగ్ అవడం లేదా యాప్ అప్‌డేట్లు ఆలస్యం కావడం వంటి సమస్యలకు నెట్‌వర్క్ కారణమా కాదా అన్నది గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ ఇండికేటర్ కేవలం డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్‌ను మాత్రమే చూపిస్తుంది. నెట్‌వర్క్ సిగ్నల్ బలం వివరాలను మాత్రం చూపించదు. వాటిని ఇప్పటిలాగే వై-ఫై, మొబైల్ నెట్‌వర్క్ ఐకాన్‌లు సూచిస్తాయి. ఈ నెట్‌వర్క్ స్పీడ్ ఇండికేటర్‌ను ఉపయోగించాలంటే గెలాక్సీ ఫోన్‌లో వన్ యూఐ 9 ఉండాలి. ప్రస్తుతం ఇది గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్25 సిరీస్‌లకు బీటా దశలో అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివర్లో మరిన్ని గెలాక్సీ డివైస్‌లకు వన్ యూఐ 9 ని విస్తరించనున్నట్లు శామ్‌సంగ్ తెలిపింది. అలాగే క్విక్‌స్టార్ మాడ్యూల్ వెర్షన్ 11.0.03.15 లేదా అంతకంటే కొత్త వెర్షన్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.
ఎలా చేయాలి..
శాంసంగ్ ఫోన్‌లలో ఈ టూల్‌ను ఇలా ఇన్‌స్టాల్ చేయవచ్చు. ముందుగా గెలాక్సీ స్టోర్ ఓపెన్ చేసి గుడ్ లాక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. గుడ్ లాక్ యాప్‌ను ఓపెన్ చేసి ప్లగిన్స్ సెక్షన్‌కు వెళ్లండి. క్విక్‌స్టార్ మాడ్యూల్ తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి, వెర్షన్ 11.0.03.15 లేదా అంతకంటే కొత్తదిగా ఉందో నిర్ధారించుకోండి. గుడ్ లాక్ యాప్‌లోని క్విక్‌స్టార్‌ను ఓపెన్ చేసి ప్రధాన టాగుల్‌ను ఆన్ చేయండి. తర్వాత విజిబిలిటీ ఆఫ్ ఇండికేటర్ ఐకాన్స్ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. అక్కడ నెట్‌వర్క్ స్పీడ్ ఆప్షన్‌ను గుర్తించి టాగుల్‌ను ఎనేబుల్ చేయండి. అంతే, స్టేటస్ బార్‌లో నెట్‌వర్క్ స్పీడ్ ఇండికేటర్ కనిపించడం ప్రారంభమవుతుంది. ఫీచర్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుతున్న కొద్దీ రియల్‌టైమ్ స్పీడ్ కనిపిస్తుంది. అవసరం లేకపోతే ఇదే విధానాన్ని అనుసరించి ఎప్పుడైనా ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయవచ్చు.
సంబంధిత వార్తలు

Galaxy Z Fold 8 | గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ..
ఆగస్టు 14, 2026

Samsung | శాంసంగ్ బంపర్ ఆఫర్.. ఫోల్డబుల్ ఫోన్లపై 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ.. జీరో డౌన్ పేమెంట్‌తో..
ఆగస్టు 5, 2026

Samsung Galaxy F70 Pro 5G | తక్కువ ధరకే శాంసంగ్ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 6 ఏళ్ల వరకు అప్డేట్స్..
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..
- ●ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
- ●Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది
- ●Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు
- ●Tamannaah | హీరోతో గొడవలు - సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు - చిక్కుల్లో తమన్నా బాలీవుడ్ మూవీ?
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?

Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది

Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు



