త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Browser | విండోస్ పీసీల కోసం ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ను లాంచ్ చేసిన శాంసంగ్‌.. ఫీచ‌ర్లు అదిరాయ్‌..!

Samsung Browser | ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ త‌న స్మార్ట్ ఫోన్ల‌లో డిఫాల్ట్ గా అందిస్తున్న ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ను ఇప్పుడు పీసీల‌కు కూడా అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ బ్రౌజ‌ర్ ఫ‌ర్ విండోస్‌ను ఆ సంస్థ విడుద‌ల చేసింది. ఈ బ్రౌజ‌ర్ స్మార్ట్ ఫోన్ల‌తోపాటు కంప్యూట‌ర్ల‌పై కూడా మెరుగైన అనుభ‌వాన్ని ఇస్తుంద‌ని శాంసంగ్ తెలిపింది.

S

Technology | Published On Mar 31, 2026, 5.23 pm IST

Samsung Browser | విండోస్ పీసీల కోసం ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ను లాంచ్ చేసిన శాంసంగ్‌.. ఫీచ‌ర్లు అదిరాయ్‌..!
Advertisement

Samsung Browser | ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ త‌న స్మార్ట్ ఫోన్ల‌లో డిఫాల్ట్ గా అందిస్తున్న ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ను ఇప్పుడు పీసీల‌కు కూడా అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ బ్రౌజ‌ర్ ఫ‌ర్ విండోస్‌ను ఆ సంస్థ విడుద‌ల చేసింది. ఈ బ్రౌజ‌ర్ స్మార్ట్ ఫోన్ల‌తోపాటు కంప్యూట‌ర్ల‌పై కూడా మెరుగైన అనుభ‌వాన్ని ఇస్తుంద‌ని శాంసంగ్ తెలిపింది. ఒక యూజ‌ర్ ఒక అకౌంట్ ద్వారా ఈ బ్రౌజ‌ర్‌లో ఫోన్‌లో, విండోస్ పీసీలో లాగిన్ అయితే రెండు డివైస్‌ల మ‌ధ్య బ్రౌజ‌ర్ సింక్ అవుతుంద‌ని, ఒక డివైస్‌లో ఆ బ్రౌజ‌ర్‌లో చేసే వ‌ర్క్ రెండో డివైస్‌లోనూ క‌నిపిస్తుంద‌ని తెలిపింది. మొబైల్‌, కంప్యూట‌ర్ ల మ‌ధ్య నిరంత‌ర బ్రౌజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకే ఈ బ్రౌజ‌ర్‌ను ఇలా అందిస్తున్న‌ట్లు శాంసంగ్ వివ‌రించింది. ఈ బ్రౌజ‌ర్‌లో కొత్త ఏజెంటిక్ ఏఐ ఫీచ‌ర్ల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తెలియజేసింది.

వివిధ డివైస్‌ల మ‌ధ్య సింక్‌, కంటిన్యుటీ..

విండోస్ ప్లాట్‌ఫామ్‌పై ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్ ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్ ద్వారా వినియోగ‌దారులు మొబైల్ నుంచి పీసీకి లేదా పీసీ నుంచి మొబైల్‌కు మారినా అదే బ్రౌజింగ్ సెష‌న్ కొన‌సాగుతుంది. రెండు డివైస్‌ల మ‌ధ్య ఎల్ల‌ప్పుడూ సింక్ జ‌రుగుతుంద‌న్న‌మాట‌. బుక్ మార్క్‌లు, బ్రౌజింగ్ హిస్ట‌రీ మాత్ర‌మే కాకుండా, ఒక డివైస్‌లో బ్రౌజ‌ర్‌ను ఆపిన చోట నుంచే రెండో డివైస్‌లోనూ బ్రౌజ‌ర్‌లో వెబ్ పేజీల‌ను తిరిగి అక్కడి నుంచే ఓపెన్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ బ్రౌజ‌ర్‌లో శాంసంగ్ పాస్ అనే ఫీచ‌ర్‌ను కూడా ఇచ్చారు. దీన్ని కూడా మొబైల్‌, పీసీల మ‌ధ్య సింక్ చేశారు. ఈ ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్ త‌న లాగిన్ వివ‌రాల‌ను, వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సుర‌క్షితంగా స్టోర్ చేసుకోవ‌చ్చు. వివిధ డివైస్‌ల‌లో ఆటోఫిల్ ద్వారా ఆ స‌మాచారాన్ని మ‌ళ్లీ నింపాల్సిన అవ‌స‌రం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప‌యోగించుకోవ‌చ్చు.

అనేక ఫీచ‌ర్లు..

శాంసంగ్ పీసీ బ్రౌజ‌ర్‌లో వివిధ ర‌కాల డివైస్‌ల మ‌ధ్య సింక్‌, కంటిన్యుటీని కొన‌సాగించే క్రాస్‌-డివైస్ కంటిన్యుటీ ఫీచ‌ర్‌తోపాటు సెష‌న్‌-లెవ‌ల్ సింక్‌, శాంసంగ్ పాస్ స‌పోర్ట్‌, ప‌ర్‌ప్లెక్సిటీ ఏఐ పార్ట్‌న‌ర్‌షిప్‌తో రూపొందించిన ఏజెంటిక్ ఏఐ అసిస్టెంట్‌, బ్రౌజ‌ర్‌లోనే ట్యాబ్‌ల నిర్వ‌హ‌ణ‌, హిస్ట‌రీ నావిగేష‌న్‌, వెబ్ పేజ్ స‌మాచారాన్ని ఉప‌యోగించి ట్రావెల్ ప్లాన్స్ చేసుకోవ‌డం, అనేక వెబ్ పేజీల‌ను వెద‌క‌కుండా అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని వేగంగా పొందేలా లాంగ్వేజ్ ఆధారిత సెర్చ్‌, వీడియోలోని నిర్దిష్ట‌మైన భాగాల‌ను గుర్తించి తిరిగి అక్క‌డి నుంచే ప్లేబ్యాక్ ను కొన‌సాగించే వీడియో కాంటెక్ట్స్ ఫీచ‌ర్‌, కీవ‌ర్డ్స్ లేదా తేదీలు అవ‌స‌రం లేకుండా స‌హ‌జ ప్ర‌శ్న‌ల‌తో హిస్ట‌రీలోని పాత వెబ్ పేజీల‌ను వెద‌క‌డం, ఒకేసారి ఓపెన్ చేసిన అనేక ట్యాబ్‌ల‌లోని స‌మాచారాన్ని సారాంశంగా చేసి పోల్చి చూపించే మ‌ల్టీ-ట్యాబ్ కాంటెక్ట్స్ అవేర్‌నెస్ వంటి అనేక ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఏయే వెర్ష‌న్ల‌కు..?

శాంసంగ్ లాంచ్ చేసిన పీసీ ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్ విండోస్ 11, విండోస్ 10 (1809 లేదా అంత‌క‌న్నా పైన వెర్ష‌న్లు) ప్లాట్‌ఫామ్‌ల‌పై ప‌నిచేస్తుంది. దీన్ని https://browser.samsung.com/ అనే వెబ్‌సైట్‌ను డౌన్‌లోడ్ చేసి పీసీలో ఇన్‌స్టాల్ చేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇక ఆండ్రాయిడ్‌లో అప్‌డేట్ అయిన బ్రౌజ‌ర్ వెర్ష‌న్‌లో ఏజెంటిక్ ఏఐ ఫీచ‌ర్ల‌ను ఉప‌యోగించుకోవాలంటే ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్‌తోపాటు యూజ‌ర్ల‌కు శాంసంగ్ అకౌంట్ ఉండాలి. శాంసంగ్ బ్రౌజ‌ర్ ను కొత్త వెర్ష‌న్‌కు అప్ డేట్ చేసుకుంటే ఈ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. ప్ర‌స్తుతం విండోస్‌, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఏఐ ఫీచ‌ర్లు మాత్రం అమెరికాలోని యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌గా, త్వ‌ర‌లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ సేవ‌ల‌ను యూజ‌ర్ల‌కు అందించ‌నున్నారు. ఇక మిగిలిన అన్ని ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్లు ఎవ‌రైనా ఆయా ప్లాట్‌ఫామ్‌ల‌పై ఈ బ్రౌజ‌ర్‌ను ప్ర‌స్తుతం ఉప‌యోగించ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement