Revanth Reddy | ఇంటర్నెట్‌తో మరింత సులభంగా నేరాలు..: సీఎం రేవంత్
Revanth Reddy | పిల్లలకు తమ హక్కులు, రక్షణపై అవగాహన ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. పిల్లల ఆన్‌లైన్ భద్రతపై జరిగే ప్రతి చర్చలో తల్లిదండ్రులు భాగం కావాలని చెప్పారు. ఇంటర్నెట్ (Internet) నేరాలను సృష్టించలేదని, వాటిని ప్రపంచవ్యాప్తంగా చేయడం మరింత సులభం చేసిందన్నారు.
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: పిల్లలకు తమ హక్కులు, రక్షణపై అవగాహన ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. పిల్లల ఆన్‌లైన్ భద్రతపై జరిగే ప్రతి చర్చలో తల్లిదండ్రులు భాగం కావాలని చెప్పారు. ఇంటర్నెట్ (Internet) నేరాలను సృష్టించలేదని, వాటిని ప్రపంచవ్యాప్తంగా చేయడం మరింత సులభం చేసిందన్నారు. కాంప్రహెన్సివ్ చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్ వర్క్ తీసుకొస్తామని తెలిపారు. దీన్ని ఆచరణలో పెట్టేందుకు సంబంధిత అధికారులకు ఇప్పుడే ఆదేశాలిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు, పిల్లలకు రెండు నంబర్లు కచ్చితంగా తెలిసి ఉండాలన్నారు. ఆపద సమయాల్లో 1930, 1098 నంబర్లను (Child Helpline Number) గుర్తుచుకోవాలని వెల్లడించారు. హైదరాబాద్ తాజ్‌కృష్ణలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) ఆధ్వర్యంలో జరుగుతున్న 'సౌత్‌జోన్ రీజినల్ కాన్ఫరెన్స్` ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూ.. ప్రతి ఒక్కరికీ న్యాయం అందాలని, డబ్బు లేకపోవడం వల్ల ఎవరికీ న్యాయం దూరం కాకూడదన్నారు.
`ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. కానీ తమ పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారనేది చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను ఎంతో సులభం చేశాయి. ప్రపంచంలోని సమాచారం మన చేతిలోకి వచ్చింది. ఎక్కడున్న వారితోనైనా, ఎప్పుడైనా మాట్లాడగలుగుతున్నాం. కానీ పిల్లలు అమాయకులు. ఏది నిజం? ఏది అబద్ధం? ఏది మంచిది? ఏది ప్రమాదకరం? అన్నది వారు వెంటనే గుర్తించలేరు. తెలియక పిల్లలు చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. వాటి ప్రభావం పిల్లలపైనే కాదు.. వారి కుటుంబాలపై, సమాజంపై కూడా పడుతుంది.
ఇంటర్నెట్‌తో సులభంగా నేరాలు..
ఇంటర్నెట్ ఈ నేరాలను సృష్టించలేదు. కానీ నేరాలను ప్రపంచవ్యాప్తంగా చేయడం మరింత సులభం చేసింది. తల్లిదండ్రులకు ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. భయంతో పిల్లలు తమ సమస్యలను ఎవరికీ చెప్పలేకపోవచ్చు. అందుకే మన ముందున్న ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. పిల్లలపై సైబర్ నేరాలను (Cyber Crime) ఎలా అరికట్టాలి? మన పిల్లలను ఎలా సురక్షితంగా ఉంచాలి?. బాధిత పిల్లలకు న్యాయం ఎలా అందించాలి?.
తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణ మా ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత. పోలీసులు, భరోసా కేంద్రాలు (Bharosa Center), చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు.. మన దగ్గర అనేక వ్యవస్థలు ఉన్నాయి. అయితే ఇవన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలి. అప్పుడే ఒక బిడ్డకు పూర్తి రక్షణ కల్పించగలం. మన భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకే చోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నాం. దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం.
కలిసి పనిచేస్తేనే..
పిల్లల రక్షణ కోసం పోలీసు శాఖలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. CybHER యాప్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యార్థులనే సైబర్ అంబాసిడర్లుగా తయారు చేసి, తమ తోటి విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. అన్ని శాఖలు కలిసి పనిచేస్తేనే పిల్లలకు రక్షణ లభిస్తుంది. బాధితులకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ఆర్థిక సహాయం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించడం వరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. TGS-LSA పాఠశాల విద్యాశాఖతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. దీంతో ఉపాధ్యాయులు పిల్లలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలంగాణ హైకోర్టుకు, TGS-LSAకు ధన్యవాదాలు.
నేరస్తుడికి శిక్ష పడటం కాదు..
న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం కాదు. న్యాయం అంటే బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం. న్యాయం అంటే అతని గౌరవాన్ని తిరిగి ఇవ్వడం. ముఖ్యంగా... ఒక బిడ్డ కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయం. ఈ సందర్భంగా సంబంధిత అన్ని శాఖలకు నేను ఒక ముఖ్యమైన ఆదేశం ఇస్తున్నా. తెలంగాణ హైకోర్టు, టీజీఎస్-ఎల్‌ఎస్‌ఏతో కలిసి చర్చించి పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం సమగ్ర చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌ను (Child Online Safety Framework) సిద్ధం చేయాలి. న్యాయ సేవా సంస్థలు చేస్తున్న మంచి కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి చేరేలా మా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలి.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి..
పిల్లల ఆన్‌లైన్ భద్రతపై (Child Online Safety) జరిగే ప్రతి చర్చలో తల్లిదండ్రులు భాగం కావాలి. ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రి సైబర్ నేరాల కోసం 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 1098 నంబర్లు తప్పక గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. మీ పిల్లలతో మాట్లాడండి. వారు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చూస్తున్నారు? తెలుసుకోండి. కానీ వారిని తప్పుపట్టేలా కాదు. ఆసక్తితో, అవగాహనతో మాట్లాడండి. ఎందుకంటే.. వాళ్లు మన పిల్లలు. వారికి మన మద్దతు కావాలి. మన మార్గదర్శకత్వం కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా.. మన ప్రేమ, అవగాహన కావాలి. మన పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు మనమంతా కలిసి పనిచేద్దాం. ఈ సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సదస్సులో జరిగే చర్చలు, అందించే సిఫారసులు తెలంగాణకే కాదు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్వసిస్తున్నా.` అని సీఎం రేవంత్ అన్నారు.
NALSA ఆధ్వర్యంలో జరుగుతున్న దక్షిణ మండల ప్రాంతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సదస్సుకు పిల్లల సైబర్ భద్రత అనే చాలా ముఖ్యమైన అంశాన్ని ఎంచుకున్నందుకు జస్టిస్ విక్రమ్ నాథ్‌కు, నల్సాకు ధన్యవాదాలు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క
అక్టోబర్ 3, 2026

Bus Accident | అంత్యక్రియలకు వెళ్తుండగా.. అనంతగిరి ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా.. ఐదుగురు దుర్మరణం
అక్టోబర్ 3, 2026

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం
- ●Smart Phones | రూ.30వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.. ఈ-కామర్స్ వేదికల్లో డీల్స్..
- ●Rahul Gandhi | దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. 'సత్యాగ్రహ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్
- ●Manne Krishank | రేవంత్ కూతురుతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవరు?
- ●Amazon Great Indian Festival 2026 | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ డీల్స్ రివీల్.. ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..
- ●Nayara Energy | వినియోగదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు

Ponguleti Srinivas Reddy | నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం

Smart Phones | రూ.30వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.. ఈ-కామర్స్ వేదికల్లో డీల్స్..

Rahul Gandhi | దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. 'సత్యాగ్రహ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్

Manne Krishank | రేవంత్ కూతురుతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవరు?



