Windows 11 | 8 జీబీ ర్యామ్ పీసీ యూజర్లకు గుడ్‌న్యూస్.. విండోస్ 11 వేగం 20 శాతం పెంపు..
Windows 11 | మీ ల్యాప్‌టాప్‌లో బ్రౌజర్ ట్యాబ్‌లు ఎక్కువగా తెరిచిన ప్రతిసారీ వేగం తగ్గిపోతోందా? అయితే మీకు ఊరటనిచ్చే వార్త ఇది. 8 జీబీ మెమరీతో పనిచేసే కంప్యూటర్ల పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ విండోస్ 11లో కీలక మార్పులు చేస్తోంది. ఈ అప్డేట్తో కంప్యూటర్లు మరింత వేగంగా, మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది. తాజాగా ప్రచురించిన బ్లాగ్ పోస్ట్‌లో మైక్రోసాఫ్ట్ ఈ విషయాలను వెల్లడించింది.
Technology | Published On Oct 17, 2026, 1.31 pm IST
Windows 11 | మీ ల్యాప్‌టాప్‌లో బ్రౌజర్ ట్యాబ్‌లు ఎక్కువగా తెరిచిన ప్రతిసారీ వేగం తగ్గిపోతోందా? అయితే మీకు ఊరటనిచ్చే వార్త ఇది. 8 జీబీ మెమరీతో పనిచేసే కంప్యూటర్ల పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ విండోస్ 11లో కీలక మార్పులు చేస్తోంది. ఈ అప్డేట్తో కంప్యూటర్లు మరింత వేగంగా, మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది. తాజాగా ప్రచురించిన బ్లాగ్ పోస్ట్‌లో మైక్రోసాఫ్ట్ ఈ విషయాలను వెల్లడించింది. విండోస్ ఇన్సైడర్ కమ్యూనిటీ నుంచి అందిన అభిప్రాయాల ఆధారంగా ఈ మార్పులను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ మెరుగుదలలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తుండగా, రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు అందుబాటులోకి రానున్నాయి.
పనితీరులో 20 శాతం వరకు మెరుగుదల..
విండోస్ 11 పనితీరు 20 శాతం వరకు మెరుగుపడినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కంప్యూటర్ను ఆన్ చేసినప్పటి నుంచే వినియోగదారులు ఈ మార్పులను గుర్తిస్తారని తెలిపింది. సెర్చ్, స్టార్ట్ మెనూ, ఫైల్ ఎక్స్ప్లోరర్తోపాటు ఎడ్జ్ బ్రౌజర్, మైక్రోసాఫ్ట్ 365, స్నిప్పింగ్ టూల్ వంటి అప్లికేషన్లు మరింత వేగంగా పనిచేస్తాయని వెల్లడించింది. ఈ మెరుగుదలలతో ముఖ్యంగా 8 జీబీ మెమొరీ ఉన్న కంప్యూటర్లకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. విండోస్ మెమొరీని నిర్వహించే విధానాన్ని మైక్రోసాఫ్ట్ పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం వినియోగిస్తున్న అప్లికేషన్లు, పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా మార్పులు చేసింది. ఈ కంప్యూటర్లలో ప్రస్తుతం వినియోగిస్తున్న అప్లికేషన్లకు సంబంధించిన అదనంగా 2 జీబీ వరకు డేటాను వేగవంతమైన మెమొరీలోనే ఉంచే అవకాశం కల్పించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. గతంలో ఈ డేటా నెమ్మదిగా పనిచేసే స్టోరేజ్ వ్యవస్థకు తరలిపోయే అవకాశం ఉండేది. తాజా మార్పులతో ఒకేసారి ఎక్కువ అప్లికేషన్లు లేదా బ్రౌజర్ ట్యాబ్‌లు తెరిచినప్పుడు కంప్యూటర్ నెమ్మదించే సమస్య తగ్గుతుందని పేర్కొంది.
8జీబీ కంటే తక్కువ మెమొరీ ఉంటే..
అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో మెమొరీ వినియోగాన్ని కూడా తగ్గిస్తోంది. 8 జీబీ లేదా అంతకంటే తక్కువ మెమొరీ ఉన్న కంప్యూటర్లలో విడ్జెట్లను వినియోగదారులు తెరిచే వరకు నిష్క్రియంగా ఉంచే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల ఇతర అప్లికేషన్ల వినియోగానికి 200 ఎంబీ కంటే ఎక్కువ మెమొరీ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కంప్యూటర్ వినియోగంలో తరచూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంపైనా మైక్రోసాఫ్ట్ దృష్టి పెట్టింది. అప్డేట్లు ఎప్పుడు ఇన్స్టాల్ కావాలనే విషయంపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పిస్తోంది. అప్డేట్లను సమూహాలుగా నిర్వహించడం ద్వారా కంప్యూటర్ను పదేపదే రీస్టార్ట్ చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తోంది. అప్డేట్ల ఇన్స్టాలేషన్ ప్రక్రియ కూడా వేగంగా పూర్తయ్యేలా మార్పులు చేస్తోంది.
సులభంగా బ్లూటూత్ కనెక్షన్లు..
బ్లూటూత్ హెడ్ఫోన్లు కంప్యూటర్‌కు సులభంగా కనెక్ట్ కావడంతోపాటు, కనెక్షన్ తెగిపోయినప్పుడు తిరిగి కనెక్ట్ అయ్యే విధానం మరింత నమ్మదగినదిగా మారనుంది. యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ను జత చేసే ప్రక్రియలో 15 సెకన్ల వరకు సమయం ఆదా అవుతుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. విండోస్ హలో ద్వారా ముఖ గుర్తింపు లేదా వేలిముద్రతో కంప్యూటర్లోకి సైన్ ఇన్ అయ్యే ప్రక్రియ కూడా మరింత వేగంగా, విశ్వసనీయంగా మారనుందని పేర్కొంది. స్టార్ట్ మెనూ, టాస్క్‌బార్‌ను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే స్వేచ్ఛను వినియోగదారులకు మరింత పెంచుతోంది. స్క్రీన్‌పై టాస్క్‌బార్ ఎక్కడ ఉండాలనే విషయాన్ని కూడా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. విడ్జెట్లను మరింత సరళంగా, తక్కువ అంతరాయం కలిగించేలా రూపొందించింది. ఇదే సమయంలో డ్రైవర్ క్వాలిటీ ఇనిషియేటివ్ ద్వారా హార్డ్‌వేర్ తయారీ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కంప్యూటర్ డ్రైవర్లు మరింత స్థిరంగా, విశ్వసనీయంగా, సురక్షితంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది.
పీసీని మారుతుంది..
విండోస్ 11 పనితీరులో 20 శాతం వరకు మెరుగుదల ఉంటుందన్న గణాంకాలు మైక్రోసాఫ్ట్ నిర్వహించిన పరీక్షల ఆధారంగా వెల్లడించినవే. వాస్తవ పనితీరు మాత్రం ఒక్కో కంప్యూటర్ కాన్ఫిగరేషన్, వినియోగ విధానాన్ని బట్టి మారుతుందని సంస్థ స్పష్టం చేసింది. అలాగే, అప్డేట్ అందుబాటులోకి వచ్చే సమయం కూడా పరికరం, ప్రాంతాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఈ ఏడాది కొత్త కంప్యూటర్ కొనుగోలు చేయాలనే ఆలోచన లేని వినియోగదారులకు ఈ అప్డేట్ కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న కంప్యూటర్ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు, కొత్త పరికరం కొనుగోలును కొంతకాలం వాయిదా వేసుకునేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయి.
సంబంధిత వార్తలు

Indian IT Companies | భారతీయ కంపెనీలపై పర్మ్ (PERM) వేటు.. అసలు ఇదేమిటి.. ఉద్యోగులపై ప్రభావం ఎంత?
అక్టోబర్ 9, 2026

Microsoft | మైక్రోసాఫ్ట్‌కు తొలి వెరా రూబిన్ ఏఐ ప్లాట్‌ఫామ్.. కీలక మైలురాయి..
ఆగస్టు 22, 2026

Windows 11 | మీ విండోస్ ల్యాప్ టాప్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడం లేదా.. ఈ సెట్టింగ్స్‌ను మార్చండి..
జులై 25, 2026
తాజావార్తలు
- ●Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ఉంటే.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం లేదు
- ●Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
- ●Zero Sugar Diversion Ethanol | ఇథనాల్ తయారీలో చక్కెరపై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం!
- ●E2E Networks | ఏడాదిలో 250 శాతం లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల పంట ఇచ్చిన షేర్..
- ●Apple | ఐఫోన్ 17కు డిమాండ్ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్..
- ●blast at chemical unit | రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి

Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ఉంటే.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం లేదు

Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Zero Sugar Diversion Ethanol | ఇథనాల్ తయారీలో చక్కెరపై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం!

E2E Networks | ఏడాదిలో 250 శాతం లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల పంట ఇచ్చిన షేర్..



