త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఏఐని భూతంగా చిత్రీక‌రించకండి.. యువ‌త‌లో భ‌రోసా నింపండి

KTR | ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(AI) ను భూతంగా చిత్రీక‌రించ‌డం స‌రికాదు.. యువ‌త‌లో భ‌యం కాకుండా భ‌రోసా నింపాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సూచించారు. ఏఐతో ఉద్యోగాలు పోవు.. కొత్త ఉపాధి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో శ‌నివారం ర్యాండం ట్రీస్( RandomTrees ) అనే కంపెనీని కేటీఆర్ ప్రారంభించారు.

S

Telangana | Published On Oct 24, 2026, 1.51 pm IST

KTR | ఏఐని భూతంగా చిత్రీక‌రించకండి.. యువ‌త‌లో భ‌రోసా నింపండి
Advertisement

ఏఐతో ఉద్యోగాలు పోవు..
కొత్త ఉపాధి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాలి
ర్యాండం ట్రీస్ కంపెనీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా కేటీఆర్ వ్యాఖ్య‌

KTR | త్రినేత్ర న్యూస్ : ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(AI) ను భూతంగా చిత్రీక‌రించ‌డం స‌రికాదు.. యువ‌త‌లో భ‌యం కాకుండా భ‌రోసా నింపాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సూచించారు. ఏఐతో ఉద్యోగాలు పోవు.. కొత్త ఉపాధి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో శ‌నివారం ర్యాండం ట్రీస్( RandomTrees ) అనే కంపెనీని కేటీఆర్ ప్రారంభించారు. 400 మంది ఉద్యోగుల‌తో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ర్యాండం ట్రీస్ ప్రారంభించింది.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత పదేళ్ల ఐటీ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలి. పెట్టుబడులకు అడ్డంకులు కాదు.. ప్రోత్సాహకర వాతావరణం కల్పించాలి. ఉన్న కంపెనీలకు మౌలిక వసతులు కల్పించి వారి కార్యకలాపాలు ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుంటే సరిపోతుంది. కరెంటు, నీరు, మంచి రోడ్లు కల్పిస్తే సరిపోతుంది. ప్రైవేట్ రంగం విస్తరణతోనే యువతకు పెద్దఎత్తున ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు.

స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌తోనే భవిష్యత్తు... ప్రతి ఒక్కరూ ఆ దిశగా సాగి ఐటీ రంగంలోని మార్పులను అందిపుచ్చుకోవాలి. వ్యవసాయం, వైద్యం, విద్యలో ఏఐతో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. ఏఐ అనేక కొత్త అవకాశాలను కల్పిస్తుంది... వాటిని అందుకోవాలి. డేటా, ఏఐ రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానం కావాలి. ఈ రంగంలో పెట్టుబడుల కోసం కంపెనీల ఏర్పాటు కోసం గత ప్రభుత్వ హయాంలోనే ప్రత్యేక పాలసీలను తీసుకువచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు.

Advertisement
Advertisement