Jio | యూత్ కోసం జియో ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్.. ఎన్నో బండిల్డ్ బెనిఫిట్స్..
Jio | టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూత్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా యూత్ అండ్ గేమింగ్ పేరిట ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. యూత్ చాలా మంది కంటెంట్ క్రియేషన్, ఇన్‌స్టాగ్రామ్, స్ట్రీమింగ్, గేమింగ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువగా సమయం వెచ్చిస్తుంటారు. కనుక అలాంటి వారికి మొబైల్ డేటా త్వరగా అయిపోతుంది.
Technology | Published On Apr 25, 2026, 9.43 am IST
Jio | టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూత్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా యూత్ అండ్ గేమింగ్ పేరిట ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. యూత్ చాలా మంది కంటెంట్ క్రియేషన్, ఇన్‌స్టాగ్రామ్, స్ట్రీమింగ్, గేమింగ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువగా సమయం వెచ్చిస్తుంటారు. కనుక అలాంటి వారికి మొబైల్ డేటా త్వరగా అయిపోతుంది. అయితే జియో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌తో కస్టమర్లకు అదనపు డేటా లభిస్తుంది. దీంతో రోజువారి డేటా లిమిట్ అయిపోగానే ఆ అదనపు డేటాను ఉపయోగించుకోవచ్చు. కేవలం యూత్‌ను దృష్టిలో ఉంచుకుని జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో కేవలం రోజువారీ డేటా, అదనపు డేటా మాత్రమే కాకుండా బండిల్డ్ సబ్‌స్క్రిప్షన్లు, ఉచిత క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు వంటి ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే డేటా ఎక్కువగా వాడే రెగ్యులర్ కస్టమర్లు కూడా ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
అన్‌లిమిటెడ్ 5జి మొబైల్ డేటా..
జియో యూత్ గేమింగ్ ప్లాన్ నెలవారి చార్జి రూ.459గా ఉంది. వాలిడిటీ 28 రోజులు. ఇందులో రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం వాలిడిటీ పీరియడ్‌కు 56 జీబీ డేటా లభిస్తుంది. అయితే మరో 5జీబీ డేటాను అదనంగా ఇస్తున్నారు. దీంతో రోజువారి కోటా పూర్తవగానే డేటాను అదనంగా ఇచ్చే దాంట్లో నుంచి వాడుకోవచ్చు. ఈ క్రమంలో కస్టమర్లకు మొత్తం 61జీబీ డేటా లభిస్తుంది. ఇక మొత్తం డేటా కోటా పూర్తయితే స్పీడ్ లిమిట్‌ను 64కేబీపీఎస్‌కు తగ్గిస్తారు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా ఇస్తున్నారు. అయితే 5జి నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కస్టమర్లు అన్‌లిమిటెడ్ 5జి డేటాను పొందవచ్చు. దీని వల్ల రోజువారి 2జీబీ కోటా పూర్తయినా ఇబ్బంది ఉండదు. కస్టమర్లు 5జి మొబైల్ డేటాను అన్‌లిమిటెడ్‌గా ఉపయోగించుకోవచ్చు. కేవలం కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లతోపాటు పోస్ట్ పెయిడ్ ప్లాన్లలోనే జియో ఈ సదుపాయాన్ని అందిస్తోంది.
అనేక ఉచిత డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు..
ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు పలు డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు బండిల్‌గా లభిస్తాయి. జియో గేమ్స్ మొబైల్స్, ఫ్యాన్ కోడ్ ఓటీటీ, స్నాప్ చాట్ ప్లస్ వంటి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లను ఇందులో ఉచితంగా పొందవచ్చు. అలాగే 3 నెలల కాలవ్యవధి గల జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతోపాటు 50జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను జియో ఏఐ క్లౌడ్‌లో పొందవచ్చు. కేవలం సింగిల్ రీచార్జితోనే యూత్ కస్టమర్లకు కావల్సిన దాదాపు అన్ని రకాల సేవలను పొందేలా ఈ ప్లాన్‌ను జియో అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు రూ.35,100 విలువ కలిగిన 18 కాలవ్యవధితో కూడిన గూగుల్ జెమిని ప్రొ ఏఐ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లను గూగుల్ జెమినిలో ఉపయోగించుకోవచ్చు. దీంట్లో 5టీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్లు అన్నీ యాక్టివ్‌గా ఉండాలంటే కస్టమర్లు ప్రతి నెలా గడువుకు ముందే ఈ ప్లాన్‌ను తప్పనిసరిగా రీచార్జి చేసుకోవాలి. లేదంటే బెనిఫిట్స్‌ను కోల్పోతారు. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ల సేవలను ఉచితంగా పొందాలంటే కస్టమర్లు తమ జియో ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా జియో యూత్ అండ్ గేమింగ్ ప్లాన్ మల్టిపుల్ బెనిఫిట్స్‌ను యూత్ కస్టమర్లకు అందిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
మే 16, 2026

BSNL Recharge Plan | బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. 70 రోజుల వ్యాలిడిటీ, హైస్పీడ్ డేటాతో రూ.599 కొత్త రీఛార్జ్ ప్లాన్..!
ఏప్రిల్ 27, 2026

Reliance Industries | ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన రిలయన్స్ షేర్లు.. అప్పట్లో రూ.10వేలు పెట్టి ఉంటే ఇప్పుడు కోట్లు లాభం..
ఏప్రిల్ 26, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



