Reliance Jio | జియో నుంచి 3 ఏళ్ల రీచార్జ్ ప్లాన్.. 2,700 జీబీ డేటా..
Reliance Jio | టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.10వేల ధరతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా ఒకసారి రీఛార్జ్ చేస్తే మూడేళ్ల పాటు సేవలను పొందవచ్చు. రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, అపరిమిత 5జి డేటాతో పాటు ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్, డిజిటల్ సేవలను కూడా అందిస్తోంది.
Reliance Jio | టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.10వేల ధరతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా ఒకసారి రీఛార్జ్ చేస్తే మూడేళ్ల పాటు సేవలను పొందవచ్చు. రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, అపరిమిత 5జి డేటాతో పాటు ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్, డిజిటల్ సేవలను కూడా అందిస్తోంది.
ఒకసారి రీచార్జి చేస్తే 3 ఏళ్లపాటు వాలిడిటీ..
రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10వేలు చెల్లించి రీఛార్జ్ చేసుకుంటే 3 సంవత్సరాల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా చొప్పున మూడేళ్లకు కలిపి మొత్తం 2,737.5 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. జియో ట్రూ 5జి నెట్‌వర్క్ పరిధిలో ఉన్న అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5జి డేటా సదుపాయం కూడా ఉంటుంది. వీటితోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు.
అదనపు డిజిటల్ ప్రయోజనాలు సైతం..
ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అదనపు డిజిటల్ ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది. జియోహాట్‌స్టార్ మొబైల్ ప్లస్ హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ప్రత్యక్ష క్రీడా ప్రసారాలు, హాట్‌స్టార్ ఒరిజినల్స్, హాలీవుడ్ కంటెంట్‌ను మొబైల్‌లో వీక్షించవచ్చు. ఇందుకోసం రిజిస్టర్డ్ జియో మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. అలాగే రూ.1,590 విలువైన కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. జియో ఏఐ క్లౌడ్ ద్వారా 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్, జియో టీవీ ద్వారా ప్రత్యక్ష టెలివిజన్ ఛానళ్లను వీక్షించే సదుపాయం కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. ఈ మూడేళ్ల ప్లాన్‌ను మైజియో యాప్, జియో అధికారిక వెబ్‌సైట్, కంపెనీ రిటైల్ స్టోర్లు, అధీకృత థర్డ్ పార్టీ రీఛార్జ్ కేంద్రాల ద్వారా పొందవచ్చు. నెలవారీ లేదా ఏడాది రీఛార్జ్‌ల అవసరం లేకుండా దీర్ఘకాలం ఒకే ప్లాన్‌తో కొనసాగాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జియో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nithiin | యంగ్ లుక్‌లో నితిన్ - రుక్మిణి కోసం కృష్ణ నయా అవతారం
- ●MLC Dasoju Sravan | రేవంత్! గురుకుల బెడ్‌షీట్స్‌ను కోటు కుట్టించుకో.. తెలుస్తది
- ●BYD | చైనా ఎలక్ట్రిక్ కార్ @ 500 కి.మీ. వేగం.. సరికొత్త ప్రపంచ రికార్డు..
- ●Air Pollution | WFH నిబంధనలు పాటించలేదని.. రెండు సంస్థలకు నోటీసులు
- ●IAF | లడఖ్‌లో చరిత్ర సృష్టించిన ఐఏఎఫ్..
- ●CoinDCX | క్రిప్టో సంస్థలకు ఈడీ షాక్.. కాయిన్ డీసీఎక్స్, డెల్టా ఎక్స్ఛేంజ్పై దర్యాప్తు..

Nithiin | యంగ్ లుక్‌లో నితిన్ - రుక్మిణి కోసం కృష్ణ నయా అవతారం

MLC Dasoju Sravan | రేవంత్! గురుకుల బెడ్‌షీట్స్‌ను కోటు కుట్టించుకో.. తెలుస్తది

BYD | చైనా ఎలక్ట్రిక్ కార్ @ 500 కి.మీ. వేగం.. సరికొత్త ప్రపంచ రికార్డు..

Air Pollution | WFH నిబంధనలు పాటించలేదని.. రెండు సంస్థలకు నోటీసులు






