Reliance Industries | స్టార్‌లింక్‌కు స్వాగతం.. పోటీకి భయపడం: రిలయన్స్
Reliance Industries | శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలో పోటీకి తాము ఎప్పుడూ భయపడలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సహా ఏ సంస్థ అయినా భారత చట్టాలు, విధానాలకు అనుగుణంగా పనిచేస్తే స్వాగతిస్తామని వెల్లడించింది. భారత మార్కెట్లో రిలయన్స్ సంస్థపై ఇటీవల వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలను ప్రజల ముందుంచాలని నిర్ణయించినట్లు శుక్రవారం ఎక్స్ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Reliance Industries | శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలో పోటీకి తాము ఎప్పుడూ భయపడలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సహా ఏ సంస్థ అయినా భారత చట్టాలు, విధానాలకు అనుగుణంగా పనిచేస్తే స్వాగతిస్తామని వెల్లడించింది. భారత మార్కెట్లో రిలయన్స్ సంస్థపై ఇటీవల వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలను ప్రజల ముందుంచాలని నిర్ణయించినట్లు శుక్రవారం ఎక్స్ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభం ఆలస్యం కావడంపై ఎలాన్ మస్క్ ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. భారత టెలికాం రంగంపై అంబానీకి అతిగా ప్రభావం ఉందా? అంటూ ప్రశ్నించారు. వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు స్టార్‌లింక్‌కు ఇంకా తుది అనుమతులు ఎందుకు లభించలేదని కూడా మస్క్ ప్రశ్నించారు.
చట్టబద్ధమైన విధానాలే పునాది..
ప్రజల జీవితాలను మెరుగుపరిచే పెట్టుబడులు, ఆవిష్కరణలను స్వాగతించే భారత్‌లోనే తమ సంస్థ అభివృద్ధి చెందిందని రిలయన్స్ పేర్కొంది. స్వదేశీ సంస్థలైనా, విదేశీ సంస్థలైనా కొత్త ఆవిష్కరణలతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలను భారత్ ప్రోత్సహిస్తోందని తెలిపింది. అయితే, ఈ స్వేచ్ఛకు చట్టబద్ధమైన విధానాలే పునాది అని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించినట్లుగా, దేశీయ సంస్థలైనా, విదేశీ సంస్థలైనా దరఖాస్తుల విషయంలో ఒకే విధమైన ప్రక్రియను అనుసరిస్తున్నారని రిలయన్స్ తెలిపింది. తమ సంస్థకు చెందిన జియో శాటిలైట్ సేవలకు కూడా ఇంకా అవసరమైన అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించింది. శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలో పోటీపై స్పందిస్తూ, స్టార్‌లింక్‌తో సహా అన్ని సంస్థలను స్వాగతిస్తున్నామని రిలయన్స్ పేర్కొంది. జియో సహా ప్రతి సంస్థ భారత ప్రజలకు సేవలందించడంతోపాటు దేశ చట్టాలు, విధానాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేది ఎవరో తేల్చేందుకు పోటీనే నిజమైన పరీక్ష అని అభిప్రాయపడింది.
530 మిలియన్లకు పైగా వినియోగదారులు..
తమ టెలికాం విభాగమైన జియో ప్రస్థానాన్ని ఈ సందర్భంగా రిలయన్స్ గుర్తుచేసింది. 2016లో ఇప్పటికే అనేక సంస్థలు ఉన్న భారత టెలికాం మార్కెట్లో జియో ఒక్క వినియోగదారుడు కూడా లేకుండా కొత్త సంస్థగా అడుగుపెట్టిందని తెలిపింది. కేవలం పదేళ్లలో 530 మిలియన్లకు పైగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించిందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను, అత్యంత తక్కువ ధరల్లో డేటా సేవలను భారతీయులకు అందించామని వెల్లడించింది. రిలయన్స్ ఈ ప్రకటన చేయడానికి కొద్ది రోజుల ముందే మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిలయన్స్ టెలికాం విభాగానికి యజమానిగా ఉన్న జియో ప్లాట్‌ఫామ్స్ త్వరలో దేశంలోనే అతిపెద్ద ప్రాథమిక వాటాల విక్రయానికి (ఐపీఓ) సిద్ధమవుతోంది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ విలువను 106 బిలియన్ డాలర్లుగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
భారత్‌లో అత్యంత చవక ధరకే మొబైల్ డేటా..
మరోవైపు, భారత్‌లో స్టార్‌లింక్ సేవల ధరలను మస్క్ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం దేశంలో మొబైల్ డేటా ధర జీబీకి సుమారు రూ.7.74గా ఉండడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరల్లో డేటా సేవలు అందుబాటులో ఉన్న మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉంది. ఇక స్టార్‌లింక్ సంస్థను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను ఆలస్యం చేస్తోందన్న వాదనను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. స్టార్‌లింక్, జియో శాటిలైట్ సేవలు రెండూ దాదాపు ఒకే నియంత్రణ ప్రక్రియ దశలో ఉన్నాయని స్పష్టం చేసింది. తుది భద్రతా అనుమతుల కోసం రెండు సంస్థలు ఎదురుచూస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. అనుమతుల విషయంలో ఎలాంటి పక్షపాతం లేదని స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Madhu Yaskhi Goud | రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్: మధుయాష్కి గౌడ్
- ●Special Parliament Session | నెలాఖరులో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు..? మళ్లీ తెరపైకి డీలిమిటేషన్, మహిళా బిల్లులు
- ●SEBI | సీఏఎస్‌పై సెబీ కొత్త రూల్స్.. వారంలోగా మార్గదర్శకాలు..
- ●Automated Testing Stations | రూ.425.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో జోష్.. దేశీయంగా స్థిరంగా ఉన్న ధరలు..
- ●PV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. ఒకదానికొకటి ఢీకొట్టిన 6 కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్

Madhu Yaskhi Goud | రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్: మధుయాష్కి గౌడ్

Special Parliament Session | నెలాఖరులో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు..? మళ్లీ తెరపైకి డీలిమిటేషన్, మహిళా బిల్లులు

SEBI | సీఏఎస్‌పై సెబీ కొత్త రూల్స్.. వారంలోగా మార్గదర్శకాలు..

Automated Testing Stations | రూ.425.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు






