త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Reliance Jio | రూ.3,599కే జియో యానివర్సరీ ప్లాన్.. 18 నెలల ఏఐ సబ్‌స్క్రిప్షన్‌ కూడా..

Reliance Jio | రిలయన్స్ జియో తన పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఎడిషన్ వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.3,599 ధర కలిగిన ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు సాధారణ టెలికాం సేవలతోపాటు క్లౌడ్ స్టోరేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్‌స్క్రిప్షన్లు, డిజిటల్ భాగస్వామ్య సంస్థల వోచర్లు అందిస్తోంది.

S

Technology | Published On Sep 7, 2026, 12.12 pm IST

Reliance Jio | రూ.3,599కే జియో యానివర్సరీ ప్లాన్.. 18 నెలల ఏఐ సబ్‌స్క్రిప్షన్‌ కూడా..
Advertisement

Reliance Jio | రిలయన్స్ జియో తన పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఎడిషన్ వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.3,599 ధర కలిగిన ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు సాధారణ టెలికాం సేవలతోపాటు క్లౌడ్ స్టోరేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్‌స్క్రిప్షన్లు, డిజిటల్ భాగస్వామ్య సంస్థల వోచర్లు అందిస్తోంది. రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ప్రమోషనల్ ప్లాన్‌లో ప్రధానంగా ఎక్కువ కాలం వ్యాలిడిటీతోపాటు సాధారణ వాయిస్, మొబైల్ డేటా సేవలకు మించి అదనపు డిజిటల్ సేవలను అందించడంపై దృష్టి పెట్టింది. రూ.3,599 ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ 4జి డేటా లభిస్తుంది. సపోర్ట్ చేసే పరికరాల్లో అన్‌లిమిటెడ్ 5జి డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే స్థానిక, జాతీయ స్థాయిలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొంద‌వ‌చ్చు. దీనికి అదనంగా 120 జీబీ బోనస్ డేటా లభిస్తుంది. ఈ డేటాను 12 నెలల పాటు ప్రతి నెల 10 జీబీ చొప్పున వోచర్ల రూపంలో కేటాయిస్తారు.

18 నెల‌ల ఉచిత ఏఐ ప్రొ స‌బ్‌స్క్రిప్ష‌న్‌..

డిజిటల్, ఏఐ ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌లో కీలకంగా ఉన్నాయి. గూగుల్ జెమిని ప్రొ టియర్‌కు 18 నెలల యాక్సెస్, 5 టెరాబైట్లు అంటే 5000 జీబీ క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. అలాగే నానో బనానా ఏఐ టూల్‌ను కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. వినోదం, మీడియా ప్రయోజనాల్లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ కేటలాగ్‌కు కూడా యాక్సెస్ ఉంటుంది. దీంతోపాటు 1000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను అందించే జియోటీవీ ప్రొ ప్యాక్‌కు ఏడాది పాటు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. లైఫ్‌స్టైల్, ట్రావెల్ ప్రయోజనాల్లో భాగంగా ఈజ్‌మైట్రిప్ ద్వారా విమానాలు, హోటల్ బుకింగ్‌లపై గరిష్ఠంగా రూ.2,200 విలువైన వోచర్లు లభిస్తాయి. రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై ఉపయోగించుకునేలా ఏజీఐఓ నుంచి రూ.200 డిస్కౌంట్ వోచర్, సినీపోలిస్ మూవీ థియేటర్ల కోసం రూ.150 డిస్కౌంట్ వోచర్ కూడా అందిస్తున్నారు.

ఎలా పొందాలి..

ఈ వార్షికోత్సవ ప్రత్యేక టారిఫ్‌ను మైజియో అప్లికేషన్, జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అధీకృత రిటైల్ భాగస్వాముల నెట్‌వర్క్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. టెలికాం రంగంలో కొనసాగుతున్న మరో కీలక ధోరణిని ఈ ఆఫర్ ప్రతిబింబిస్తోంది. క్లౌడ్ స్టోరేజ్, స్ట్రీమింగ్ మీడియా, జనరేటివ్ ఏఐ వంటి థర్డ్ పార్టీ డిజిటల్ సేవలను దీర్ఘకాలిక టెలికాం ప్లాన్‌లలో నేరుగా కలిపి అందించడం ద్వారా వినియోగదారులకు అదనపు విలువను అందించడంతోపాటు, ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) పెంచుకోవాలని ప్రధాన టెలికాం సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

Advertisement
Advertisement