త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..

Jio | విదేశాలకు వెళ్లే వినియోగదారులకు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. తన ఇంటర్నేషనల్ రోమింగ్ (ఐఆర్) వాయిస్, డేటా ప్లాన్లను జియో అప్‌డేట్ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన ప్లాన్లలో గతంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ డేటాను అందిస్తోంది. ముఖ్యంగా ప్లాన్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకుండానే ఈ అదనపు ప్రయోజనాలను అందిస్తుండ‌డం విశేషం.

S

Technology | Published On Jul 14, 2026, 11.53 am IST

Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..
Advertisement

Jio | విదేశాలకు వెళ్లే వినియోగదారులకు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. తన ఇంటర్నేషనల్ రోమింగ్ (ఐఆర్) వాయిస్, డేటా ప్లాన్లను జియో అప్‌డేట్ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన ప్లాన్లలో గతంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ డేటాను అందిస్తోంది. ముఖ్యంగా ప్లాన్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకుండానే ఈ అదనపు ప్రయోజనాలను అందిస్తుండ‌డం విశేషం. కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వివిధ దేశాల సమూహాలుగా విభజించింది. ప్రయాణించే దేశం, అక్కడ ఉండే రోజుల ఆధారంగా వినియోగదారులు తగిన ప్లాన్‌ను ఎంచుకునేలా ఈ కొత్త నిర్మాణాన్ని రూపొందించింది. 132 దేశాల కవరేజ్ కలిగిన ప్లాన్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో ఉపయోగించుకునేలా అందుబాటులో ఉన్నాయి. వీటిలో సాధారణ కాలపరిమితి ప్లాన్లతోపాటు ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ కూడా ఉంది.

ప్రీమియం ఆప్ష‌న్‌లు అందుబాటులో..

100 దేశాల కవరేజ్ ప్లాన్లలో మధ్యస్థాయి నుంచి ప్రీమియం ఆప్షన్లు అందుబాటులో ఉండగా, కొన్ని ప్లాన్లలో విమాన ప్రయాణ సమయంలో కూడా ఉపయోగించుకునే ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటీ సదుపాయం కల్పించింది. 75 దేశాల కేటగిరీలో తక్కువ వ్యవధి ప్లాన్లతోపాటు రోజువారీ డేటా అలవెన్స్ ఆధారిత ప్లాన్లు ఉన్నాయి. అలాగే ఆరు దేశాలకు ప్రత్యేకంగా మూడు ధరల శ్రేణిలో రీజినల్ ప్లాన్లను అందిస్తోంది. 132 దేశాల కవరేజ్ టియర్‌లో రూ.1,499 ప్లాన్‌తో 14 రోజుల వ్యాలిడిటీ, 2 జీబీ డేటా, 100 నిమిషాల వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.2,799 వార్షిక ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో 3 జీబీ డేటా, 100 నిమిషాల కాల్స్, 50 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తారు. రూ.2,899 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో 5 జీబీ డేటా, 200 నిమిషాల కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లతోపాటు ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంటుంది.

10 రోజుల వాలిడిటీతో ఉండే ప్లాన్‌లో..

100 దేశాల కవరేజ్ టియర్‌లో రూ.951 ప్లాన్ 10 రోజుల వ్యాలిడిటీతో 4 జీబీ డేటా, 200 నిమిషాల కాల్స్, 25 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. రూ.1,551 ప్లాన్‌లో 14 రోజుల వ్యాలిడిటీతో 8 జీబీ డేటా, 200 నిమిషాల కాల్స్, 50 ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. రూ.2,851 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో 12 జీబీ డేటా, 300 నిమిషాల కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.3,999 ప్లాన్‌లో 20 జీబీ డేటా, 250 నిమిషాల కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లతోపాటు ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటీ ఉంటుంది. రూ.5,999 ప్రీమియం ప్లాన్‌లో 30 జీబీ డేటా, 400 నిమిషాల కాల్స్, 500 ఎస్‌ఎంఎస్‌లు, ఇన్‌ఫ్లైట్ ప్రయోజనాలు 30 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. 75 దేశాల కవరేజ్ టియర్‌లో రూ.589 ప్లాన్ ఒక రోజు వ్యాలిడిటీతో 1 జీబీ డేటా, 100 నిమిషాల కాల్స్, 20 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. రూ.2,499 ప్లాన్ 10 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో ప్రతిరోజూ 1 జీబీ డేటా, 100 నిమిషాల కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. దీనితోపాటు ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. రూ.4,999 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 15 జీబీ డేటా, 1,500 నిమిషాల కాల్స్, 1,500 ఎస్‌ఎంఎస్‌లు, ఇన్‌ఫ్లైట్ సదుపాయం అందిస్తారు.

ఆరు దేశా రీజిన‌ల్ టియ‌ర్ ప్లాన్‌లో..

ఆరు దేశాల రీజినల్ టియర్‌లో రూ.1,555, రూ.2,555, రూ.3,455 ధరల్లో మూడు ప్లాన్లను జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల‌ను నిర్దిష్ట ప్రాంతాల్లో ప్రయాణించే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. తాజా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లతో విదేశీ ప్రయాణికులకు మరింత ఎక్కువ డేటా, స్పష్టమైన ప్లాన్ ఎంపికలు, అలాగే ఎంపిక చేసిన ప్రీమియం ప్లాన్లలో ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటీ వంటి అదనపు ప్రయోజనాలను అందించడంపై జియో దృష్టి పెట్టింది. పెరుగుతున్న డేటా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అదే ధరలకు మెరుగైన విలువను అందించే ప్రయత్నంగా ఈ కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది.

Advertisement
Advertisement