త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 5జి ఫీచ‌ర్ల‌తో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్‌.. ధ‌ర ఎంతంటే..

Motorola | మోటోరోలా భారత మార్కెట్లో తన కొత్త మిడ్ రేంజ్ ట్యాబ్లెట్ మోటో ప్యాడ్ 70ని అధికారికంగా విడుదల చేసింది. ఉత్పాదకత, క్రియేటివిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ట్యాబ్లెట్ స్లీక్‌ డిజైన్‌తోపాటు శక్తివంతమైన ఫీచర్లను అందిస్తోంది.

S

Technology | Published On Aug 8, 2026, 4.17 pm IST

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 5జి ఫీచ‌ర్ల‌తో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్‌.. ధ‌ర ఎంతంటే..
Advertisement

Motorola | మోటోరోలా భారత మార్కెట్లో తన కొత్త మిడ్ రేంజ్ ట్యాబ్లెట్ మోటో ప్యాడ్ 70ని అధికారికంగా విడుదల చేసింది. ఉత్పాదకత, క్రియేటివిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ట్యాబ్లెట్ స్లీక్‌ డిజైన్‌తోపాటు శక్తివంతమైన ఫీచర్లను అందిస్తోంది. 5జి కనెక్టివిటీ, పెద్ద డిస్‌ప్లే, మోటో పెన్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 16 వంటి ప్రత్యేకతలతో ఈ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. డిజైన్ పరంగా మోటో ప్యాడ్ 70 ఈ సెగ్మెంట్‌లో అత్యంత సన్నని, తేలికైన 5జి ట్యాబ్లెట్‌గా మోటోరోలా పేర్కొంది. దీని మందం కేవలం 6.29 మిల్లీమీటర్లే కాగా బరువు 530 గ్రాములు మాత్ర‌మే. సన్నని బెజెల్స్‌తో కూడిన ఆధునిక డిజైన్ దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఇందులో 12.1 ఇంచుల 2.5కె ఎల్‌సీడీ డిస్‌ప్లేని అందించారు. ఈ స్క్రీన్ 90 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్ ను ఇచ్చారు.

భారీ బ్యాట‌రీ..

దీర్ఘకాలం ఉపయోగించినా కళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు టీయూవీ రైన్‌ల్యాండ్ బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ క‌లిగిన క్వాడ్ స్పీకర్లును అందించారు. ఈ ట్యాబ్లెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. మోటోరోలా ఈ ట్యాబ్లెట్‌తో పాటు మోటో పెన్ ను బాక్స్‌లోనే అందిస్తోంది. ఇందులో 4096 ప్రెషర్ లెవల్స్, టిల్ట్ డిటెక్షన్, పామ్ రిజెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే మాగ్నెటిక్ స్నాప్-ఆన్ మోటో ఫోలియో కీబోర్డ్‌కు కూడా సపోర్ట్ ఉంది. ఇది పోగో-పిన్ కనెక్షన్ ద్వారా పీసీ తరహా అనుభవాన్ని అందిస్తుంది. దీంట్లో 10,200ఎంఏహెచ్ సామర్థ్యం క‌లిగిన భారీ బ్యాటరీని అందించారు. దీనికి 68 వాట్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా, ఛార్జర్ కూడా బాక్స్‌లోనే వ‌స్తుంది.

మ‌ల్టీ డివైస్ క‌నెక్టివిటీ..

సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ట్యాబ్‌ ఆండ్రాయిడ్ 16తో ప‌నిచేస్తుంది. దీనికి ఆండ్రాయిడ్ 18 వరకు రెండు ప్రధాన ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, అలాగే 2030 వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తామని మోటోరోలా ప్రకటించింది. అలాగే స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ద్వారా మోటోరోలా ఫోన్లు, ట్యాబ్లెట్‌లు, విండోస్ పీసీల మధ్య ఫైల్ షేరింగ్, స్క్రీన్ మిర్ర‌రింగ్, మల్టీ డివైస్ కనెక్టివిటీ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 13 మెగాపిక్స‌ల్ ఆటోఫోకస్ కెమెరాను అందించారు. ఇది ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌కు స‌పోర్ట్ ఇస్తుంది. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా 5జి, వైఫై 5, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఐపీ52 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చారు.

ధ‌ర ఎంతంటే..

మోటో ప్యాడ్ 70 పాంటోన్ సీ ఏంజెల్ రంగులో లభిస్తోంది. 8జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.33,999 ఉండ‌గా, 8జీబీ, 256జీబీ వేరియంట్ ధరను రూ.36,999గా నిర్ణయించారు. ఈ ట్యాబ్ ఆగస్టు 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ల‌భ్యం కానుంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు గరిష్టంగా రూ.5వేల వ‌రకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Advertisement
Advertisement