HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్‌స్క్రిప్షన్..
HP OmniPad 12 | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ హెచ్‌పీ భారత మార్కెట్లో కొత్త హెచ్‌పీ ఓమ్నిప్యాడ్ 12 ట్యాబ్‌ను విడుదల చేసింది. విద్య, ఉద్యోగ అవసరాలు, రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా భారత వినియోగదారుల కోసం రూపొందించిన తొలి డివైస్‌గా కంపెనీ దీనిని పరిచయం చేసింది.
HP OmniPad 12 | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ హెచ్‌పీ భారత మార్కెట్లో కొత్త హెచ్‌పీ ఓమ్నిప్యాడ్ 12 ట్యాబ్‌ను విడుదల చేసింది. విద్య, ఉద్యోగ అవసరాలు, రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా భారత వినియోగదారుల కోసం రూపొందించిన తొలి డివైస్‌గా కంపెనీ దీనిని పరిచయం చేసింది. విద్యార్థులు, మొదటిసారి ట్యాబ్లెట్ కొనుగోలు చేసే వినియోగదారులు, ఎంఎస్‌ఎంఈలు, యువ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ట్యాబ్లెట్‌ను రూపొందించారు. ఇందులో ఐడ్రీమ్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఐప్రెప్, స్టడీమ్యాటిక్స్‌కు చెందిన లెక్సిలియన్, బ్రాండ్స్.లైవ్ వంటి విద్యా, నైపుణ్యాభివృద్ధి యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌పీ ఓమ్నిప్యాడ్ 12లో 12 ఇంచుల 2కె మల్టీ టచ్ డిస్‌ప్లేను అందించారు. గరిష్టంగా 400 నిట్స్ బ్రైట్‌నెస్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తోపాటు, 8 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను గరిష్టంగా 1 టెరాబైట్ వరకు పెంచుకోవచ్చు.
18 గంటల బ్యాటరీ బ్యాకప్..
ఈ ట్యాబ్లెట్ ను ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే గరిష్టంగా 18 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని హెచ్‌పీ తెలిపింది. హెచ్‌పీ ఫాస్ట్ చార్జ్ సపోర్ట్‌తో కేవలం 90 నిమిషాల్లో 0 నుంచి 90 శాతం వరకు చార్జ్ అవుతుంది. ట్యాబ్లెట్ బరువు 600 గ్రాములు కాగా, డిటాచబుల్ కీబోర్డ్ బరువు 590 గ్రాములు. కీబోర్డ్‌ను వినియోగదారులు అవసరాన్ని బట్టి విడిగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో వినియోగించిన కీబోర్డ్ పోస్ట్ కన్జ్యూమర్ రీసైకిల్ మెటీరియల్స్‌తో తయారైంది. ట్యాబ్లెట్‌లో రీసైకిల్ అల్యూమినియంను కూడా ఉపయోగించారు. ఆడియో, వీడియో కాల్స్ కోసం ఇందులో డీటీఎస్ అల్ట్రాతో కూడిన క్వాడ్ స్పీకర్లు, డ్యుయల్ హై ఎస్‌ఎన్‌ఆర్ మైక్రోఫోన్లు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ కోసం వైఫై 6ఇ, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి 2.0 పోర్ట్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. అలాగే ఈపీఈఏటీ సిల్వర్ రిజిస్ట్రేషన్, ఎనర్జీ స్టార్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది.
ధర ఎంతంటే..
హెచ్‌పీ ఓమ్నిప్యాడ్ 12లో 2 సెల్ 31 వాట్ అవర్ లిథియమ్ అయాన్ పాలిమర్ బ్యాటరీ, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, హాల్ ఎఫెక్ట్ సెన్సార్, ఆంబియంట్ లైట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిటాచబుల్ సాఫ్ట్ కవర్ కీబోర్డ్ పోగో పిన్ కనెక్టర్ ద్వారా ట్యాబ్లెట్‌కు అనుసంధానమవుతుంది. కంపెనీ ఈ డివైస్‌పై ఒక సంవత్సరం పరిమిత వారంటీని అందిస్తోంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.48,999 ఉండగా, 256 జీబీ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. ఈ ట్యాబ్లెట్ డెనిమ్ బ్లూ, మీటియర్ సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. హెచ్‌పీ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్, క్రోమా, విజయ్ సేల్స్, హెచ్‌పీ వరల్డ్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.5వేల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు. అలాగే సుమారు రూ.96వేల విలువైన ఒక సంవత్సరం ఏఐ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో జీపీటీ 5, క్లాడ్ 4, జెమిని 2.5, పర్‌ప్లెక్సిటీ, గ్రోక్ 4, డీప్‌సీక్ వంటి ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
ఆగస్టు 8, 2026

Redmi Note 17 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్మీ నోట్ 17.. భారత్‌లో లాంచ్..
ఆగస్టు 6, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
- ●Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
- ●Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ



