Claude AI | అమెరికాలో క్లాడ్ ఏఐ బూమ్.. రికార్డు స్థాయిలో పెరిగిన పెయిడ్ యూజర్లు..
Claude AI | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) తన క్లాడ్ (Claude) ఏఐ టూల్ ద్వారా అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్లాడ్ ఏఐ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
Technology | Published On Mar 29, 2026, 3.51 pm IST
Claude AI | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) తన క్లాడ్ (Claude) ఏఐ టూల్ ద్వారా అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్లాడ్ ఏఐ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అనేక క్లిష్టమైన టాస్క్‌లను కూడా సులభంగా పూర్తి చేయడంతోపాటు మనిషి పనిచేసినట్లుగానే వివిధ రకాల పనులను చేస్తుండడంతో క్లాడ్ దెబ్బకు చాలా ఉద్యోగాలు భవిష్యత్తులో మాయం అవుతాయని కూడా పలు రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆంథ్రోపిక్ కు చెందిన క్లాడ్ కారణంగా దేశీయ, విదేశీయ ఐటీ సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆంథ్రోపిక్‌తో పోటీ పడేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అయితే ఆంథ్రోపిక్ క్లాడ్ గురించి తాజాగా మరో విషయం వెల్లడైంది. అమెరికాలో క్లాడ్ ఏఐని వాడుతున్న పెయిడ్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని టెక్ క్రంచ్ కోసం ఇందగరి అనే సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది.
భారీ ఎత్తున పెరుగుతున్న పెయిడ్ యూజర్లు..
అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌తో ఆంథ్రోపిక్ ఇటీవలే వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అమెరికా పౌరుల డేటాను స్వార్థ ప్రయోజనాలకు వాడబోమని, వారిపై నిఘా ఉంచలేమని ఆంథ్రోపిక్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల్లోనూ క్లాడ్ సేవలను రానున్న రోజుల్లో నిర్దిష్ట కాలంలోగా నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆదేశించారు. దీంతో ట్రంప్ నిర్ణయం చాలా మంది అమెరికన్లకు నచ్చలేదు. ఈ క్రమంలోనే వారు ఆంథ్రోపిక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ సంఘటన జరిగిన వారం రోజుల్లోనే అమెరికాలో భారీ ఎత్తున యూజర్లు క్లాడ్ ఏఐ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోగా ఆ యాప్ యాపిల్ యాప్ స్టోర్ టాప్ డౌన్ లోడెడ్ యాప్స్ చార్టులో మొదటి స్థానానికి ఎగబాకింది. అయితే కథ అక్కడితో ముగియలేదు. క్లాడ్‌కు ప్రస్తుతం భారీ ఎత్తున పెయిడ్ యూజర్లు కూడా పెరుగుతున్నారని నివేదికలో వెల్లడైంది.
3 కోట్లకు చేరిక..
సుమారు 2.80 కోట్ల అమెరికన్ యూజర్లు బిలియన్ల సంఖ్యలో గోప్యమైన క్రెడిట్ కార్డు లావాదేవీలను ఆంథ్రోపిక్ ప్లాట్‌ఫామ్‌లో నిర్వహించారని ఇందగరి సంస్థ చేసిన విశ్లేషణలో తేలింది. ఈ క్రమంలోనే క్లాడ్‌కు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్న యూజర్ల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరిగిందని ఆ సంస్థ స్పష్టం చేసింది. డేటా విశ్లేషణ ప్రకారం 1.80 కోట్లుగా ఉన్న పెయిడ్ యూజర్ల సంఖ్య 3 కోట్ల వరకు చేరిందని అంచనా వేసింది. అయితే ఈ డేటా విశ్లేషణకు కొన్ని పరిమితులు ఉన్నాయని, చాలా వరకు కచితత్వంతోనే ఈ విశ్లేషణ చేసినా కొంత వరకు విలువ అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే క్లాడ్ ఏఐ ని ఫ్రీగా వాడే యూజర్లను ఈ జాబితాలో చేర్చలేదని తెలిపింది.
క్లాడ్ ఏఐ బూమ్‌కి కారణాలు ఇవే..
క్లాడ్ ఏఐ కి జనవరి నుంచి ఫిబ్రవరి నెలల్లో అమెరికాలో పెయిడ్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. పాత యూజర్లు కూడా ఫిబ్రవరిలో మళ్లీ పెద్ద సంఖ్యలో క్లాడ్ ఏఐకి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నట్లు వెల్లడైంది. ఇందగరి తెలిపిన ప్రకారం కొత్త సబ్‌స్క్రైబర్లలో ఎక్కువ మంది తక్కువ ధర కలిగిన ప్రొ ప్లాన్‌ను ఎంచుకుంటున్నట్లు తేలింది. ఈ ప్లాన్ అమెరికాలో నెలకు సుమారు 20 డాలర్లుగా ఉంది. అయితే 100 లేదా 200 డాలర్ల ప్రీమియం ప్లాన్లతో పోలిస్తే ఈ ప్లాన్ ధర చాలా తక్కువగా ఉండడం విశేషం. ఇక మార్చి నెలలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఈ నెలలోనూ క్లాడ్ ఏఐ కి పెయిడ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. అయితే అమెరికా ప్రభుత్వంతో నెలకొన్న వివాదంతోపాటు ఇటీవల ఆంథ్రోపిక్ విడుదల చేసిన క్లాడ్ కోడ్, క్లాడ్ కో వర్క్ వంటి ఏఐ టూల్స్ కూడా క్లాడ్ ఏఐ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య పెరిగేందుకు కారణం అయ్యాయని గుర్తించారు. ఈ మధ్యనే కంప్యూటర్ యూజ్ అనే ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఇది కూడా యూజర్లలో ఆసక్తిని కలిగించింది. ఈ టూల్ సహాయంతో కేవలం యూజర్ ఆదేశాలతో యూజర్ పీసీని క్లాడ్ ఏఐ నియంత్రిస్తుంది. యూజర్ చేయాల్సిన పనులను చేస్తుంది. ఎప్పటికప్పుడు ఇలా క్లాడ్ ఏఐ అద్భుతమైన టూల్స్‌ను అందించడం కూడా ఆ సంస్థ ఎదుగుదలకు కారణమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






