త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Realme | రియ‌ల్‌మి ప‌వ‌ర్ డేస్ సేల్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌లకు ఫోన్లు..

Realme | మొబైల్స్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మి వ‌వ‌ర్ డేస్ సేల్‌ను ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ప్రత్యేక సేల్‌లో ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ధర తగ్గింపులు, కూపన్ డిస్కౌంట్లు, అలాగే నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

S

Technology | Published On Jul 21, 2026, 12.29 pm IST

Realme | రియ‌ల్‌మి ప‌వ‌ర్ డేస్ సేల్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌లకు ఫోన్లు..
Advertisement

Realme | మొబైల్స్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మి వ‌వ‌ర్ డేస్ సేల్‌ను ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ప్రత్యేక సేల్‌లో ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ధర తగ్గింపులు, కూపన్ డిస్కౌంట్లు, అలాగే నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో వినియోగదారులు రియల్‌మి పి4 పవర్ 5జి, రియల్‌మి పి4 ప్రొ 5జి, రియల్‌మి పి4ఆర్ 5జి మోడళ్లను ప్రత్యేక ఆఫర్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి పి4 పవర్ 5జిలో 10,001ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5జి ప్రాసెసర్, హైపర్‌విజన్ ప్లస్ ఏఐ చిప్, అలాగే పర్ల్ అకాడమీతో కలిసి రూపొందించిన ట్రాన్స్‌వ్యూ డిజైన్ ఉన్నాయి. 8జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.29,999 కాగా ఆఫర్ కింద రూ.27,999కు ఇస్తున్నారు. అలాగే 8జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.31,999 ఉండ‌గా, రూ.29,999కు ఇస్తున్నారు. 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.34,999 నుంచి రూ.32,999కు త‌గ్గింది. దీనిపై రూ.2వేల కూపన్ డిస్కౌంట్ ను సైతం పొంద‌వ‌చ్చు. 9 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందుబాటులో ఉంది.

రియ‌ల్‌మి పి4 ప్రొ 5జి..

రియ‌ల్‌మి పి4 ప్రొ 5జి ఫోన్‌లో స్నాప్ డ్రాగ‌న్ 7జెన్ 4 ప్రాసెస‌ర్‌, హైప‌ర్ విజన్ ఏఐ చిప్‌సెట్‌, 144 హెడ్జ్ హైప‌ర్ గ్లో అమోలెడ్ 4డి క‌ర్వ్‌డ్ డిస్‌ప్లే, 7000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.28,999 నుంచి రూ.26,999కు త‌గ్గింది. 8జీబీ, 256జీబీ వేరియెంట్‌ను రూ.30,999కు బ‌దులుగా రూ.28,999కి ఇస్తున్నారు. అలాగే 12జీబీ, 256జీబీ వేరియెంట్‌ను రూ.32,999కు బ‌దులుగా రూ.30,999కు ఇస్తున్నారు. ఈ మోడ‌ల్‌పై రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంది. 6 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ ఆఫ‌ర్‌ను ఇచ్చారు.

రియ‌ల్‌మి పిఆర్ 5జి..

రియ‌ల్‌మి పిఆర్ 5జి ఫోన్‌లో 8000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ, 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, 144 హెడ్జ్ డిస్‌ప్లే, నెక్ట్స్ ఏఐ ఫీచ‌ర్లు, గూగుల్ జెమిని ఏఐ వంటి ఫీచ‌ర్లు ఉండ‌గా, ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర త‌గ్గింపు అనంతరం రూ.18,999గా ఉంది. 6జీబీ, 128జీబీ వేరియెంట్‌ను రూ.20,999, 6జీబీ, 256జీబీ వేరియెంట్ ను రూ.22,999కు ఇస్తున్నారు. 3 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా ఉంది. ఈ సేల్ మంగ‌ళ‌వారం ప్రారంభం కాగా ఈ నెల 24 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. రియ‌ల్‌మి ఆన్ లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్‌ను నిర్వ‌హిస్తున్నారు.

Advertisement
Advertisement