realme NARZO 100x 5G | రియల్‌మీ నార్జో 100ఎక్స్ 5జి లాంచ్.. 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో గేమర్లకు కొత్త ఆప్షన్..
realme NARZO 100x 5G | రియల్‌మీ తన నార్జో సిరీస్‌లో భాగంగా కొత్త రియల్‌మీ నార్జో 100ఎక్స్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, బలమైన బిల్డ్ క్వాలిటీ, సమర్థవంతమైన పనితీరుపై దృష్టి పెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ నార్జో సిరీస్‌ను మరింత విస్తరించింది.
Technology | Published On Jul 15, 2026, 5.11 pm IST
realme NARZO 100x 5G | రియల్‌మీ తన నార్జో సిరీస్‌లో భాగంగా కొత్త రియల్‌మీ నార్జో 100ఎక్స్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, బలమైన బిల్డ్ క్వాలిటీ, సమర్థవంతమైన పనితీరుపై దృష్టి పెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ నార్జో సిరీస్‌ను మరింత విస్తరించింది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జి ప్రాసెసర్‌ను అందించారు. 6 నానోమీటర్ తయారీ ప్రక్రియతో రూపొందిన ఈ చిప్‌సెట్‌లో 2.4 గిగాహెడ్జ్ వేగంతో పనిచేసే రెండు కార్టెక్స్-ఏ76 కోర్స్ ఉంటాయి. 2.0 గిగాహెడ్జ్ వేగంతో పనిచేసే ఆరు కార్టెక్స్-ఏ55 సామర్థ్య కోర్స్ ఉన్నాయి. భారీ లోడ్‌లో కూడా ఫోన్ ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు 5,300 చదరపు మిల్లీమీటర్ల వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు.
భారీ బ్యాటరీ..
ఇందులో గరిష్టంగా 6జీబీ ర్యామ్ లభిస్తుంది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ టెక్నాలజీ ద్వారా అదనపు వర్చువల్ ర్యామ్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే 256జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 8,000ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీ. సాధారణ వినియోగంలో నాలుగు సంవత్సరాల తర్వాత కూడా బ్యాటరీ తన అసలు సామర్థ్యంలో 80 శాతానికి పైగా నిలుపుకుంటుందని రియల్‌మీ తెలిపింది. 45వాట్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉండగా, 0 నుంచి 50 శాతం వరకు బ్యాటరీని సుమారు 33 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్‌తోపాటు ఛార్జింగ్ సమయంలో ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. అలాగే 13.5వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ ఫోన్‌తో ఛార్జ్ చేయవచ్చు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 8.88 మిల్లీమీటర్లు మాత్రమే కాగా, బరువు 224 గ్రాములుగా ఉంది.
పవర్ ఫుల్ కెమెరాలు..
ముందు భాగంలో 6.81 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 1570×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తోపాటు 144హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 180హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 1,200 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్ ను ఇస్తుంది. డిస్‌ప్లేకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ను అందించారు. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో పంచ్-హోల్ డిజైన్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ముందు, వెనుక కెమెరాలతో 1080పి 30ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0తో వస్తుంది. ఇందులో జెమినీ లైవ్ సపోర్ట్, ఏఐ నోట్స్ అసిస్టెంట్, ఏఐ ఎరేసర్ వంటి ఏఐ ఫీచర్లను అందించారు.
ధర ఎంతంటే..
ఈ ఫోన్‌కు ఐపీ65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు. అలాగే రియల్‌మీ ఆర్మర్‌షెల్ స్ట్రక్చరల్ చాసిస్, ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఏఐ పల్స్ లైట్ నోటిఫికేషన్ సిస్టమ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. రియల్‌మీ నార్జో 100ఎక్స్ 5జి 4జీబీ, 128జీబీ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. బ్యాంక్ డిస్కౌంట్ రూ.2వేలతోపాటు రూ.500 కూపన్ ఆఫర్ తర్వాత ఈ మోడల్‌ను రూ.18,499కు కొనుగోలు చేయవచ్చు. 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.22,999 ఉండగా, ఆఫర్ ధర రూ.20,499గా ఉంది. 6జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. ఆఫర్ల తర్వాత రూ.22,499కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ను జూలై 22 నుంచి అమెజాన్ ఇండియా, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ప్రధాన రిటైల్ స్టోర్లలో విక్రయించనున్నారు.
సంబంధిత వార్తలు

realme Watch S5 | రూ.7,499కే రియల్‌మి వాచ్ ఎస్5.. జీపీఎస్, అమోలెడ్ డిస్ప్లేతో అదిరిపోయిన ఫీచర్లు..
మే 22, 2026

realme NARZO Days Sale | రియల్‌మి నార్జో డేస్ సేల్.. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
ఏప్రిల్ 24, 2026

realme NARZO 100 Lite 5G | భారీ బ్యాటరీ, ప్రత్యేక కూలింగ్ సిస్టమ్.. బడ్జెట్ ధరకే రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●SIR | తెలంగాణలో సర్ గడువు పొడిగింపు.. ఆగస్టు 3 వరకు బీఎల్వో ఇంటికొస్తారు
- ●Telangana | తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల డిస్పాచ్
- ●Supriya Sule | ఆ బిల్లుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : సుప్రియా సూలే
- ●India - UK CETA | అమల్లోకి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం.. హైదరాబాద్ నుంచి కంటైనర్లు ప్రారంభం
- ●Mouni Roy | ఆపండి..! పాపరాజీలపై నాగిని బ్యూటీ మౌనీరాయ్ ఆగ్రహం..!
- ●Vinod Kumar | ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌ను సాకుగా చూపకండి సీఎం రేవంత్ : మాజీ ఎంపీ వినోద్

SIR | తెలంగాణలో సర్ గడువు పొడిగింపు.. ఆగస్టు 3 వరకు బీఎల్వో ఇంటికొస్తారు

Telangana | తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల డిస్పాచ్

Supriya Sule | ఆ బిల్లుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : సుప్రియా సూలే

India - UK CETA | అమల్లోకి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం.. హైదరాబాద్ నుంచి కంటైనర్లు ప్రారంభం



