realme Watch S5 | రూ.7,499కే రియల్‌మి వాచ్ ఎస్5.. జీపీఎస్, అమోలెడ్ డిస్‌ప్లేతో అదిరిపోయిన ఫీచర్లు..
realme Watch S5 | రియల్‌మి భారత మార్కెట్లో తన స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుతూ కొత్తగా రియల్‌మి వాచ్ ఎస్5 ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.43 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 466*466 రిజల్యూషన్, 302 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 79 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది.
Technology | Published On May 22, 2026, 2.54 pm IST
realme Watch S5 | రియల్‌మి భారత మార్కెట్లో తన స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుతూ కొత్తగా రియల్‌మి వాచ్ ఎస్5 ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.43 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 466*466 రిజల్యూషన్, 302 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 79 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. అలాగే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్‌లో అల్యూమినియం అల్లాయ్ డయల్‌తోపాటు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. స్ట్రాప్‌తో కలిపి దీని బరువు సుమారు 49.63 గ్రాములు ఉంటుంది. 22ఎంఎం రిమూవబుల్ సిలికా జెల్ స్ట్రాప్‌లను అందించారు. ఇది శాండ్ వైట్, రాక్ గ్రే రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఫిట్‌నెస్, యాక్టివిటీ ట్రాకింగ్ కోసం ఇందులో ఇండిపెండెంట్ జీపీఎస్‌తోపాటు ఐదు గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లకు సపోర్ట్ ఉంది. అలాగే 110కిపైగా స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.
అనేక రకాల ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకర్స్..
ఫిట్‌నెస్ ఫీచర్లలో రన్నింగ్ కోర్సులు, స్ట్రెచింగ్ గైడ్స్, వీవో 2 మ్యాక్స్ ట్రాకింగ్, ఏరోబిక్ ట్రైనింగ్ ఎఫెక్ట్ అనాలిసిస్, రికవరీ డ్యూరేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ ర్యాంకింగ్స్, ఆటో వర్కౌట్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఇది వాకింగ్, రన్నింగ్, ఎలిప్టికల్, రోయింగ్ మెషిన్ వర్కౌట్‌లను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. రోజువారీ యాక్టివిటీ ట్రాకింగ్‌లో స్టెప్స్, క్యాలరీలు, దూరం, స్టాండింగ్ రిమైండర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. హార్ట్ రేట్, ఎస్పీవో2, స్లీప్, స్ట్రెస్, నాయిస్ మానిటరింగ్ ఫీచర్లను కూడా అందించారు. బ్రీతింగ్ ట్రైనింగ్, సెడెంటరీ రిమైండర్లు కూడా ఇందులో ఉన్నాయి. వినియోగదారులు ఒక్క ట్యాప్‌తోనే హార్ట్ రేట్, ఎస్పీవో2, స్ట్రెస్ ను చెక్ చేసుకోవచ్చు. మహిళల ఆరోగ్య ట్రాకింగ్‌కు రియల్‌మి లింక్ యాప్ ద్వారా సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ కాలింగ్, ఇండిపెండెంట్ బీటీ ఇంటర్‌కామ్, మెసేజ్ నోటిఫికేషన్లు, వెదర్ అప్‌డేట్స్, ఈవెంట్ రిమైండర్లు, అలారం క్లాక్, స్టాప్‌వాచ్, కాలిక్యులేటర్, క్లౌడ్ వాచ్ ఫేస్‌లు, ఫోటో ఆల్బమ్ వాచ్ ఫేస్‌లు, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో పనిచేస్తుంది.
ధర వివరాలు..
ఈ స్మార్ట్‌వాచ్‌లో 460 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. సాధారణ వినియోగంతో 16 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. కస్టమైజబుల్ లైట్ స్మార్ట్ మోడ్‌లో 20 రోజుల వరకు బ్యాటరీ పనిచేస్తుందని తెలిపింది. మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇది సుమారు 2.5 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. అలాగే 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. భారత మార్కెట్లో రియల్‌మి వాచ్ ఎస్5 ధరను రూ.7,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్‌లో రూ.500 డిస్కౌంట్‌తో రూ.7,499కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్ జూన్ 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 7 రాత్రి 11:59 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఇండియా ఆన్‌లైన్ స్టోర్, మెయిన్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం వాచ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
సంబంధిత వార్తలు

realme NARZO 100x 5G | రియల్మీ నార్జో 100ఎక్స్ 5జి లాంచ్.. 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో గేమర్లకు కొత్త ఆప్షన్..
జులై 15, 2026

WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..
జులై 10, 2026

Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Sotheby | రూ.482 కోట్లకు అమ్ముడైన డైనోసర్ అస్థిపంజరం.. ప్రపంచ రికార్డు సృష్టించిన గస్..!
- ●ICC ODI World Cup | వన్డే వరల్డ్ కప్ 2027 ఫార్మాట్లో భారీ మార్పులు.. సూపర్ సిరీస్, సూపర్-7కి ఐసీసీ శ్రీకారం
- ●KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- ●KTR | ఇంకెవరో టీఆర్ఎస్ను తీసుకుంటామంటే ఒప్పుకోం.. బంధం కంటే పార్టీనే ముఖ్యం : కేటీఆర్
- ●Priyanka Chopra | ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. 14 నెలలుగా అదే పనిలో ఉన్నానంటూ..!
- ●Telangana Education Kit | విద్యార్థులకు శుభవార్త.. పంద్రాగస్టు లోపు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్

Sotheby | రూ.482 కోట్లకు అమ్ముడైన డైనోసర్ అస్థిపంజరం.. ప్రపంచ రికార్డు సృష్టించిన గస్..!

ICC ODI World Cup | వన్డే వరల్డ్ కప్ 2027 ఫార్మాట్లో భారీ మార్పులు.. సూపర్ సిరీస్, సూపర్-7కి ఐసీసీ శ్రీకారం

KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR | ఇంకెవరో టీఆర్ఎస్ను తీసుకుంటామంటే ఒప్పుకోం.. బంధం కంటే పార్టీనే ముఖ్యం : కేటీఆర్



