realme Pad 3 | 12,200 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన రియల్‌మి కొత్త ట్యాబ్.. ధర తక్కువే..!
realme Pad 3 | మొబైల్స్ తయారీదారు రియల్‌మి భారత మార్కెట్‌లో కొత్తగా రియల్‌మి 16 ప్రొ సిరీస్ పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లను మిడ్‌రేంజ్ సెజ్‌మెంట్‌లో లాంచ్ చేసినా వాటిల్లో ఫ్లాగ్ షిప్ రేంజ్ ఫీచర్లను అందిస్తున్నారు.
Technology | Published On Jan 7, 2026, 12.37 pm IST
realme Pad 3 | మొబైల్స్ తయారీదారు రియల్‌మి భారత మార్కెట్‌లో కొత్తగా రియల్‌మి 16 ప్రొ సిరీస్ పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లను మిడ్‌రేంజ్ సెజ్‌మెంట్‌లో లాంచ్ చేసినా వాటిల్లో ఫ్లాగ్ షిప్ రేంజ్ ఫీచర్లను అందిస్తున్నారు. ఇక తాజాగా రియల్‌మి సంస్థ రియల్‌మి ప్యాడ్ 3 పేరిట ఓ నూతన మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను కూడా భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. రియల్‌మి ప్యాడ్ 3 ఆండ్రాయిడ్ ట్యాబ్‌లో 11.6 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 2.8కె రిజల్యూషన్‌ను కలిగి ఉంది. కనుక డిస్‌ప్లే చాలా అద్భుతమైన క్వాలిటీని, నాణ్యమైన దృశ్యాలను అందిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ 5జి చిప్‌సెట్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. 5జి సదుపాయం కూడా ఉంది. ఇంటర్నెట్ కోసం ఇందులో 5జి సిమ్‌ను వేసుకోవచ్చు.
భారీ బ్యాటరీ..
ఈ ట్యాబ్‌ను అత్యంత పలుచని డిజైన్‌తో కేవలం 6.6 మిల్లీమీటర్ల మందంతో తీర్చిదిద్దారు. కనుక ఈ ట్యాబ్ చాలా తేలిగ్గా ఉంటుంది. ఎక్కడికంటే అక్కడికి దీన్ని సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ ట్యాబ్‌కు ముందు, వెనుక రెండు వైపులా 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాను ఇచ్చారు. 12,200 ఎంఏహెచ్ భారీ కెసాసిటీ ఉన్న బ్యాటరీని ఈ ట్యాబ్‌లో ఏర్పాటు చేశారు. ఇదే దీనికి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. దీని వల్ల ట్యాబ్ మరింత ఎక్కువ సమయం పాటు బ్యాటరీ బ్యాకప్ ను ఇస్తుంది. ఎక్కువ సమయం పాటు ఆటంకం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ ట్యాబ్‌కు 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇచ్చారు. కనుక దీన్ని వేగంగా చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే 6.5 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్‌కు కూడా ఇందులో సపోర్ట్ లభిస్తుంది. దీని సహాయంతో ఇతర డివైస్‌లను కూడా చార్జింగ్ చేయవచ్చు.
ధర వివరాలు..
ఈ ట్యాబ్ డిస్‌ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తుంది. కనుక డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. 8జీబీ ర్యామ్‌ను ఇందులో ఇచ్చారు. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ట్యాబ్ లాంచ్ అయింది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. 5జి, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు. రియల్ మి ప్యాడ్ 3 ఆండ్రాయిడ్ ట్యాబ్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వైఫై మోడల్ ధర రూ.26,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 5జి మోడల్ ధర రూ.29,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ 5జి మోడల్ ధరను రూ.31,999గా నిర్ణయించారు. ఈ మోడల్స్ అన్నింటిపై రూ.2వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌ను ఫ్లిప్ కార్ట్‌తోపాటు రియల్‌మి ఆన్ లైన్ స్టోర్‌లో, అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్‌లో జనవరి 16వ తేదీ నుంచి విక్రయించనున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026

moto g37 and g37 Power | భారత్‌లో లాంచ్ అయిన మోటో జి37 సిరీస్.. భారీ బ్యాటరీతో అదిరిపోయిన ఫీచర్లు..
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



