త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Motorola Edge 60 Pro | రూ.14వేలు త‌గ్గిన మోటోరోలా ఎడ్జ్‌60 ప్రొ స్మార్ట్ ఫోన్‌.. ఎందులో కొనాలంటే..?

Motorola Edge 60 Pro | మిడ్‌రేంజ్ సెజ్‌మెంట్‌లో భారీ బ్యాట‌రీ, అద్భుత‌మైన డిస్ ప్లే, వేగ‌వంత‌మైన ప్రాసెస‌ర్ వంటి ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ ఫోన్ మీ కోస‌మే. దీనిపై ఇప్పుడు డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. క‌నుక ఈ ఫోన్ మీకు స‌రిగ్గా సెట్ అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

S

Technology | Published On Jan 5, 2026, 7.15 am IST

Motorola Edge 60 Pro | రూ.14వేలు త‌గ్గిన మోటోరోలా ఎడ్జ్‌60 ప్రొ స్మార్ట్ ఫోన్‌.. ఎందులో కొనాలంటే..?
Advertisement

Motorola Edge 60 Pro | మిడ్‌రేంజ్ సెజ్‌మెంట్‌లో భారీ బ్యాట‌రీ, అద్భుత‌మైన డిస్ ప్లే, వేగ‌వంత‌మైన ప్రాసెస‌ర్ వంటి ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ ఫోన్ మీ కోస‌మే. దీనిపై ఇప్పుడు డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. క‌నుక ఈ ఫోన్ మీకు స‌రిగ్గా సెట్ అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఆ ఫోన్ మ‌రేంటో కాదు.. మోటోరాలాకు చెందిన ఎడ్జ్ 60 ప్రొ స్మార్ట్ ఫోన్‌. ఈ ఫోన్ ను ఏప్రిల్ 2025లో లాంచ్ చేశారు. ధ‌ర రూ.33,999గా ఉంది. కానీ దీన్ని రూ.20వేల లోపు ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అంటే ఏకంగా రూ.14వేల వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంద‌న్న‌మాట‌. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తుండ‌గా దీనికి చెందిన 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది. ఇదే ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

రూ.20లోపు ధ‌ర‌..

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రొ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.33,999 ఉండ‌గా ప్ర‌స్తుతం ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.29,999కు లిస్టింగ్ చేశారు. అంటే రూ.4వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఇస్తున్నార‌న్న‌మాట‌. ఇక బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల‌ను క‌లిపితే ఫోన్ ధ‌ర మ‌రింత త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలోనే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. అంటే రూ.750 వ‌ర‌కు త‌గ్గింపు పొంద‌వ‌చ్చ‌న్న‌మాట‌. దీంతో ఫోన్ ధ‌ర రూ.29,249 అవుతుంది. ఇక మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఫోన్ మోడ‌ల్‌ను బ‌ట్టి ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధ‌ర రూ.19,799కు త‌గ్గుతుంది. ఇలా ఈ ఫోన్‌పై రూ.14వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో అత్యంత త‌క్కువ ధ‌ర‌కు ఈ ఫోన్ ల‌భిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు..

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రొ స్మార్ట్ ఫోన్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను సైతం అందిస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఇవ్వ‌గా, 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ ల‌భిస్తుంది. 6.7 ఇంచుల పోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 1.5కె రిజ‌ల్యూష‌న్ ఉంది. క‌నుక డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను పొంద‌వ‌చ్చు. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. ఐపీ69 వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, 10 మెగాపిక్స‌ల్ టెలిఫొటో లెన్స్‌ను ఇచ్చారు. దీని స‌హాయంతో 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ ల‌భిస్తుంది. ముందు వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఇందులో ల‌భిస్తుంది. అలాగే దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు, 15వాట్ల వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ కూడా ల‌భిస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement