త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Realme 16 Pro | రియ‌ల్‌మి 16 ప్రొ సిరీస్ ఫోన్లు వ‌చ్చేశాయి.. ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఫీచ‌ర్లు..

Realme 16 Pro | మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో రియ‌ల్‌మి సంస్థ మ‌రో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రియ‌ల్ మి 16 ప్రొ సిరీస్‌లో ఈ ఫోన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మిడ్ రేంజ్ ధ‌రే అయిన‌ప్ప‌టికీ ఈ ఫోన్ల‌లో ఫ్లాగ్ షిప్ రేంజ్‌లో లాంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తుండ‌డం విశేషం.

S

Technology | Published On Jan 7, 2026, 6.29 am IST

Realme 16 Pro | రియ‌ల్‌మి 16 ప్రొ సిరీస్ ఫోన్లు వ‌చ్చేశాయి.. ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఫీచ‌ర్లు..
Advertisement

Realme 16 Pro | మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో రియ‌ల్‌మి సంస్థ మ‌రో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రియ‌ల్ మి 16 ప్రొ సిరీస్‌లో ఈ ఫోన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మిడ్ రేంజ్ ధ‌రే అయిన‌ప్ప‌టికీ ఈ ఫోన్ల‌లో ఫ్లాగ్ షిప్ రేంజ్‌లో లాంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తుండ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే రియ‌ల్‌మి 16 ప్రొ, 16 ప్రొ ప్ల‌స్ ఫోన్ల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. ఫొటోగ్ర‌ఫీ ప్ర‌ధాన ఫీచ‌ర్‌గా ఈ ఫోన్ల‌ను లాంచ్ చేశారు. అలాగే ప‌లు ఇత‌ర ఫీచ‌ర్లు కూడా వీటిల్లో ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల‌లోనూ వెనుక వైపు 200 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ల‌భిస్తున్న అత్యంత భారీ కెపాసిటీ క‌లిగిన కెమెరాల్లో ఒక‌టిగా చెప్ప‌వ‌చ్చు. రియ‌ల్ మి16 ప్రొ ప్ల‌స్ ఫోన్‌కు 3.5ఎక్స్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌ను ఇచ్చారు. దీని వ‌ల్ల అద్భుత‌మైన జూమ్ ల‌భిస్తుంది. ఇక రియ‌ల్‌మి 16 ప్రొలోనూ 200 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. గోల్డెన్ పోర్ట్రెయిట్ లెన్స్ కిట్ ఆధారంగా ఈ కెమెరా ప‌నిచేస్తుంది.

ఏఐతో సుల‌భంగా ఫొటోల ఎడిటింగ్‌..

ఈ రెండు ఫోన్ల‌లోనూ అధునాత‌న ఇమేజింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఫొటోలు, వీడియోల‌ను అద్భుత‌మైన క్వాలిటీతో చిత్రీక‌రించుకోవ‌చ్చు. ప్ర‌ధానంగా కంటెంట్ క్రియేట‌ర్ల‌కు ఈ ఫోన్లు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డ‌తాయ‌ని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్ల‌లో ఉన్న వైబ్ మాస్ట‌ర్ మోడ్ ద్వారా 5 ర‌కాల సిగ్నేచ‌ర్ పోర్ట్రెయిట్ స్టైల్స్ ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే ఏఐ ఎడిట్ జీనీ అనే ఏఐ ఫొటో ఎడిటింగ్ ఫీచ‌ర్‌ను కూడా ఈ ఫోన్ల‌లో అందిస్తున్నారు. యూజ‌ర్లు వాయిస్ లేదా టెక్ట్స్ క‌మాండ్ల స‌హాయంతో ఫొటోల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు. అలాగే ఏఐ లైట్ మి, స్టైల్ మి అనే మ‌రో రెండు ఏఐ ఫొటో ఎడిటింగ్ ఫీచ‌ర్లు కూడా వీటిల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి స‌హాయంతో స్టూడియో క్వాలిటీ క‌లిగిన ఫొటోల‌ను చిత్రీక‌రించుకోవ‌చ్చు.

అద్భుత‌మైన డిస్‌ప్లే, ప్రాసెస‌ర్‌..

రియ‌ల్‌మి 16 ప్రొ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్ బ‌యో బేస్డ్ ఆర్గానిక్‌ సిలికాన్ బ్యాక్ క‌వ‌ర్‌ను క‌లిగి ఉండ‌గా, ప్రొ మోడ‌ల్ వెల్వెట్ మ్యాట్ ఫినిష్‌ను క‌లిగి ఉంది. రెండు డివైస్‌ల‌లోనూ ఐపీ69 వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు. ప్రొ ప్ల‌స్ మోడ‌ల్‌కు ప్ర‌త్యేకంగా గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్ష‌న్‌ను ఇచ్చారు. ప్రొ ప్ల‌స్ మోడ‌ల్ మాస్ట‌ర్ గోల్డ్‌, మాస్ట‌ర్ గ్రే, క‌మెలియా పింక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లాంచ్ కాగా, ప్రొ మోడ‌ల్‌ను మాస్ట‌ర్ గోల్డ్‌తోపాటు పెబెల్ గ్రే, ఆర్కిడ్ ప‌ర్పుల్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లాంచ్ చేశారు. రియ‌ల్‌మి 16 ప్రొ ప్ల‌స్ ఫోన్‌లో అధునాత‌న స్నాప్ డ్రాగ‌న్ 7 జెన్ 4 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. 6.8 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 1.5కె రిజ‌ల్యూష‌న్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. 6500 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్ ల‌భిస్తుంది. ఇక రియ‌ల్‌మి 16 ప్రొ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ 5జి ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 6.78 ఇంచుల డిస్‌ప్లేను ఇది క‌లిగి ఉంది. దీనికి 1.5కె రిజ‌ల్యూష‌న్‌, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు.

భారీ బ్యాట‌రీ..

ఈ రెండు ఫోన్ల‌లోనూ 7000ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. ప్ర‌త్యేకంగా ఎయిర్ ఫ్లో వీసీ కూలింగ్ సిస్ట‌మ్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఫోన్ అంత త్వ‌ర‌గా హీట్‌కు గురి కాదు. దీని వ‌ల్ల కంటెంట్ క్రియేట‌ర్లు, గేమ‌ర్లు ఫోన్ల‌ను చాలా ఎక్కువ సేపు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక ఈ ఫోన్ల‌లో నెక్ట్స్ ఏఐ ఆధారిత ఏఐ ట్రాన్స్‌లేష‌న్‌, ఏఐ గేమింగ్ కోచ్ వంటి ఏఐ ఫీచ‌ర్ల‌ను, గూగుల్ జెమిని ఏఐ స‌దుపాయాల‌ను కూడా అందిస్తున్నారు. రియ‌ల్ మి 16 ప్రొ, రియ‌ల్‌మి 16 ప్రొ ప్ల‌స్ ఫోన్ల‌లో రెండింటిలోనూ 8జీబీ, 12జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ముందు వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఆప్టిక‌ల్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌ల‌ను ఇచ్చారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి స‌దుపాయాలు ల‌భిస్తున్నాయి.

ధ‌ర వివ‌రాలు..

ఇక రియ‌ల్‌మి 16 ప్రొ ఫోన్ ప్రారంభ ధ‌ర రూ.31,999 ఉండ‌గా, రియ‌ల్‌మి 16 ప్రొ ప్ల‌స్ ప్రారంభ ధ‌ర రూ.39,999గా ఉంది. ఈ ఫోన్ల‌ను రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ విక్ర‌యిస్తున్నారు. ఈ ఫోన్ల‌పై రూ.4వేల వ‌ర‌కు బ్యాంకు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అలాగే టాప్ ఎండ్ మోడ‌ల్స్‌పై 1 ఏడాది పాటు ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ ల‌భిస్తుంది. దీంతోపాటు టాప్ ఎండ్ మోడ‌ల్స్‌ను కొనుగోలు చేస్తే ఓ బ్యాగ్‌ను కూడా గిఫ్ట్‌గా ఇస్తున్నారు. అలాగే ఈ ఫోన్ల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement