త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌తో.. రియ‌ల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్‌..

realme P4s 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ రియల్‌మి భారత మార్కెట్లో నూత‌న‌ రియల్‌మి పి4ఎస్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో భారీ బ్యాటరీ, 144 హెడ్జ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌ వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.78 ఇంచుల 1.5కె 144 హెడ్జ్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. గరిష్ఠంగా 6500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

S

Technology | Published On Aug 26, 2026, 5.09 pm IST

realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌తో.. రియ‌ల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్‌..
Advertisement

realme P4s 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ రియల్‌మి భారత మార్కెట్లో నూత‌న‌ రియల్‌మి పి4ఎస్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో భారీ బ్యాటరీ, 144 హెడ్జ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌ వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.78 ఇంచుల 1.5కె 144 హెడ్జ్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. గరిష్ఠంగా 6500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5జి చిప్‌సెట్‌ను ఇచ్చారు. ఫోన్‌లో 7000 చదరపు మిల్లీమీటర్ల వీసీ కూలింగ్‌ సిస్టమ్‌ ఉంది. గరిష్ఠంగా 12జీబీ ర్యామ్‌తోపాటు 14జీబీ వరకు వర్చువల్‌ ర్యామ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 ఉంది. ఈ ఫోన్‌కు మూడు ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ అప్‌డేట్లు, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.

భారీ బ్యాట‌రీ..

పెర్ల్‌ అకాడమీతో కలిసి రియల్‌మి ఈ ఫోన్‌ను రూపొందించింది. ఫ్లాట్‌ ఫ్రేమ్‌ డిజైన్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్‌ టర్కాయిజ్‌ గ్రీన్‌, లైట్‌ గోల్డ్‌ బేజ్‌ రంగుల్లో లభిస్తోంది. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ ప్ర‌ధాన కెమెరా, 8 మెగాపిక్స‌ల్‌ అల్ట్రావైడ్‌ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్‌ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో 8000 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. 80 వాట్‌ ఫాస్ట్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు ఇది మద్దతు ఇస్తుంది. కేవలం 28 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం వరకు ఛార్జ్‌ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో డిస్‌ప్లేకు ఏజీసీ డీటీ స్టార్ డి ప్లస్‌ గ్లాస్‌ రక్షణను అందించారు. 8జీబీ, 12జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు లభిస్తున్నాయి. డ్యుయల్‌ సిమ్‌ సపోర్ట్‌తోపాటు ఇన్‌-డిస్‌ప్లే ఆప్టికల్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్‌ కూడా ఉన్నాయి. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను ఇచ్చింది. 5జి, డ్యుయల్‌ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్ సి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

రియ‌ల్‌మి పి4ఎస్ 5జి ఫోన్‌కు చెందిన‌ 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.34,999గా ఉంది. రూ.3వేల బ్యాంక్‌ ఆఫర్‌, 12 నెలల వరకు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయంతో దీని ప్రభావవంతమైన ధర రూ.31,999గా ఉంది. 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.37,999గా ఉంది. ఆఫర్‌ అనంతరం దీని ప్రభావవంతమైన ధర రూ.34,999గా ఉంది. 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.41,999 కాగా, ఆఫర్‌ తర్వాత రూ.38,999కు లభిస్తుంది. ఈ ఫోన్ విక్రయాలు సెప్టెంబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Advertisement
Advertisement